Begin typing your search above and press return to search.
చంద్రబాబు ముందుచూపు-2
By: Tupaki Desk | 14 Oct 2015 11:30 AM GMTఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టమంటూ చంద్రబాబు దేశాలన్నీ తిరుగుతున్నారు. అయితే... అగ్రరాజ్యం అమెరికా వైపు మాత్రం ఆయన కన్నెత్తి కూడా చూడడంలేదు.. పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచంలో అమెరికాను మించిపోయే దేశమేదీ లేదు. అయినా చంద్రబాబు ఆ వైపు చూడడం లేదు. చాలామందికి దీనిపై ఇప్పటికే సందేహాలు వచ్చి ఉంటాయి... కానీ, సమాధానం తెలిసినవారు కొందరే. అమెరికా ధనిక దేశమే కావొచ్చు.... కానీ, దాని ఆర్థిక విధానాలు మిగతా దేశాలకంటే భిన్నం.... ఎంతో సంపద ఉన్న ఆ దేశం పెట్టుబడులు పెట్టడమే కాదు పెట్టుబడులను ఆహ్వానిస్తోంది కూడా. ఈ పరిణామాన్ని ఊహించడంతోనే చంద్రబాబు అమెరికా వైపు చూడలేదు. అమెరికాయే ఇతర దేశాల నుంచి పెట్టుబడులు కోరుతోందని అర్థం చేసుకున్న ఆయన అమెరికాలో పెట్టుబడులకు ప్రయత్నాలు చేయడంలేదు... కేవలం అక్కడ పెద్ద సంఖ్యలో ఉన్న ప్రవాసాంధ్రులను ఏపీ గ్రామాలను దత్తత తీసుకునేలా మాత్రమే ప్రోత్సహిస్తున్నారు.
అమెరికా ఇతర దేశాల నుంచి పెట్టుబడులు తీసుకోవడమా... ''నో... నెవ్వర్'' అనుకునేవారూ ఉన్నారు. కానీ... నమ్మి తీరాలి.. ఏ దేశం నుంచో కాదు, ఇండియా నుంచి కూడా అమెరికా పెట్టుబడులు కోరుకుంటోంది. మన దేశ ప్రతినిధులు... ఏపీ ప్రతినిధులు విదేశాల్లో పెట్టుబడుల సాధన ప్రయత్నాలు చేస్తున్నట్టే అమెరికా కూడా పెట్టుబడుల కోసం ఇండియాకు వస్తోంది. భారత నగరాల్లో రోడ్ షోలు కూడా నిర్వహిస్తోంది.
ఇండియాలో అమెరికా ఇందుకోసం మొట్టమొదటి రోడ్ షో మంగళవారం ఢిల్లీలో నిర్వహించింది. భారతీయ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ఢిల్లీ - చెన్నై - ముంబయి, కోల్ కతాల్లో అక్టోబరు 13 నుంచి 16 వరకు ఇలాంటి రోడ్ షోలను నిర్వహిస్తున్నారు. ఇందుకోసం అమెరికా వాణిజ్య శాఖ ఏకంగా ''సెలక్ట్ యూఎస్ ఏ" అనే పథకం ఏర్పాటుచేసి రోడ్ షోలు నిర్వహిస్తోంది. వాణిజ్య, పారిశ్రామిక వర్గాలు, ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలతో అమెరికా ప్రతినిధులు భేటీ అవుతున్నారు.
...కాగా అమెరికా ఇలా పెట్టుబడుల కోసం ప్రపంచం వైపు, భారత్ వైపు చూస్తుందని తెలిసే చంద్రబాబు ఆ దేశానికి వెళ్లలేదంటున్నారు ఆర్థిక నిపుణులు. స్వయంగా చంద్రబాబు ఆర్థికవేత్తని... ఆయన ప్రపంచ ఆర్థికపోకడలను నిత్యం గమనిస్తుంటారని... దానివల్లే అమెరికా విధానాలను ముందే అర్థం చేసుకుని ఇతర దేశాలపై దృష్టిపెట్టారని ఆర్థికరంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
-- గరుడ