Begin typing your search above and press return to search.

సుజ‌నా కోట‌లో ఈడీ త‌నిఖీలు.. మ‌ర్మ‌మేంది?

By:  Tupaki Desk   |   11 Oct 2018 4:53 AM GMT
సుజ‌నా కోట‌లో ఈడీ త‌నిఖీలు.. మ‌ర్మ‌మేంది?
X
తెలుగులో చాలానే ప‌త్రిక‌లు ఉన్నాయి. పాత‌వే కాదు.. కొత్త‌గా పురుడు పోసుకొని.. మిగిలినోళ్లు ఇర‌గ‌దీయ‌నిది మేం ఇర‌గ‌దీస్తామ‌న్న పేరుతో య‌మా ఉత్సాహంగా వ‌చ్చిన ప‌త్రిక‌లు కూడా క‌వ‌ర్ చేసిన ఒక వార్త‌.. రెండు ఇంగ్లిషు ప‌త్రిక‌ల్లో బుజ్జి బుజ్జి ఐటెమ్స్ గా వ‌చ్చాయి. ఇంత‌కీ ఆ ఐటెమ్స్ ఏమంటే.. కేంద్ర మాజీ మంత్రి.. ఏపీ సీఎం చంద్ర‌బాబు ఆర్థిక స్తంభాల్లో ఒక‌డిగా చెప్పే సుజ‌నాచౌద‌రి కార్యాల‌యంలో ఈడీ త‌నిఖీలు నిర్వ‌హించిన వైనంపై ఒక వార్త‌ను అచ్చేశారు. సుజ‌నా కార్యాల‌యాల్లో ఈడీ త‌నిఖీలు అంటే.. క‌వ‌రేజ్ ఏ స్థాయిలో ఉండాలి? టీవీ ఛాన‌ల్స్ అన్ని పోటెత్తాలి క‌దా? కానీ.. అదేమీ లేకుండా గుట్టుచ‌ప్పుడు వ్య‌వ‌హారంలా ఎందుకు ఉన్న‌ట్లు? అన్నది ఇప్పుడు క్వ‌శ్చ‌న్‌.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. సుజ‌నానే ఈడీ ఇప్పుడు ఎందుకు టార్గెట్ చేసిన‌ట్లు? అన్న‌ది మ‌రో ప్ర‌శ్న‌. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ఇటీవ‌ల సీబీఐ మాజీ బాస్.. మాజీ టీడీపీ నేత‌.. ప్ర‌స్తుతం గులాబీ నేత‌గా ఉన్న విజ‌య‌రామారావు పుత్ర‌ర‌త్నం శ్రీ‌నివాస క‌ల్యాణ‌రావుకు చెందిన కంపెనీల లావాదేవీల‌పై ఈడీ అధికారులు దృష్టి సారించ‌టం.. ఈ సంద‌ర్భంగా సుజ‌నా లింకు దొరికిన‌ట్లుగా చెబుతున్నారు.

శ్రీ‌నివాస క‌ల్యాణరావు కంపెనీల నుంచి సుజ‌నా కంపెనీల‌కు నిధులు భారీగా మారిన‌ట్లుగా చెబుతున్నారు. మ‌రి.. సుజ‌నా కంపెనీల్లోకి వ‌చ్చిన నిధులు.. అక్క‌డి నుంచి ఎక్క‌డ‌కు మ‌ళ్లాయి అన్న అంశాన్ని తేల్చేందుకే తాజా త‌నిఖీలుగా చెబుతున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అదే.. ఇప్పుడు హైద‌రాబాద్‌ లోని సుజ‌నా కార్యాల‌యాల్లో ఈడీ త‌నిఖీల‌కు కార‌ణంగా చెబుతున్నారు. ఏం చేసైనా స‌రే.. బాబు లెక్క తేల్చాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉన్న మోడీ స‌ర్కారు.. ఏ చిన్న అవ‌కాశాన్ని మిస్ చేసుకోకూడ‌ద‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉంది. అందుకే.. త‌మ‌కు చిన్న ఆధారం ల‌భించినా.. దాంతో కొండ‌ను త‌వ్వేందుకు సైతం వెనుకాడ‌టం లేద‌ని చెబుతున్నారు. మ‌రింత శ్ర‌మించిన త‌ర్వాత ఎలుక‌ను ప‌డ‌తారా? లేదంటే అది కూడా దొర‌క‌దా? అన్న‌ది మ‌రో ప్ర‌శ్న‌.

ఎందుకంటే.. బాబు మామూలు ముదురు కాద‌న్న మాట రాజ‌కీయ వ‌ర్గాలు చెబుతుంటాయి. రాజ‌కీయాల్లో ప‌లు ద‌రిద్రాల‌కు బాబు ఆద్యుడిగా చెబుతుంటారు. మ‌రి.. అలాంటి ముదురు కేసు మోడీతో పెట్టుకునేట‌ప్పుడే.. ఇలాంటి అపాయాల్ని ఊహించి.. వాటికి సంబంధించిన ప్యాచ‌ప్ లు ప‌క్కాగా చేసుకున్న త‌ర్వాతే దోస్తానా క‌టీఫ్ చెప్పి ఉంటార‌ని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. తాను టార్గెట్ చేసిన‌దేదీ అంత తేలిగ్గా వ‌ద‌ల‌ని మోడీ తీరు బాబు విష‌యంలో ఎంత‌మేర వ‌ర్క్ వుట్ అవుతుందో చూడాలి.