Begin typing your search above and press return to search.

'ప్రజావేదిక' ను చంద్రబాబు అడగడం వెనుక స్కెచ్ అదా?

By:  Tupaki Desk   |   26 Jun 2019 4:50 AM GMT
ప్రజావేదిక ను చంద్రబాబు అడగడం వెనుక స్కెచ్ అదా?
X
ఫలితాలు వచ్చేంత వరకూ కూడా జగన్ ను చాలా చిన్నచూపు చూశారు తెలుగుదేశం పార్టీ వాళ్లు. చంద్రబాబు నాయుడుతో సహా తెలుగుదేశం నేతలంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేతను చాలా తేలిక చేసి మాట్లాడారు. జగన్ మోహన్ రెడ్డికి అంతకు ముందు ఎన్నికల్లో తమకన్నా తక్కువగా వచ్చింది కేవలం ఐదున్నర లక్షల ఓట్లే అని తెలుగుదేశం పార్టీ పూర్తిగా మరిచిపోయింది. ఇష్టానుసారం మాట్లాడసాగింది.

అయితే ఏపీ ప్రజలు తెలుగుదేశం పార్టీకి దిమ్మతిరిగే తీర్పును ఇచ్చారు. ఆ వెంటనే తెలుగుదేశం పార్టీ జగన్ కు విన్నపాలు చేయడం మొదలుపెట్టింది. ఆ విన్నపాలు ఏ ప్రజాసంబంధ విషయాల్లో అయితే ఓకే. అది మంచిదే. అయితే తెలుగుదేశం పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు జగన్ కు చేసిన తొలి విన్నపం 'ప్రజావేదిక' విషయంలో. తన హయాంలో నిర్మితమైన ఆ భవనాన్ని తనకు అప్పగించాలని చంద్రబాబు నాయుడు ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. సీఎం జగన్ కు లేఖ రాశారు.

ఎన్నో విషయాలు ఉండగా.. మొదట ఆ విషయం గురించినే లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. అలా ప్రజా వేదికను చంద్రబాబు నాయుడే తెర మీదకు తీసుకు వచ్చారు.

ఈ క్రమంలో.. ఆ వ్యవహారం పై ఏపీ ప్రభుత్వం చకచకా స్పందించింది. దాన్ని కూల్చి వేయడానికి కూడా వెనుకాడలేదు. ఇలా చూస్తే ఆ అక్రమ కట్టడం అంత త్వరగా కూలిపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు ఆ అంశాన్ని తెర మీదకు తీసుకురావడమే అని చెప్పక తప్పదు.

దీని వెనుక చంద్రబాబు నాయుడి స్కెచ్ వేరే ఉందని - ప్రజావేదికను తాము స్వాధీనం చేసుకుంటే.. తద్వారా లింగమనేని ఎస్టేట్స్ ను కూడా రక్షించుకోవచ్చని చంద్రబాబు నాయుడు భావించారని టాక్ వినిపిస్తోంది. లింగమనేని ఎస్టేట్స్ కూడా అక్రమ కట్టడమే అని అధికారులు తేల్చారు. ఈ నేపథ్యంలో దాన్ని రక్షించుకోవడానికి ప్రజా వేదికను తమ దగ్గర అట్టే పెట్టుకోవాలని టీడీపీ భావించింది. అయితే జగన్ ప్రభుత్వం మొత్తం కథను అర్థం చేసుకుని ముందుగా ప్రజా వేదికను కూల్చింది. తదుపరి చంద్రబాబుకు అతి సన్నిహితుడు అయిన లింగమనేనికి సంబంధించిన ఎస్టేట్స్ ను కుప్పకూల్చబోతున్నారని సమాచారం!