Begin typing your search above and press return to search.
ఫేస్‌బుక్ పేరులో మార్పు .. రీజన్ ఏంటి ?
By: Tupaki Desk | 21 Oct 2021 2:30 AM GMTప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ తన పేరును మార్చుకోనుందని ఓ ప్రముఖ టెక్ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ది వెర్జ్ అనే పత్రిక ప్రచురించిన కథనం మేరకు, పేస్ బుక్ సంస్థ తన పేరు మార్చుకోనుందట. ఆ కంపెనీ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ పేరు మార్పుపై ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించింది. అక్టోబరు 28న జరిగే కంపెనీ వార్షికోత్సవ సదస్సులో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారట. ఇటీవల అమెరికా ప్రభుత్వం నుంచి పేస్ బుక్ వ్యాపార కార్యాకలాపాలకు న్యాయపరమైన ఇబ్బందులు కలుగుతుండడంతో పేరు మార్పు నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.
అక్టోబర్ 28న జరగబోయే కంపెనీ వార్షిక సమావేశంలో ఈ మేరకు ఫేస్ బుక్ పేరు మార్చే అంశంపై జుకర్ బెర్గ్ స్పందించనున్నట్లు ది వెర్జ్ కథనం పేర్కొంది. ఒకవేళ అది జరిగినా.. ఇన్ స్ట్రాగ్రామ్, వాట్సాప్, ఓకులస్ లను తదితర ఫేస్ బుక్ సంబంధిత సర్వీసులు మాత్రం పేరెంట్ కంపెనీ(ఫేస్ బుక్ కంపెనీ) కిందనే నడుస్తాయి. మెటావర్స్ లాంటి భారీ ప్రాజెక్టు దిశగా పేస్ బుక్ అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణం లో పేరు మార్చడం ద్వారా రిఫ్రెష్‌నెస్ ఉంటుందని జుకర్ బర్గ్ అండ్ కో భావిస్తున్నట్లు వెర్జ్ తన కథనంలో పేర్కొంది.
అయితే కొత్త పేరు ఏంటన్న విషయంపై మాత్రం ఆ కథనం స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు ఫేస్ బుక్ కూడా ఈ పేరుమార్పు కథనంపై స్పందించేందుకు నిరాకరించడంతో .. ఇదొక రూమర్ గానే భావించాల్సి ఉంటుంది.ఇక కంపెనీలు ఇలా పేర్లు మార్చుకోవడం కొత్తేం కాదు. అమెరికా టెక్ దిగ్గజం ఆల్ఫాబెట్ కంపెనీ(గూగుల్ పేరెంట్ కంపెనీ) నుంచి గూగుల్ ఇలాగే పేరు మార్చుకుని కొనసాగుతున్న విషయం తెలిసిందే.
కొద్ది రోజులుగా వస్తున్న ఆరోపణులు మార్క్ జుకర్ బెర్గ్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మాజీ ఎంప్లాయి ఫ్రానెస్స్ హాగెన్ ఆరోపణలు, అక్టోబర్ 4 రాత్రి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఫేస్ బుక్ కు అనుసంధానంగా ఉన్న వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ దాదాపు 7 గంటల పాటు స్తంభించిపోవడం, దీంతో అసౌకర్యానికి గురైన 2.7 బిలియన్ యూజర్లు ప్రత్యామ్నాయ సోషల్ నెట్ వర్క్‌లను వినియోగించుకునేందుకు మొగ్గు చూపడం, ఆ సర్వీసుల విఘాతం వల్ల రూ.50 వేల కోట్ల నష్టం వాటిల్లడం, ఉద్యోగుల విషయంలో వివక్షతో పాటు ఫెడరల్ రిక్రూట్ మెంట్ రూల్స్ ను ఉల్లంఘించిందంటూ ఫేస్ బుక్ కు రూ.107 కోట్ల ఫైన్ విధించడం..ఆ ఫైన్ కట్టేందుకు జుకర్ బెర్గ్ ఒప్పుకోవడం, ఫేస్ బుక్ సీఈఓగా మార్క్ జుకర్ బెర్గ్ రాజీనామా చేస్తున్నారంటూ బ్రిటన్ కు చెందిన ఓ ప్రముఖ టాబ్లాయిడ్ సంచలన కథనాలు వెలుగులోకి రావడం జుకర్ బెర్గ్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అందుకే ప్రస్తుతం ఈ విపత్తు నుంచి బయట పడేందుకు ఫేస్‌బుక్ పేరు మారిస్తే ఎలా ఉంటుందనే కోణంలోనూ జుకర్‌బెర్గ్ ఫేస్‌బుక్ బోర్డుతో సమాలోచనలు జరుపుతున్నట్లు ది వెర్జ్ తన కథనంలో పేర్కొంది.
ప్రస్తుతం సోషల్ మీడియా నెట్ వర్కింగ్ సైట‍్లతో బిజీగా ఉన్న జుకర్ బెర్గ్..భవిష‍్యత్ టెక్నాలజీ 'మెటావర్స్'ను డెవలప్ చేసే పనిలో ఉన్నారు. ఇందుకోసం యూరప్‌లో 10వేల మందిని నియమించుకోబోతున్నట్లు ప్రకటించారు. మెటావర్స్ అనేది వర్చువల్ రియాలిటీ స్పేస్. ఇటీవల ఫేస్ బుక్, వర్క్‌ప్లేస్ అనే వర్చువల్ రియాల్టీ మీటింగ్స్ యాప్, హారిజన్స్ అనే సోషల్ స్పేస్ తో ప్రయోగాలు చేస్తోంది. పనిచేసే ప్రదేశాల కోసమే కాకుండా, వాస్తవికతలో సంభాషించేందుకు అవసరమైన వర్చువల్ రియాలిటీ యాప్ లను ఫేస్ బుక్ రూపొందిస్తోంది.