Begin typing your search above and press return to search.

బాబుకు అంద‌ని ఆహ్వానంపై క‌వ‌రింగ్ మొద‌లైంది

By:  Tupaki Desk   |   17 Dec 2017 5:30 PM GMT
బాబుకు అంద‌ని ఆహ్వానంపై క‌వ‌రింగ్ మొద‌లైంది
X
డామిట్ క‌థ అడ్డం తిరిగింద‌న్న‌ట్లుగా మారింది ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల వ్య‌వ‌హారం. తెలుగు ప్ర‌చారానికి అస‌లుసిస‌లు బ్రాండ్ అంబాసిడ‌ర్ అన్న భావ‌న‌తో పాటు.. తెలుగుకు తెలంగాణే పుట్టిల్లు అన్న భావ‌న‌ను మ‌రింత క‌ల్పించే ప్ర‌యతంలో భాగంగా రూ.60 కోట్ల భారీ ఖ‌ర్చుతో ఐదు రోజుల తెలుగు పండుగ‌ను నిర్వ‌హిస్తోంది తెలంగాణ రాష్ట్ర స‌ర్కారు.

త‌న ఉద్దేశ‌మే తెలంగాణ ప్ర‌మోష‌న్ కావ‌టంతో.. స‌హ‌జంగానే ఏపీని ప‌క్క‌న పెట్టేశారు. పేరుకు తెలుగు మ‌హా స‌భ‌లు అయిన‌ప్ప‌టికీ.. నిర్వ‌హించేది మాత్రం తెలంగాణ స‌భ‌ల‌న్న విష‌యాన్ని ఒక‌ట్రెండు ప్ర‌ముఖ మీడియా సంస్థ‌లు త‌మ‌దైన శైలిలో చెప్ప‌క‌నే చెప్పేశాయి. ఇదిలా ఉంటే.. కేసీఆర్ ప‌వ‌ర్ పుణ్య‌మా అని.. ఏపీ ప్రాంతానికి చెందిన వారికి మ‌హాస‌భ‌ల్లో ఏ మాత్రం ప్రాధాన్య‌త ఇవ్వ‌క‌పోవ‌ట‌మే కాదు.. మ‌హాస‌భ‌ల సంద‌ర్భంగా ఏపీ సాహిత్య‌వేత్త‌లు.. ఏపీ ప్రాంతానికి చెందిన ప్ర‌ముఖుల ప్ర‌స్తావ‌న లేకుండా బండి లాగిస్తున్నారు.

అయితే.. ఈ తీరుపై ఎలాంటి విమ‌ర్శ‌లు రాకుండా ఉండేందుకు ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు ఎన్ని తీసుకున్న‌ప్ప‌టికీ జ‌ర‌గాల్సిన డ్యామేజ్ జ‌రిగిపోయింది. పేరుకుప్ర‌పంచ తెలుగు మ‌హా స‌భ‌లు కానీ.. ఇవ‌న్నీ తెలంగాణ మ‌హా స‌భ‌లు అన్న మాట అంద‌రి మ‌న‌సుల్లో నాటుకు పోయింది. తెలుగు పేరుతో నిర్వ‌హిస్తున్న ఈ భారీ స‌భ‌ల విష‌యంలో ప్రాంతాల‌కు అతీతంగా తెలుగువారంద‌రిని ఒకే వేదిక కింద‌కు తీసుకొస్తే బాగుండేద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మైంది.

అయితే.. ఈ స‌భ‌ల నిర్వ‌హ‌ణ ఉద్దేశం వేరు కావ‌టంతో చాలామంది ప్ర‌ముఖులు నోరు విప్ప‌లేదు. అయితే.. ఇటీవ‌ల కాలంలో య‌మా యాక్టివ్ అయిన సోష‌ల్ మీడియా కేసీఆర్ త‌ప్పును ఎత్తి చూపింది. స‌హ‌జంగానే ఈ వ్య‌వ‌హారం వైర‌ల్ అయ్యింది.

ఇదంతా సోష‌ల్ మీడియాలో హాట్ హాట్ గా సాగుతున్నా.. మీడియాలో మాత్రం ఇలాంటి వాటికిఎలాంటి స్థానం ఇవ్వ‌ని ప‌రిస్థితి. ఇలాంటి వేళ‌.. అవ‌ధాని గ‌రిక‌పాటి లాంటి వారు గొంతు విప్ప‌టంతో విష‌యం ఒక్క‌సారిగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అప్ప‌టివ‌ర‌కూ కామ్ గా ఉన్న టీవీ ఛాన‌ళ్లు గొంతు స‌ర్దుకున్నాయి. దీంతో.. సీన్ ఒక్క‌సారిగా మారపోయింది. ఏపీ ప్రాంత సీఎంను ఎందుకు పిల‌వ‌లేద‌న్న చ‌ర్చ షురూ అయ్యింది.

ఏదైతే జ‌ర‌గ‌కూడ‌ద‌ని తెలంగాణ ప్ర‌భుత్వ పెద్ద‌లు మొద‌ట్నించి అనుకుంటున్నారో.. స‌రిగ్గా అదే జ‌ర‌గ‌టంతో దిద్దుబాటు చ‌ర్య‌ల్ని మొద‌లెట్టింది. త‌న అనుకూల మీడియాతో ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ఆహ్వానాన్ని ఎందుకు పంప‌లేదో అన్న విష‌యాన్ని చెప్పే ప్ర‌య‌త్నం చేసింది.

చంద్ర‌బాబుకు ఆహ్వానం పంప‌క‌పోవ‌టం వెనుక త‌మ‌కు ఎలాంటి దురుద్దేశం లేద‌ని.. బాబుకు ఖాళీ లేక‌పోవ‌టంతోనే పిల‌వ‌లేద‌న్న క‌వ‌రింగ్ వాద‌న‌ను తెర మీద‌కు తీసుకొచ్చారు. కేసీఆర్ కు భ‌జ‌న బృందంలో భాగ‌మైన ఒక ప్ర‌ముఖ మీడియా సంస్థ‌లో దీనికి సంబంధించి ఆస‌క్తిక‌ర వార్త ఒక‌టి అచ్చేశారు. తెలుగు మ‌హాస‌భ‌ల ముగింపు కార్య‌క్ర‌మానికి రాష్ట్రప‌తి కోవింద్ తో పాటు.. ఏపీ ముఖ్య‌మంత్రిని కూడా పిల‌వాల‌ని అనుకున్నార‌ని.. రెండు ప్ర‌భుత్వాల‌కు స‌న్నిహితంగా ఉండే వ్య‌క్తి ఒక‌రు బాబు డేట్స్ గురించి అడిగితే.. ముగింపు దినోత్స‌వం వేళ త‌న ప్రోగ్రాం ఫిక్స్ అయ్యింద‌ని చెప్పిన‌ట్లుగా పేర్కొన్నారు.

ఈ కార‌ణంతోనే బాబును ఆహ్వానించ‌లేదు త‌ప్పించి.. తెలంగాణ ప్ర‌భుత్వం ఎలాంటి త‌ప్పు చేయ‌లేద‌న్న వాద‌న‌ను వినిపించింది ఈ మొత్తం వ్య‌వ‌హారం అధికారికంగా కాకుండా ఇద్ద‌రు చంద్రుళ్ల‌కు స‌న్నిహితంగా ఉండే వారి మ‌ధ్య న‌డిచిన‌ట్లుగా స‌ద‌రు మీడియా సంస్థ పేర్కొంది. నిజానికి బాబు రావాల‌ని అనుకుంటే.. సీఎం కేసీఆర్ ఫోన్ చేసి పిలిస్తే.. బాబు రెక్క‌లు క‌ట్టుకొని వాల‌కుండా ఉంటారా?

అయినా.. ఏ మాత్రం అవ‌కాశం వ‌చ్చినా చంద్ర‌బాబు ఇమేజ్ ను డ్యామేజ్ చేసేందుకు రాజ‌కీయంగా ఏ అవ‌కాశాన్ని వ‌దిలిపెట్ట‌ని కేసీఆర్‌.. బాబుకు అధికారికంగా ఆహ్వానం అందించి త‌న బాధ్య‌తను పూర్తి చేసుకోకుండా ఉంటారా? బాబు లాంటి నేత ఎంత బిజీ అయినా.. కేసీఆర్ పిల‌వాలే కానీ.. వెళ్ల‌కుండా ఉంటారా? అయితే.. ఇలాంటి వాద‌న‌కు భిన్నంగా.. కేసీఆర్ కు జ‌రుగుతున్న డ్యామేజ్ ను కంట్రోల్ చేయ‌టానికి వీలుగా చంద్ర‌బాబుకు ఖాళీ లేక‌పోవ‌టం వ‌ల్లే కార్య‌క్ర‌మానికి ఆహ్వానించ‌లేద‌న్న వార్త‌ను అచ్చేయించిన‌ట్లుగా చెబుతున్నారు.

ఈ వార్త‌ను చూసి.. చంద్ర‌బాబు స్పందించి ఖండించ‌రు క‌దా. ఒక‌వేళ స్పందించి.. ఖండిస్తే.. భారీ ఎత్తున ఎదురుదాడి ఉంటుది. తెలంగాణ‌లో జ‌రుగుతున్న స‌భ‌ల స్ఫూర్తిని దెబ్బ తీయ‌టానికి... తెలుగు ప్ర‌జ‌ల మ‌ధ్య చీలిక తేవ‌టానికి వీలుగా చంద్ర‌బాబుకుట్ర చేస్తున్నార‌న్న ఆరోప‌ణ‌ల్ని మండిప‌డ‌టం ఖాయం. కేసీఆర్ అండ్ కోకు ఉన్న మాట‌ల శ‌క్తి కార‌ణంగా బాబు స్పంద‌న తేలిపోవ‌టంతో పాటు.. రివ‌ర్స్ లో బాబుకే న‌ష్టం జ‌రుగుతుంది. ఈ విష‌యాలు తెలీనంత అమాయ‌కుడు కాదు బాబు. అందుకే.. మ‌హాస‌భ‌ల‌కు ఆహ్వానం రాని వైనంపై మీడియా ప్ర‌తినిధులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు కూల్‌గా.. ఏ మాత్రం ప్రాధాన్య‌త ఇవ్వ‌నట్లుగా ఆచితూచి మాట్లాడి ఊరుకున్నారు చంద్ర‌బాబు. తాజాగా జ‌రుగుతున్న ర‌చ్చ నేప‌థ్యంలో క‌వ‌రింగ్ క‌థ‌నాల‌తో.. వివాదాన్ని స‌ద్దుమ‌ణిగేలా చేయ‌టంతో పాటు.. త‌మ‌కు అనుకూలంగా వాద‌న వినిపించే వారికి అవ‌స‌ర‌మైన కంటెంట్ ఇచ్చే ప్ర‌య‌త్నంలో భాగంగా తాజా క‌థ‌నం బ‌య‌ట‌కు వ‌చ్చింద‌న్న మాట వినిపిస్తోంది.