Begin typing your search above and press return to search.

ఇందుకే అస‌ద్‌ ను కాంగ్రెస్ టార్గెట్ చేసిందా?

By:  Tupaki Desk   |   21 Nov 2018 4:48 AM GMT
ఇందుకే అస‌ద్‌ ను కాంగ్రెస్ టార్గెట్ చేసిందా?
X
తెలంగాణ‌లో హాట్‌ హాట్‌ గా జ‌రుగుతున్న అసెంబ్లీ ఎన్నిక‌ల పోరులో కీల‌క ప‌రిణామాలు తెర‌మీద‌కు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఓ వైపు మ‌హాకూట‌మి పేరుతో జ‌ట్టుక‌ట్టిన పార్టీలు మిత్రప‌క్ష పార్టీలు పోటీ చేస్తున్న చోట కూడా త‌మ అభ్య‌ర్థుల‌ను బ‌రిలో దింపుతుండ‌టం...ఇందులో కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాల్లో బ‌రిలో దిగ‌డం వంటివి నేటి రాజ‌కీయాల‌కు అద్దం ప‌డుతున్నాయి. అయితే, తాజాగా మ‌జ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న స‌భ‌ను ఆపడానికి కాంగ్రెస్ నాయకులు ప్రత్యక్షంగా బేరానికి దిగారని - నిర్మల్‌ లో సభను ఆపితే రూ. 25 లక్షలు ఇస్తామని ఎంఐఎం స్థానిక నాయకుడికి ఆఫర్ ఇచ్చారని వెల్ల‌డించారు. ముథోల్ కాంగ్రెస్ అభ్యర్థి రామారావ్ పవార్ పాటిల్.. నిర్మల్ కాంగ్రెస్ అభ్యర్థి మహేశ్‌ రెడ్డి తరఫున భైంసా మున్సిపల్ వైస్‌ చైర్మన్ జుబేర్ అహ్మద్‌ కు ఈ ఆఫర్ చేశారు. తనకు 50 లక్షల రూపాయలిచ్చినా అటువంటి పనిచేయనని - పార్టీకి ద్రోహం చేయబోనని జుబేర్ స్పష్టం చేయడంతో వారు కంగుతిన్నారు. డబ్బుతో తనను కానీ - తన పార్టీ కార్యకర్తలను కానీ కొనలేరని అసదుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. ఇతర పార్టీల మాయలో పడరాదని - టీఆర్ ఎస్‌ కే ఓటు వేయాలని సోమవారం నిర్మల్‌ లో జరిగిన సభలో ఆయన పిలుపునిచ్చారు.

అయితే, అస‌దుద్దీన్ ఓవైసీ కేంద్రంగా రాజ‌కీయాలు తిర‌గ‌డం - ప్ర‌ధానంగా మ‌హాకూటమి అభ్యర్థులకు మింగుడు ప‌డ‌టం లేదంటున్నారు. రాష్ట్రంలో మెజార్టీ ముస్లింలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంఐఎం పార్టీ టీఆర్ ఎస్‌ కు బహిరంగ మద్దతు పలకడంతో ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు కలవరం చెందుతున్నారు. రాష్ట్రంలో దాదాపు 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముస్లింల ఓట్లు గెలుపోటములను నిర్ణయిస్తాయి. మహబూబ్‌ నగర్ - ముథోల్ - నిర్మల్ - తాండూరు - సంగారెడ్డి - జహీరాబాద్ - అంబర్‌ పేట - ముషీరాబాద్ తదితర నియోజకవర్గాల్లో వీరి ఓట్లు చాలా కీలకంగా ఉన్నాయి. ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో పాతబస్తీలోని ఏడు నియోజకవర్గాలు - హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్ మినహా మిగతా స్థానాల్లో ఎంఐఎం పోటీకి దూరంగా ఉంది. గతంలో పోటీ చేసిన నియోజకవర్గాలతోపాటు - రాష్ట్రమంతటా ముస్లిం మైనార్టీలంతా టీఆర్ ఎస్‌ కు ఓటేయాలని మజ్లిస్ పిలుపునిస్తోంది. ఆ పార్టీ అధినేత - ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ టీఆర్ ఎస్‌ కు మద్దతుగా సంగారెడ్డి నుంచి ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. టీఆర్ ఎస్‌ కు ఎందుకు ఓటువేయాలి అంటూ ఆయన వివరణాత్మక ప్రసంగం మైనార్టీలను విశేషంగా ఆకట్టుకుంటున్నది. ఈ పరిణామం కూటమిలోని కాంగ్రెస్ - టీడీపీ - టీజేఎస్‌ లకు గుబులు పుట్టిస్తోంది. మైనార్టీల ఓట్లు గంపగుత్తగా టీఆర్ ఎస్ ఖాతాలో పడే పరిస్థితి ఉండటంతో ఆయాపార్టీల అభ్యర్థులు ఎంఐఎం స్థానిక నాయకులతో బేరసారాలకు దిగుతున్నారని ప‌లువురు విశ్లేషిస్తున్నారు.