Begin typing your search above and press return to search.

ఎప్పుడూ నిందలేనా చంద్ర‌బాబు?

By:  Tupaki Desk   |   11 July 2019 4:48 AM GMT
ఎప్పుడూ నిందలేనా చంద్ర‌బాబు?
X
ఎదుటోడు స‌రైనోడు కాద‌నే అనుకుందాం. వాళ్లు త‌ప్పు చేశార‌ని.. మ‌నం కూడా అదే త‌ప్పు చేస్తామా? విచ‌క్ష‌ణ‌తో వ్య‌వ‌హ‌రించ‌ని వారిని చూసి వాత‌లు పెట్టుకోం క‌దా? అదేం ద‌రిద్ర‌మో కానీ ఎవ‌రో ఒక‌రి మీద నింద‌లేసి బ‌తికేసే తీరును ఎంత‌కూ మార్చుకోని త‌త్త్వం ఏపీ విప‌క్ష నేత చంద్ర‌బాబులో క‌నిపిస్తుంది.

అనునిత్యం ఏదో ఒక నింద వేస్తే కానీ పొద్దుపోద‌న్న‌ట్లుగా ఆయ‌న తీరు ఉంటుంది. మొన్న జ‌రిగిన ఏపీ అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంలో స్పీక‌ర్ ఎన్నిక త‌ర్వాత‌.. ఆయ‌న్ను స్పీక‌ర్ కుర్చీలో కూర్చొబెట్టేందుకు అధికార‌ప‌క్ష నేత‌.. ప్ర‌తిప‌క్ష నేత ఇద్ద‌రు క‌లిసి వెళ్ల‌టం సంప్ర‌దాయం. అయితే..త‌న‌కు ఆహ్వానం అంద‌లేద‌న్న పేరుతో స్పీక‌ర్ కు ఇవ్వాల్సిన గౌర‌వాన్ని ఇవ్వకుండా ఉండిపోయారు. త‌న‌కు ఇన్విటేష‌న్ లేక‌పోవ‌టంతో తాను రాలేద‌న్నారు.

బాబు తీరుపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్త‌టంతో డిప్యూటీ స్పీక‌ర్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా త‌న తీరును మార్చుకొని గౌర‌వాన్ని నిలుపుకున్నారు చంద్ర‌బాబు.

తాజాగా జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంగా నిర్వ‌హించిన బీఏసీ స‌మావేశానికి బాబు హ‌జరు కాలేదు. స‌భా నిర్వ‌హ‌ణ ఎలా చేయాలి? స‌భ‌లో ఏయే అంశాల‌కు ఎంత ప్రాధాన్యం ఇవ్వాల‌న్న వాటితో పాటు ఎన్ని రోజులు స‌మావేశాల్ని నిర్వ‌హించాల‌న్న విష‌యం మీదా నిర్ణ‌యం తీసుకుంటారు. ఇంత కీల‌క‌మైన స‌మావేశానికి చంద్ర‌బాబు గైర్హాజ‌రు హాజ‌ర‌య్యారు.

ఎందుకంటే.. ఎప్ప‌టిలానే ఈసారి రొడ్డుకొట్టుడు డైలాగును వ‌ల్లె వేసే ప్ర‌య‌త్నం చేశారు. అయితే.. ఈసారి ఆయ‌న ఎత్తులు పార‌లేదు. ఆయ‌న చెప్పిందంతా అబ‌ద్ధ‌మ‌న్న విష‌యం తేలిపోయింది. చివ‌రి నిమిషంలో బీఏసీ స‌మావేశం స‌మాచారం అందించార‌ని.. ఆ కార‌ణంగానే బాబు రాలేద‌ని క‌వ‌ర్ చేసే ప్ర‌య‌త్నం చేశారు తెలుగు త‌మ్ముళ్లు.

దీనిపై పాల‌క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పందించింది. బీఏసీ సమావేశం స‌మాచారాన్ని ముందు రోజు ఉద‌య‌మే తెలియ‌జేశామ‌ని.. కానీ బాబు రాలేద‌ని చెప్పారు. దీంతో దిక్కుతోచ‌ని ప‌రిస్థితుల్లో చిక్కుకున్న త‌మ్ముళ్లు క‌వ‌ర్ చేసేందుకు మ‌రో నాట‌కానికి తెర తీశారు. బీఏసీ స‌మావేశానికి త‌క్కువ‌మంది టీడీపీ స‌భ్యుల‌కు అవ‌కాశం క‌ల్పించార‌ని వ్యాఖ్యానించారు. నిబంధ‌న‌ల ప్ర‌కారం టీడీపీకి చెందిన 0.5 మందికే అవ‌కాశం ఇవ్వాల‌ని.. ఆ లెక్క‌న చూసిన‌ప్పుడు తాము రూల్స్ ను పాటించామా? లేదా? అన్న‌ది చూడాలంటూ జ‌గ‌న్ పార్టీ నేత‌ల‌కు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి త‌మ్ముళ్ల నోటి నుంచి స‌మాధానం రాని ప‌రిస్థితి.