Begin typing your search above and press return to search.

బాబు ఆక‌ర్ష్‌ అస‌లు మ‌ర్మం ఇది

By:  Tupaki Desk   |   27 Feb 2016 7:17 AM GMT
బాబు ఆక‌ర్ష్‌ అస‌లు మ‌ర్మం ఇది
X
ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌...దివంగ‌త ముఖ్య‌మంత్రి రాజ‌శేఖ‌ర్ రెడ్డి ప్రారంభించిన ఈ పిరాయింపుల ప‌ర్వం ఇపుడు తెలుగు రాష్ర్టాల్లో జోరుగా సాగుతోంది. తెలంగాణ‌లో టీడీపీని దెబ్బ‌తీసేందుకు గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ ఉప‌యోగించి ఫార్ములానే ఏపీలో అధికార టీడీపీ కూడా ప్రారంభించింది. అంతేకాకుండా తాజాగా ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌ను ముమ్మరం చేసి ప్రతిప‌క్ష ఎమ్మెల్యేల‌ను త‌మ వైపు తిప్పుకుంటోంది. టీఆర్ ఎస్‌ కు బొటాబొటీ మెజార్టీ ఎమ్మెల్యేల మ‌ద్ద‌తే ఉంది కాబ‌ట్టి ఈ విధంగా చేశార‌ని అనుకోవ‌డంలో అర్థం ఉంద‌ని...టీడీపీ ఎందుకిలా చేస్తోంద‌ని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు. దీనిపై తెలుగుదేశం వ‌ర్గాలు ఆస‌క్తిక‌ర‌మైన వాద‌న వినిపిస్తున్నాయి.

టీడీపీ ఆప‌రేష‌న్ ఆకర్ష్‌ ను ముమ్మరం చేయ‌డం వెనుక రెండు వ్యూహాలు ఉన్నాయ‌ని స‌మాచారం. త్వరలో రాజ్యసభకు ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ కానున్నాయి. అధికార టీడీపీ - ప్రతిప‌క్ష వైసీపీకి ప్ర‌స్తుతమున్న‌ ఎమ్మెల్యేల బ‌లాబలాల‌ను బట్టి టీడీపీకి రెండు - వైసీపీకి ఒక రాజ్యసభ సీటు ద‌క్కుతాయి. నాలుగో సీటుకోసం పోటీ ఉంటుంది. అయితే వైసీపీకి ఖాయంగా ద‌క్కే ఒక్క రాజ్యసభ సీటును కూడా ఫ్యాన్ పార్టీ ఖాతాలోకి వెళ్లకుండా ఉండేందుకు టీడీపీ వ్యూహాలు ర‌చిస్తోంది. అందులో భాగంగానే వైసీపీ ఎమ్మెల్యేల‌ను త‌మ వైపుకు తిప్పుకోవాల‌ని అధికార పార్టీ పావులు క‌దుపుతోంది.

రాజ్య‌స‌భ సీటు గెలుచుకోవాలంటే 43 మంది ఎమ్మెల్యేల బ‌లం ఉండాలి. టీడీపీకి 102 మంది ఎమ్మెల్యేల బ‌లం ఉంది. వైసీపీకి 67 మంది ఎమ్మెల్యేల బ‌లం ఉంది. బీజేపీకి 5గురు ఎమ్మెల్యేల బ‌లం ఉంది. దీంతో టీడీపీ రెండు రాజ్యసభ‌ - వైసీపీ ఒక రాజ్యసభ సీటు గెలుచుకోవ‌డం చాలా సులువు. అయితే మ‌రో సీటు ద‌క్కించుకోవ‌డానికి ఏ పార్టీకి స‌రైన మెజార్టీ లేదు. ఈ స‌మీక‌ర‌ణాల నేప‌థ్యంలో ఏపీలో ఖాళీ కానున్న నాలుగు రాజ్యసభ స్థానాల‌ను తామే దక్కించుకోవాల‌నే వ్యూహంతో టీడీపీ చ‌క‌చ‌కా పావులు క‌దుపుతూ కండువాలు క‌ప్పేస్తోంద‌ట‌.