Begin typing your search above and press return to search.

వైసీపీలోకి ఎంట్రీ!... అలీది రైటా? రాంగా?

By:  Tupaki Desk   |   11 March 2019 2:30 PM GMT
వైసీపీలోకి ఎంట్రీ!... అలీది రైటా?  రాంగా?
X
టాలీవుడ్ క‌మెడియ‌న్ అలీ... అటు తాను చాలాకాలంగా స‌న్నిహితంగా మెల‌గుతూ వ‌స్తున్న అధికార టీడీపీతో పాటు ఇటు త‌న మిత్రుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ స్థాపించిన జ‌న‌సేన‌కు షాకిస్తూ.. నేటి ఉద‌యం విప‌క్ష వైసీపీలో చేరిపోయారు. చ‌డీ చ‌ప్పుడు లేకుండా... నేటి ఉద‌యం హైద‌రాబాదులోని లోట‌స్ పాండ్‌ కు వెళ్లిన అలీ... వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో చేరిపోయిన సంగ‌తి తెలిసిందే. అలీ తీసుకున్న ఈ నిర్ణ‌యం ఇప్పుడు తెలుగు నేల రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌ గా మారింది. రాజ‌కీయాల్లోకి వ‌స్గే గిస్తే... టీడీపీలోనే చేర‌తాన‌న్న కోణంలో స్ప‌ష్ట‌మైన సంకేతాలు ఇచ్చిన అలీ... చాలా కాలంగా టీడీపీతో అత్యంత స‌న్నిహితంగా మెల‌గుతూ వ‌స్తున్నారు. 2009 నుంచి రాజ‌కీయాల్లోకి వ‌చ్చేందుకు అలీ చేసిన య‌త్నాల‌న్నీ దాదాపుగా విఫ‌ల‌మ‌య్యాయ‌నే చెప్పాలి. ఈ దఫా ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి రావ‌డం ఖాయ‌మేన‌ని తేల్చేసిన అలీ... తొలుత వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో భేటీ అయ్యారు. ఆ త‌ర్వాత టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడితో - ఆ త‌ర్వాత త‌న మిత్రుడు జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ తోనూ వ‌రుస‌గా భేటీ అయ్యారు.

జ‌గ‌న్‌ - ప‌వ‌న్ ల‌తో సింగిల్ సిట్టింగే వేసిన అలీ... చంద్ర‌బాబుతో మాత్రం ద‌ఫ‌ద‌ఫాలుగా భేటీ అయ్యారు. ఈ క్ర‌మంలో ఆయ‌న టీడీపీలోనే చేర‌తార‌ని అంతా అనుకున్నారు. అయితే చంద్ర‌బాబుకు ఊహించ‌ని షాకిచ్చిన అలీ... నేటి ఉద‌యం వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ త‌ర‌హా వ్యూహం వెనుక అలీ చాలా లెక్క‌లే వేసుకున్న‌ట్లుగా తెలుస్తోంది. రాజ‌కీయాల్లోకి వ‌స్తే... త‌న‌ను గెలిపించిన ప్ర‌జ‌ల‌కు మెరుగైన సేవ‌లందించాల‌న్న‌ది అలీ ల‌క్ష్యంగా తెలుస్తోంది. ఇప్ప‌టికే త‌న సొంతూరు రాజ‌మండ్రిలో ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు చేస్తున్న అలీ... పొలిటీషియ‌న్‌ గా ఆ కార్య‌క్ర‌మాల‌ను మ‌రింత విస్తృతం చేయాల‌ని త‌ల‌పోస్తున్నారు. ఈ క్ర‌మంలో త‌న‌కు గట్టి హామీని ఇవ్వ‌డంతో పాటుగా ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకునే నేత ఎవ‌ర‌న్న విష‌యంపై అలీ చాలా రోజులుగా త‌న‌దైన శైలిలో విశ్లేష‌ణ చేసిన‌ట్టుగా స‌మాచారం. ఇప్ప‌టికే 2009 - 2014 ఎన్నిక‌ల్లో త‌న‌కు టికెట్ ఇస్తాన‌ని ప్ర‌క‌టించిన చంద్ర‌బాబు చివ‌రి నిమిషంలో ఈ సారి కుద‌ర‌దు... నెక్ట్స్ టైం అంటూ నెట్టుకుంటూ వ‌స్తున్నార‌ట‌. ఈ క్రమంలో ఈ సారి కూడా త‌న‌కు చంద్రబాబు హామీ ఇచ్చినా... అది అమ‌లు రూపం దాలుస్తుందా? అన్న కోణంలో అలీ యోచించారు.

ఆ దిశ‌గా సానుకూల సంకేతాలు ఏమీ రాలేద‌ట‌. దీంతో టీడీపీతో త‌న రాజ‌కీయ జీవితం స‌ఫ‌లం కాద‌ని ఆయ‌న ఓ నిర్ణ‌యానికి వ‌చ్చేశారు. ఇక ప‌వ‌న్ విష‌యానికి వ‌స్తే... ఎప్పుడు రాజ‌కీయాలు చేస్తారో - ఎప్పుడు విరామం ఇస్తారో కూడా తెలియ‌ని ప‌వ‌న్‌ తో సాగితే ప‌రిస్థితి ఏమిటి? అన్న కోణంలోనూ అలీ యోచించార‌ట‌. ఇప్ప‌టికే పార్ట్ టైం పొలిటీషియ‌న్ అన్న పేరు తెచ్చుకున్న ప‌వ‌న్‌తో రాజ‌కీయ ప‌య‌నం క‌ష్ట‌మేన‌ని కూడా అలీ ఓ నిర్ణ‌యానికి వ‌చ్చార‌ట‌. ఇక జ‌గ‌న్ విష‌యానికి వ‌స్తే... మాట త‌ప్ప‌ని - మ‌డ‌మ తిప్ప‌న‌ని చెబుతున్న జ‌గ‌న్‌... ఇప్ప‌టిదాకా ఇచ్చిన మాట‌ను ఏనాడూ త‌ప్ప‌ని వైనం అలీకి క‌నిపించింద‌ట‌. అంతేకాకుండా తెలుగు నేల‌లో సంక్షేమ పాల‌న‌కు కొత్త అర్థం చెప్పిన దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కుమారుడిగా... జ‌గ‌న్ వైఎస్ క‌న్నా మెరుగైన పాల‌న ఇవ్వ‌గ‌ల‌ర‌న్న న‌మ్మ‌కం కూడా క‌లిగింద‌ని స‌మాచారం. అంతేకాకుండా ఇప్పుడు జ‌న‌మంతా కావాలి జ‌గ‌న్‌... రావాలి జ‌గ‌న్ అంటూ ఒక్క గొంతుకై నిన‌దిస్తున్న వైనం కూడా అలీ వైసీపీ వైపు మ‌ళ్లిన‌ట్టుగా తెలుస్తోంది. మొత్తంగా త‌న‌దైన లెక్క‌ల‌న్నీ వేసుకుని అలీ స‌రైన నిర్ణ‌య‌మే తీసుకున్నార‌న్న విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి.