Begin typing your search above and press return to search.

సీనియర్లను చూసి బాబు ఎందుకు భయపడుతున్నారు?

By:  Tupaki Desk   |   6 Oct 2018 8:02 AM GMT
సీనియర్లను చూసి బాబు ఎందుకు భయపడుతున్నారు?
X
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పార్టీలోని సీనియర్ లీడర్లను చూసి ఆందోళన చెందుతున్నారట. తన రాజకీయ వారసుడు లోకేశ్ బాబును ఏపీ సీఎం పీఠంపై కుదురుగా కూర్చోనివ్వకుండా సీనియర్లు ఇబ్బందులు స‌ృష్టిస్తారేమోనని ఆయన టెన్షన్ పడుతున్నారట. సో... అలాంటి పరిస్థితి నివారించడం కోసం ఆయన కొత్త ఎత్తుగడతో వచ్చారు. తనలాగే పార్టీలోని సీనియర్ లీడర్లు కూడా తమ పిల్లల రాజకీయ భవిష్యత్తు కోసం చూస్తున్నారు. ఆ పాయింటునే చంద్రబాబు ఇప్పుడు సరిగ్గా వాడుకుంటున్నారు. ఈసారి మీకు కాకుండా మీ పిల్లలకు టిక్కెట్లిస్తాను అంటూ వారి రాజకీయ భవిష్తత్తుకు బీజం వేస్తున్నట్లుగా బిల్డప్ ఇస్తూ నారా లోకేశ్‌ కు సీనియర్ల అడ్డును తొలగిస్తున్నారు.

వాస్తవానికి 2019 ఎన్నికల్లో టీడీపీ గెలిచే అవకాశాలు ఏమాత్రం లేనప్పటికీ గత ఎన్నికల మాదిరిగా కాలం కలిసొచ్చి బయటపడితే లోకేశ్ సీఎంను చేయాలన్నది చంద్రబాబు కోరికగా టీడీపీ నేతలు చెబుతున్నారు. కానీ, ఇప్పటికే లోకేశ్‌ ను ఎలివేట్ చేసిన తీరుపై పార్టీలో సీనియర్లు మండిపడుతున్నారు. అలాంటిది ఏకంగా సీఎంని చేస్తే సీనియర్ల అడుగడుగునా ఇబ్బందులు పెట్టే ప్రమాదముందని చంద్రబాబు అనుకుంటున్నారట. అందుకే... పూర్తిగా కుర్రాళ్లే ఉంటే లోకేశ్‌ ను వారు తమ నేతగా ఆమోదించే అవకాశముంటుందని అనుకుంటున్నారట.

అయితే... కొందరు సీనియర్లు ఇప్పటికీ లోకేశ్ కింద పనిచేయడానికి ఇష్టపడడం లేదట. అందుకే వారు తెలివిగా రాజ్యసభకు వెళ్లిపోయి ఈ ఉత్పాతం నుంచి బయటపడాలనకుంటున్నారట. అందులో భాగంగానే యనమల వంటివారు రాజ్యసభకు వెళ్తామని చంద్రబాబును అడుగుతున్నట్లు చెబుతున్నారు. మొత్తానికి లోకేశ్‌ ను బలవంతంగా పార్టీపై రుద్దుతున్నారన్నమాట చంద్రబాబు.