Begin typing your search above and press return to search.
రుణ మాఫీ చేసిన పాపమిది
By: Tupaki Desk | 28 Sep 2015 5:30 PM GMTనవ్యాంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు.. తెలంగాణలో చంద్రశేఖర రావు ప్రకటించిన రుణ మాఫీ పథకాలు ఇప్పుడు రైతుల పాలిట శాపంగా మారుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఎంత కావాలంటే అంత రుణం దక్కితే.. ఇప్పుడు వాళ్లకు కనీసం రుణమే కరువవుతోంది. దాంతో మళ్లీ పదేళ్ల కిందట చంద్రబాబు నాయుడి పాలన తరహాలో ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. దాంతో అప్పులు పెరిగి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
అన్నదాతలు కేవలం తెలంగాణలోనే కాదు.. ఏపీలోనూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాకపోతే, తీవ్రత ఏపీలోకాస్త తక్కువ అంతే. తెలంగాణలో రోజుకు పదిమంది ఆత్మహత్యలు చేసుకుంటుంటే నవ్యాంధ్రలో ఇద్దరు చొప్పున ప్రాణాలు తీసుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకు తగ్గిన ఆత్మహత్యలు మళ్లీ ఎందుకు పెరిగాయి. ఏపీలో నీళ్లు- విద్యుత్తు- విత్తనాలు వేటికీ కొదవ లేనప్పుడు.. చంద్రన్న సంక్షేమ పాలన కొనసాగుతున్నప్పుడు అక్కడ ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయనే ప్రశ్న చాలామందికి వస్తోంది. అలాగే, రైతులకు కావాల్సిన అన్ని చర్యలూ తీసుకునే కేసీఆర్ సర్కారులో ఈ ఆత్మహత్యలు ఏమిటనే సందేహమూ ఉంది.
వాస్తవానికి, ఈ ఆత్మహత్యలన్నీ రుణ మాఫీ ఆత్మహత్యలు. చంద్రబాబు, కేసీఆర్ రుణ మాఫీ ప్రకటించారు. దానిని విడతలవారీగా చెల్లిస్తామని చెప్పారు. రుణ మాఫీకి సంబంధించి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వంటి నిబంధనలను తెరపైకి తెచ్చారు. వాస్తవానికి, ఏపీలో నిన్న మొన్నటి వరకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ను పరిగణనలోకి తీసుకోకుండా రుణాలు ఇచ్చారు. ఇప్పుడు ఎంత పంట ఉంటే అంతే రుణం ఇస్తున్నారు. నిబంధనలు కఠినతరం చేశారు. అలాగే, ఒక రైతు లక్ష రూపాయలు రుణం తీసుకున్నాడనుకుందాం. అది మాఫీ అయిపోయింది. అయితే మొదటి విడతగా చంద్రబాబు ప్రభుత్వం రూ.20 వేలు మాత్రమే తీర్చింది. దాంతో బ్యాంకులు కూడా సదరు రైతుకు రూ.20 వేల రుణమే ఇస్తున్నాయి. మిగతా రూ.80 వేలను పాత బాకీగా చూపిస్తున్నాయి. అంటే సొసైటీల్లో రెన్యువల్ చేసినట్లు బ్యాంకులు కూడా రైతు రుణాన్ని రెన్యువల్ చేస్తున్నాయి. రూ.20 వేల రుణం వచ్చినా అందులో కొంత వడ్డీకి పోతోంది. ఇక మిగిలిన మొత్తం రైతుకు పెట్టుబడి కింద సరిపోవడం లేదు. దాంతో మళ్లీ ప్రైవేటు వడ్డీ వ్యాపారిని ఆశ్రయించాల్సి వస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే రుణ మాఫీ పథకం ద్వారా ఇద్దరు చంద్రుళ్లూ రైతులను మళ్లీ పదేళ్ల కిందటికి తీసుకెళ్లారు.