Begin typing your search above and press return to search.
సారు కారుకు జీ 'హుజూర్' అని ఎందుకంది?
By: Tupaki Desk | 22 Oct 2019 4:28 AM GMTఒకవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె.. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం మీద అంతకంతకూ పెరుగుతున్న వ్యతిరేకత. పాలనా పరంగా తప్పుల మీద తప్పులు చేస్తున్న కేసీఆర్ తీరుపై తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు గుర్రుగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి తగ్గట్లే.. రాష్ట్రవ్యాప్తంగా పలు విభాగాల వారు చేస్తున్న నిరసనలపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం కాకపోవటాన్ని కారణంగా చూపిస్తున్నారు.
ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో హుజూర్ నగర్ ఉప ఎన్నిక షెడ్యూల్ కావటంతో తుది ఫలితం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ కాంగ్రెస్ రథసారధి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కంచుకోట లాంటి ఈ నియోజకవర్గంలో తొలిసారి గులాబీ కారు పాగా వేయటం ఖాయమని చెబుతున్నారు. ఈ విషయం కొన్ని సర్వే సంస్థలే కాదు.. రాజకీయ పార్టీల్లోనూ ఇదే అభిప్రాయంతో ఉన్నారు. ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్న వేళ.. సారు కారుకు హుజూర్ నగర్ ప్రజలు జీ హుజూర్ అని ఎందుకు అని ఉంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ ఉప ఎన్నికను ఉత్తమ్ పర్సనల్ గా తీసుకోవటం తెలిసిందే.
తన సతీమణిని బరిలోకి దించటం ద్వారా ఓటు చీలకుండా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఫలితం తారుమారు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఇంతకూ టీఆర్ఎస్ కు అనుకూలంగా పోలింగ్ సాగినట్లుగా కాంగ్రెస్ నేతలు సైతం ఒప్పుకుంటున్నారు.
పోలింగ్ కు రెండు రోజుల ముందు బరిలో ఉన్న పార్టీలు డబ్బు పంపిణీ చేసిన సందర్భంలో.. ఉత్తమ్ అండ్ కో చేసిన తప్పులే తిప్పలుగా మారనున్నట్లు చెబుతున్నారు. రూ.500 నుంచి అవసరానికి తగ్గట్లు.. రూ.3వేల వరకూ ఖర్చు చేసేందుకు టీఆర్ ఎస్ వెనుకాడలేదని.. అదే సమయంలో ఉత్తమ్ బ్యాచ్ మాత్రం ఖర్చు విషయంలో చేసిన తప్పులే తిప్పలు కానున్నట్లు చెబుతున్నారు. మరీ అన్యాయంగా రూ.250కు మించి ఖర్చు చేయటానికి ఉత్తమ్ బ్యాచ్ ఒప్పుకోలేదని.. ఇదే పరాజయానికి ప్రధమ కారణంగా చెబుతున్నారు.
గెలుపు కోసం దేనికైనా రెఢీ అన్నట్లుగా టీఆర్ఎస్ వర్గాలు వ్యవహరిస్తే.. కాంగ్రెస్ నేతలు సైతం అంతే పట్టుదలతో ఉన్నప్పటికీ.. చివర్లో తీయాల్సిన డబ్బుల విషయంలో మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరించలేకపోయారన్న మాట వినిపిస్తోంది. ఇదే.. హుజూర్ నగర్ లో సారు కారుకు జీహుజూర్ అనే పరిస్థితి నెలకొనటానికి కారణంగా చెబుతున్నారు.