Begin typing your search above and press return to search.

ఇందుకేనా రాజ‌కీయాల్లోని త‌ప్పుకోవాల‌ని హ‌రీశ్ అనుకుంది?

By:  Tupaki Desk   |   22 Sep 2018 10:01 AM GMT
ఇందుకేనా రాజ‌కీయాల్లోని త‌ప్పుకోవాల‌ని హ‌రీశ్ అనుకుంది?
X
తెలంగాణ రాజ‌కీయాల‌కు పార్టీల‌కు అతీతంగా ఎలా హాట్ హాట్‌ గా మారుతున్నాయో...టీఆర్ ఎస్ పార్టీలోని అంత‌ర్గ‌త ప‌రిణామాలు సైతం అంతే హీట్‌ను సృష్టిస్తున్నాయ‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. కొద్దికాలంగా జ‌రుగుతున్న వార‌స‌త్వ‌పోరు తారాస్థాయికి చేరి గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ అధినేత హరీశ్‌ రావు ఆ పార్టీ దూరం పెట్ట‌డం మొద‌లైంద‌ని అంటున్నారు. తాజాగా టీఆర్ ఎస్ పార్టీ వార్త‌ల‌కు ప్రాధాన్యం ఇచ్చే ఓ రెండు మీడియా సంస్థ‌లు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని పేర్కొంటున్నారు. హ‌రీశ్ రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన‌ప్ప‌టికీ...స‌ద‌రు ప్ర‌చార‌ - ప్ర‌సార సాధ‌నాలు వ్య‌వ‌హ‌రించ‌డం ఎత్తుగ‌డ‌లో భాగ‌మేన‌ని అంటున్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్దిపేట జిల్లా ఇబ్రహీంపూర్ గ్రామ‌స్తులు తాము ఏక‌గ్రీవంగా హ‌రీశ్‌ రావుకే ఓటు వేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా నిర్వహించిన సభలో మంత్రి హ‌రీశ్ రావు ప్రసంగిస్తూ మరోసారి కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాలని పిలుపునిచ్చారు. దీనికి తోడుగా ప్రజల్లో ఆదరాభిమానాలు ఉన్నప్పుడే.. రాజకీయాల నుంచి హూందాగా తప్పుకోవడం మంచిదనిపిస్తోందన్నారు. రాజ‌కీయాల‌కు దూరం కావ‌డం స‌రైన స‌మ‌యమ‌ని - ప‌దవి లేకపోయినా ప్రజలతోనే ఉండిపోవాలనిపిస్తుందని వ్యాఖ్యానించారు. అయితే, ఇంత సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌కు ఆ రెండు ప్ర‌సార సాధ‌నాలు త‌ప్ప మిగ‌తా మీడియా సంస్థ‌ల‌న్నీ ప్రచురించాయి - ప్ర‌సారం చేశాయి. అయితే, టీఆర్ ఎస్ పార్టీ వార్త‌ల‌కు పెద్ద‌పీట వేసే ఆయా సంస్థ‌లు మాత్రం ఈ వార్త‌ను ప‌రిగ‌ణ‌న‌లోకే తీసుకోలేదు. అదే స‌మ‌యంలో వివిధ మంత్రులు - ఎమ్మెల్యేల వార్త‌ల‌ను ఇటు మెయిన్ పేజీలో - అటు జిల్లా పేజీల్లో ప్ర‌చురించిన ఆ ప‌త్రిక‌...హ‌రీశ్ రావు విష‌యానికి వ‌చ్చే స‌రికి లైట్ తీసుకుంది.

ఈ ప‌రిణామంపై రాజ‌కీయాల్లో జోరుగా చ‌ర్చ జ‌రుగుతోంది. విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం టీఆర్ ఎస్ పెద్ద‌ల సార‌థ్యంలోని స‌దరు మీడియా సంస్థ‌ల్లో హ‌రీశ్‌ రావు వార్త‌ల‌పై అధికారిక‌ నిషేధం విధించార‌ట‌. ప్ర‌ధానంగా ప‌త్రిక విష‌యంలో మెయిన్ పేజీలోనే కాకుండా జిల్లా - జోన్ పేజీల‌లో కూడా వార్త‌లు రావ‌ద్ద‌నేది స‌ద‌రు ఆదేశాల సారాంశం అని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అదే స‌మ‌యంలో వారి టీవీ ఛాన‌ల్లో కూడా హ‌రీశ్‌ రావుకు చెందిన ఏ వార్తాంశం ప్ర‌సారం కావ‌ద్ద‌ని చెప్పిన‌ట్లు స‌మాచారం. త‌న‌పై ఈ స్థాయిలో అణిచివేత జ‌రుగుతున్న విష‌యం దృష్టికి రావ‌డంతోనే..హ‌రీశ్‌ రావు ఆవేద‌న‌తో రాజ‌కీయాల నుంచి వైదొల‌గ‌డం అనే వ్యాఖ్య చేసిన‌ట్లు ప్రచారం జ‌రుగుతోంది. త‌నపై జ‌రుగుతున్న ఎత్తుగ‌డ‌ల‌ను హ‌రీశ్‌ రావు గ‌మ‌నించిన విష‌యాన్ని అధిష్టానం గుర్తించిందా? ఈ చ‌ర్చ‌కు త్వ‌ర‌లో ఫుల్‌ స్టాప్ పెట్ట‌నుందా? అంటే అవున‌నే కాల‌మే నిర్ణ‌యించాలి.