Begin typing your search above and press return to search.
శంకుస్థాపనకు సర్ పిలుపుల వెనుక మర్మమేంది?
By: Tupaki Desk | 21 Oct 2015 4:21 AM GMTనిన్నమొన్నటి వరకూ కత్తులు దూసుకున్న ఇద్దరు అగ్రనేతల మధ్య కొత్త ప్రేమలు మొదలయ్యాయి. అదంతా ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన పుణ్యంగానే చెప్పాలి. శంకుస్థాపన కార్యక్రమం కోసం కేసీఆర్ ను ఆహ్వానించేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ తీసుకుంటే.. అందుకు ప్రతిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించటం.. ఇరువురు కలిసి కూర్చోవటమే కాదు.. ఏకాంతంగా 25 నిమిషాల సేపు మాట్లాడుకోవటం అంత చిన్న విషయమేమీ కాదు.
కేసీఆర్ ను చంద్రబాబు ఎందుకు పిలిచారు? దాని వెనుక ఉద్దేశ్యం ఏమిటి? లాంటి ప్రశ్నలకు చాలానే విశ్లేషణలు ఉన్నా.. ఆ విషయానికి సంబంధించి చంద్రబాబు ఏమంటారన్నది ఆసక్తికరమే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఎందుకు ఆహ్వానించామన్న విషయానికి బాబు చెబుతున్న మాటేమిటంటే చూస్తే కాస్త ఆసక్తికరంగా కనిపిస్తుంది.
ప్రభుత్వాలు వేరు అయినా తెలుగు జాతి అంతా ఒక్కటేనని.. సమస్యలు వచ్చి పోతుంటాయని.. వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవాలన్న మాటను చంద్రబాబు చెబుతున్నారు. విభజన సమయంలో ఎలానూ నష్టపోయామని.. ఇలాంటి పరిస్థితుల్లో విభేదాలతో ముందుకెళ్లటం రెండు రాష్ట్రాలకు నష్టమేనని.. పాజిటివ్ గా ముందుకు వెళ్లాలన్నదే తన కోరికగా చంద్రబాబు చెబుతున్నారు.
ఈ కారణంగానే తాను కేసీఆర్ ను కలిసి.. అమరావతికి ఆహ్వానించినట్లుగా చెబుతున్నారు. తెలంగాణకు ఇచ్చింది తిరిగి ఇవ్వాలని తాను ఎన్నడూ కోరలేదని.. విభజన తర్వాత ఏర్పడిన నష్టాన్ని భర్తీ చేయాలని మాత్రమే డిమాండ్ చేస్తున్నానని చెప్పటం ద్వారా.. కేంద్రం నుంచి తనకేం కావాలన్న విషయాన్ని బాబు చెప్పకనే చెప్పేశారు.
అమరావతి శంకుస్థాపన సందర్భంగా ఇద్దరు చంద్రుళ్లు ఏకాంతంగా మాట్లాడుకున్న అంశాల్ని ప్రస్తావించినప్పుడు.. రెండు ప్రభుత్వాలు అభివృద్ధి దిశగా ఎలా ముందుకు సాగాలన్న విషయాన్నే తామిద్దరం కూర్చొని మాట్లాడుకున్నట్లుగా చంద్రబాబు చెప్పుకొచ్చారు. నిజమేనా..? తెలుగు రాష్ట్ర ప్రజల పట్ల ఇద్దరు చంద్రుళ్లు ఇంత సీరియస్ గా ఆలోచిస్తున్నారా? అన్న ప్రశ్నలకు ఇరువురి మధ్య భవిష్యత్తులో ఉండే సంబధాలు చెప్పకనే చెప్పేయటం ఖాయం.