Begin typing your search above and press return to search.

గ‌వ‌ర్న‌ర్ తో బాబు భేటీ.. రాయ‌బార‌మేనా?

By:  Tupaki Desk   |   7 Jun 2019 2:30 PM GMT
గ‌వ‌ర్న‌ర్ తో బాబు భేటీ.. రాయ‌బార‌మేనా?
X
టీడీపీ అధినేత‌.. ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు త‌త్త్వం నెమ్మ‌దినెమ్మ‌దిగా బోధ ప‌డుతోందా? రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ ను పెద్ద‌గా ఇష్ట‌ప‌డ‌ని ఆయ‌న‌.. తాజాగా న‌ర‌సింహ‌న్ ను ఎందుకు క‌లిసిన‌ట్లు? అన్న‌దిప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

ముఖ్య‌మంత్రిగా ఉన్న వేళ‌లో గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ తో మాట్లాడేందుకు.. ఆయ‌న‌తో స‌మావేశం అయ్యేందుకు బాబు పెద్ద‌గా ఆస‌క్తి ప్ర‌ద‌ర్శించే వారు కాదు. అలాంటి బాబు.. అందుకు భిన్నంగా ఇప్పుడు గ‌వ‌ర్న‌ర్ తో భేటీ కావ‌టం వెనుక కార‌ణం వేరే ఉంద‌న్న మాట వినిపిస్తోంది. ఊహించ‌నిరీతిలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం దూసుకెళుతున్న వేళ‌.. పాల‌నా ప‌రంగా ఆయ‌న జెట్ స్పీడ్ తో ముందుకెళుతున్న వేళ‌.. రాజ‌ధాని భూములు మొద‌లు ప‌లు టెండ‌ర్ల విష‌యంలో ఆయ‌న విచార‌ణకు ఆదేశించే దిశ‌గా అడుగులు వేస్తున్న విష‌యం తెలిసిందే.

ఇదంతా ఒక ఎత్తు అయితే సీబీఐ మీద ఏపీలో ఉన్న ప‌రిమితిని ఎత్తి వేస్తూ తీసుకున్న నిర్ణ‌యం బాబును టార్గెట్ చేసేందుకే అన్న చ‌ర్చ జోరుగా సాగుతున్న వేళ‌.. గ‌వ‌ర్న‌ర్ తో బాబు భేటీ ప్రాధాన్య‌త సంత‌రించుకుంద‌ని చెప్పాలి. మోడీతో సున్నం పెట్టుకోవ‌టం ద్వారా త‌న‌కు జ‌రిగిన న‌ష్టం ఎంత‌న్న విష‌యాన్ని బాబు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకోవ‌టంతో పాటు.. రానున్న రోజుల్లో త‌న ఉనికి సైతం ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితుల్లోకి వెళ్లిపోతుంద‌న్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఇలాంటివేళ‌.. జ‌రిగిందేదో జ‌రిగింది. ఇక‌పై మాత్రం నా దారి నాది.. మీ దారి మీది అన్న రాజీ ప్ర‌తిపాద‌న‌ను గ‌వ‌ర్న‌ర్ ముందు పెట్ట‌టం ద్వారా.. మోడీ మాష్టారికి సంధి చేసుకోవాల‌ని భావిస్తున్నారా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. గ‌వ‌ర్న‌ర్ ను క‌లిసిన సంద‌ర్భంగా ఆయ‌న‌కు ఇచ్చిన బొకేను ప‌సుపుపచ్చ గులాబీలతో తీసుకెళ్లిన ఆయ‌న‌.. సాయం కోస‌మే భేటీ అయిన‌ట్లుగా చెబుతున్నారు. మ‌రీ.. వాద‌న‌లో నిజం ఎంత‌న్న విష‌యం.. రానున్న రోజుల్లో చోటు చేసుకునే ప‌రిణామాలు స్ప‌ష్టం చేస్తాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.