Begin typing your search above and press return to search.

టీ పోలీసుల‌పై డిగ్గీ ఆరోపణ‌ల వెనుక హోంశాఖ!

By:  Tupaki Desk   |   10 May 2017 3:44 PM GMT
టీ పోలీసుల‌పై డిగ్గీ ఆరోపణ‌ల వెనుక హోంశాఖ!
X
తెలంగాణ పోలీసుల‌కు-ఐసిస్‌ కు లింక్ పెట్టి ఆరోప‌ణ‌లు చేయ‌డం ద్వారా సంచ‌ల‌నం సృష్టించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి దిగ్విజయ్‌ సింగ్ మరో బాంబుపేల్చారు. తెలంగాణ పోలీసులు బోగస్ ఐఎస్‌ ఐఎస్ వెబ్‌ సైట్ పెట్టారనేందుకు తన వద్ద సాక్ష్యాలు ఉన్నాయని దిగ్విజయ్ తనను కలిసిన మీడియాకు వెల్లడించిన సంగ‌తి తెలిసిందే. ఈ విషయంపై తాను పలువురితో చర్చించిన తరువాతే వ్యాఖ్యలు చేశానని ఇప్ప‌టికే డిగ్గీ చెప్పారు. అయితే త‌నకు ఆ స‌మాచారం ఎక్క‌డి నుంచి వ‌చ్చింద‌నే విష‌యాన్ని తాజాగా వెల్ల‌డించారు. కేంద్ర‌ హోంశాఖలో తనకు కావాల్సిన వారు ఉన్నారని చెప్పిన దిగ్విజ‌య్‌ వారి ద్వారా ఆ విషయాలు తెలుసుకోగలిగానని సంచ‌లన వ్యాఖ్య‌లు చేస్తూ వివాదాన్ని మ‌రింత ముదిరేలా చేశారు.

కొద్దికాలం క్రితం మీడియాతో మాట్లాడిన దిగ్విజ‌య్ ఈ సంద‌ర్భంగా పోలీసులు బోగస్ ఐఎస్‌ ఐఎస్ వెబ్‌ సైట్లు పెట్టటం వలన ముస్లిం యువత అటు వైపు ఆకర్షితులు అవుతున్నారని ఆరోపించారు. కాన్పూర్‌ లో సైఫుల్లా ఎన్‌ కౌంటర్, మధ్యప్రదేశ్ రైలులో బాంబు పేలుడు సమాచారం తెలంగాణ ప్రభుత్వానికి ఎలా అందిందని దిగ్విజయ్ ప్రశ్నించారు. ముస్లిం యువతను మతోన్మాదం వైపు ఆకర్షితులను చేసి, వారు ఏదైనా చర్యకు పాల్పడగానే వారి ఫోటోలతో సమాచారం పంపించటమేమిటని దిగ్విజయ్ ప్రశ్నించారు. బోగస్ ఐఎస్‌ ఐఎస్ వెబ్‌ సైట్‌ ను పెట్టటంపై దర్యాప్తు జరపాలన్నారు. తెలంగాణ పోలీసులు కేసు పెట్టడాన్ని స్వాగతిస్తున్నానని, ఎక్కడ కేసు పెట్టినా హాజరవుతానని అన్నారు. సుప్రీంకోర్టు వరకు పోరాడేందుకు సిద్ధమని ప్రకటించారు. ఈ సంద‌ర్భంగా తాజాగా త‌న ధైర్యం వెనుక మ‌ర్మం చెపుతూ క‌చ్చిత‌మైన స‌మాచారం ఉండ‌టం వ‌ల్లే తాను అంత ధైర్యంగా ముందుకు సాగుతున్నామ‌ని తెలిపారు.