Begin typing your search above and press return to search.
బాబు 'ప్రత్యామ్నాయం' అందుకేనా...!?
By: Tupaki Desk | 11 Nov 2018 5:35 AM GMTతెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు - ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి పని ఏపీలో అయిపోయనట్లేనా...? అందుకే ఆయన తన ప్రత్యామ్నాయాన్ని చూసుకుంటున్నారా...? భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా బద్ద శత్రువైన కాంగ్రెస్ పార్టీతో కలవడానికి కూడా వెనుకాడకపోవడానికి కారణం ఇదేనా... ? అని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ ప్రశ్నలన్నింటికి అవుననే సమాధానం రావడం విశేషం. ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డికి నానాటికీ ప్రజాదరణ పెరుగుతూండడం - భారతీయ జనతా పార్టీ తనపై వ్యక్తిగత కక్ష పెంచుకోవడం - జనసేనాని పవన్ కల్యాణ్ కూడా తననే టార్గెట్ చేయడంతో చంద్రబాబు నాయుడిలో అభద్రతా భావం పెరిగిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తన కుమారుడు అనుకున్న..ఆశించిన స్ధాయిలో రాణించలేకపోవడం కూడా చంద్రబాబు నాయుడిని మానసికంగా ఇబ్బందుల పాలు చేస్తోందని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో వచ్చే సంవత్సరం మార్చిలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అధికారం రావడం కష్టమని వివిధ సర్వేలు తేలుస్తున్నాయి. అలాగే తానే చేయించుకున్న సర్వేలో కూడా తెలుగుదేశం పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకత వస్తున్నట్లుగా నివేదికలు వస్తున్నాయి. దీంతో చంద్రబాబు నాయుడు ఇప్పటి నుంచే తన భవిష్యత్ ప్రణాళికలు రూపొందించుకునే పనిలో పడ్డారని రాజకీయ పండితులు అంటున్నారు.
తెలంగాణలో మహాకూటమి ఓటమి పాలై తిరిగి తెలంగాణ రాష్ట్ర సమితి విజయం సాధించే అవకాశాలున్నాయంటున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమనే వార్తలు వస్తున్నాయి. ఇక కేంద్రంలో కూడా భారతీయ జనతా పార్టీయే అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడి పరిస్థితి దారుణంగా మారుతుందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. ఒక్క ఓటుకు నోటు కేసులోనే ఆయన్ని ఇరికించి ముప్పుతిప్పలు పెట్టేందుకు కేంద్రం - తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ పాలకులు ప్రయత్నిస్తారని అంటున్నారు. ఈ ప్రమాదాన్ని ముందే పసిగట్టిన చంద్రబాబు నాయుడు ఏడాది ముందుగానే కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపాలనుకున్నారని - పనిలో పనిగా జాతీయ - ప్రాంతీయ పార్టీల వారితో కూడా కలిసి తన భవిష్యత్ బాగుండేలా పావులు కదుపుతున్నారని అంటున్నారు. ఇందులో భాగంగానే కర్నాటక - తమిళనాడు - ఉత్తర్ ప్రదేశ్ - కోల్ కతా - ఢిల్లీలకు తానే స్వయంగా వెళ్లి అక్కడి నాయకులతో సమావేశమవుతున్నారని అంటున్నారు. మరోవైపు జాతీయ మీడియాను కూడా తన వైపు తిప్పుకునేందుకు చంద్రబాబు నాయుడు తన ప్రయత్నాలు ప్రారంభించినట్లు చెబుతున్నారు. ఈ సంఘటనల నేపథ్యంలో చంద్రబాబు నాయుడికి కౌంట్ డౌన్ ప్రారంభమైనట్లేనని రాజకీయ పండితులు చెబుతున్నారు.