Begin typing your search above and press return to search.
పిల్లలు చెడిపోవడానికి ప్రధాన కారణమిదేనట..
By: Tupaki Desk | 17 Aug 2019 2:30 PM GMTనిండా మూడేళ్లు కూడా నిండని చిన్నారులు దూకుడుగా, దుందుడుకుగా వ్యవహరిస్తుంటారు. మన చిన్నప్పుడు పిల్లలు ఇలా ఉండేవారు కాదు.. మనమూ ఇంత యాక్టివ్ గా ఉన్న దాఖలాలు లేవు. మరి ఇప్పుడు పల్లెలు, పట్టణాల్లో పిల్లల దూకుడుకు కారణమేంటన్న సందేహాలు మనకే కాదు పరిశోధకులకు కూడా వచ్చాయి. వారు పరిశోధించి షాకింగ్ విషయం బయటపెట్టారు.
ఒటావా హెల్దీయాక్టివ్ లివింగ్ అండ్ రీసెర్చ్ గ్రూపు పరిశోధకులు తాజాగా 4524 మంది చిన్నారుల స్వభావాల మార్పులపై పరిశోధించారు. ఇందులో ప్రధానంగా రెండు విషయాలనే పిల్లలు చెడిపోవడానికి.. దుందుడుకుగా మారడానికి కారణమని తేల్చారు.
వీరి పరిశోధన ప్రకారం.. పిల్లలు రెండుగంటలకు మించి స్మార్ట్ ఫోన్ లేదా టీవీతో గడిపినా.. కనీసం 9 నుంచి 11 గంటలు నిద్ర పోకపోయినా వారిలో దుందుడుకు స్వభావం పెరిగి చెడిపోవడానికి కారణమవుతున్నాయని పరిశోధనలో తేలింది. భవిష్యత్తులో వారు మనం చెప్పినది వినకుండా తప్పుడు నిర్ణయాలతో జీవితాలను నాశనం చేసుకునే అవకాశాలు మెండుగా ఉంటాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. దుందుడుకు స్వభావం వల్ల మానిసిక సమస్యలు తలెత్తి వ్యసనాల బారిన పడే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
సో మీపిల్లలు చెడిపోకుండా ఉండాలంటే వారిని స్మార్ట్ ఫోన్, టీవీలకు రెండుగంటలకు మించి చూడనివ్వకండి.. ఇక కనీసం వారిని 9 నుంచి 11 గంటలు తప్పనిసరిగా పడుకునేలా చూసుకోవాలని ఒటావా గ్రూపు పరిశోధకుడు మిషెల్ తెలిపారు.