Begin typing your search above and press return to search.
బాబు ఆయనతో కేంద్రంపై కేసులు వేయిస్తారా!
By: Tupaki Desk | 12 March 2018 3:50 AM GMTచంద్రబాబు నాయుడు అనూహ్యమైన రీతిలో కనకమేడల రవీంద్ర కుమార్ పేరును తెరపైకి తీసుకువచ్చి.. ఆయనకు రాజ్యసభ ఎంపీ పదవిని కట్టబెట్టడం మీద ఇప్పుడు పార్టీ వర్గాల్లోనే విస్తృతంగా చర్చ జరుగుతోంది. కనకమేడల అంటే తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు. 35ఏళ్లుగా పార్టీలోనే ఉన్న ఆయన 22 ఏళ్లుగా లీగల్ సెల్ లో ఉంటూ చంద్రబాబు మీద వస్తున్న కేసులను - పార్టీలో ఇతర నాయకుల మీద వస్తున్న కేసులను చూస్తున్నారు. వీరందరినీ.. కేసులనుంచి బయటపడేయడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నట్లుగా పుకార్లు ఉన్నాయి. ఆయన హైకోర్టులో సీనియర్ న్యాయవాది.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇప్పుడు ఆయన సేవల్ని ఇంకా మరింత కాలం పార్టీ నాయకుల మీద కేసులకోసం వాడుకోకుండా.. ఎందుకు రాజ్యసభకు పంపుతున్నట్లు? అనే ప్రశ్న ఎవరికైనా వస్తుంది. కాకపోతే.. ఇప్పుడు విభజన చట్టం నేపథ్యంలో కేంద్రంతో ఏర్పడిన ప్రతిష్టంభన దృష్ట్యా.. చంద్రబాబునాయుడు.. మోడీ సర్కారు మీద న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నారా? అనే చర్చ పార్టీలో నడుస్తోంది.
అందుకు ముందస్తు సన్నాహాలుగానే.. కనకమేడలను రాజ్యసభ ఎంపీని చేసి.. ఢిల్లీ కేంద్రంగా ఆయనను తిష్ట వేయించి.. అక్కడే సుప్రీం కోర్టులో కేంద్రం కేసు వేయించి.. న్యాయపోరాటం చేయాలని చంద్రబాబు అనుకుంటున్నట్లుగా సమాచారం.
కేంద్రం కూడా తమ తగాదా వ్యవహారాన్ని అ త తేలిగ్గా తీసుకునే అవకాశం లేదని చంద్రబాబుకు తెలుసు. తాము భాజపా గురించి.. దుష్ప్రచారం సాగిస్తున్న కొద్దీ. .. ముందు ముందు తమ పార్టీ నాయకుల మీద మంత్రుల మీద ఇబ్బంది పెట్టగల కేసులు కేంద్రం తరఫున కూడా తెరపైకి రాగలవని ఆయనకు అంచనా ఉంది. అలాంటి వేధింపులు ఉంటాయని ఆయన అంచనా వేస్తున్నారు. కేంద్రం ఏయే వ్యవహారాలపై చంద్రబాబు మరియు ఇతర సహచరులను ఇబ్బందిపెట్టగల అవకాశం ఉన్నదో.. ఆయనకు ఇప్పటికే సమాచారం ఉన్నదని కూడా పుకార్లున్నాయ. అలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు.. మరింత శ్రద్ధగా వాటినుంచి బయట పడేయడానికి తమ న్యాయనిపుణుడు కనకమేడలకు మంచి పదవీ భాగ్యం కల్పిస్తే బాగుంటుందని ఈ ప్రయత్నం చేసినట్లుగా చెబుతున్నారు. మొత్తానికి న్యాయ విభాగం అవసరం ముందు ముందు చంద్రబాబుకు బాగా ఉన్నట్టుందని రాజకీయ వర్గాల్లో అనుకుంటున్నారు.