Begin typing your search above and press return to search.

పొద్దున్నే ఉరి ఎందుకు తీస్తారంటే...

By:  Tupaki Desk   |   31 July 2016 10:30 PM GMT
పొద్దున్నే ఉరి ఎందుకు తీస్తారంటే...
X
ఉరిశిక్ష ప‌డ్డ కేసుల్లో ఖైదీల‌కు ఆ శిక్ష‌ను అమ‌లు చేయ‌డంలో ఒక సారుప‌త్య‌త‌ను గ‌మ‌నించే ఉంటారు.అదే తెల్ల‌వారు స‌మ‌యంలో ఉరిశిక్ష‌ను అమ‌లుచేయ‌డం.శిక్ష ఎప్పుడో ఖ‌రారు అయిన‌ప్ప‌టికీ మ‌ధ్యాహ్నం - సాయంత్రం - కావాలంటే రాత్రి వేళ‌లు ఉన్న‌ప్ప‌టికీ తెల్ల‌వారుజామునే ఎందుకు ఉరితీస్తార‌నేది ప‌లువురికి అంతుచిక్క‌ని సందేహాం. దీనికి ఆస‌క్తిక‌ర‌మైన స‌మాధానాలు ఉన్నాయి. అవి ఏంటంటే...

--ఉరి తీయ‌బ‌డ్డ వ్య‌క్తి శ‌వాన్ని ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు అందించ‌డం. ఉద‌యాన్నే ఈ ప్ర‌క్రియ ముగించుకోవ‌డం ద్వారా స‌ద‌రు వ్య‌క్తి అంత్య క్రియ‌లు పూర్తిచేసుకోవ‌డంలో ఇబ్బందులు ఎదురుకావు.

-- తెల్ల‌వారున శ‌రీరంలోని చ‌ల‌న‌క్రియ‌లు దాదాపు నెమ్మ‌దిస్తాయి. దీంతో ఉరితీసిన అనంత‌రం మ‌రే ఇత‌ర ఆరోగ్య‌ స‌మ‌స్య‌లు ఎదురుకాకుండా ఉంటాయి.

-- ఉరితీయ‌డం రోజువారి స‌మ‌యంలో చేస్తే రాజ‌కీయ‌ - సామాజిక‌ప‌ర‌మైన ఆందోళ‌న‌లు త‌లెత్తే అవ‌కాశం ఉంటుంది. అందుకే ఉద‌యం స‌మయాన్ని ఎంచుకుంటారు.

- భార‌త‌దేశంలో చిట్ట‌చివ‌ర‌గా ఉరితీయ‌బ‌డ్డ‌ది ఉగ్ర‌వాది యాకుబ్ మెమ‌న్‌.

-ముంబై పేళుళ్ల కేసులో దోషి యాకూబ్ మెమన్ ఉరిశిక్ష పూర్త‌యి నేటికి సరిగ్గా ఏడాది!