Begin typing your search above and press return to search.

బాత్రూంలో గుండె నొప్పి అందుకే వ‌స్తుంద‌ట‌

By:  Tupaki Desk   |   26 Feb 2018 4:44 AM GMT
బాత్రూంలో గుండె నొప్పి అందుకే వ‌స్తుంద‌ట‌
X
శ్రీ‌దేవి మ‌ర‌ణ‌వార్త త‌ర్వాత చాలామందికి వ‌చ్చిన సందేహం ఒక‌టి ఉంది. బాత్రూంలో కార్డియాక్ స్టోక్ తో మ‌ర‌ణించిన ఆమె మాదిరే.. చాలామంది బాత్రూంలో కార్డియాక్ స్ట్రోక్‌ కు గురైన‌ట్లుగా వింటుంటాం. కానీ.. శ్రీ‌దేవి మ‌ర‌ణ‌వార్త ప‌లువురిలో ఈ క్వ‌శ్చ‌న్ కు స‌మాధానం కోసం వెతికే ప్ర‌య‌త్నం చేశారు.

ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు లేన‌ప్ప‌టికీ బాత్రూంలో సాన్నం చేసే స‌మ‌యంలో కార్డిక్ అరెస్ట్ స‌మ‌స్య‌తో మ‌ర‌ణిస్తుంటారు. ఎందుకిలా? అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానం వెతికితే.. యూఐటీమ్ ప్రొఫెస‌ర్ ఒక‌రు చెప్పిన స‌మాధానం సంతృప్తిక‌రంగా అనిపించ‌క మాన‌దు.

నిజానికి మ‌నం చ‌సే స్నానం స‌రైన క్ర‌మంలో సాగ‌ద‌న్న‌ది ఆయ‌న వాద‌న‌. ఎందుకంటే చాలామంది స్నానం చేసే క్ర‌మంలో ముందుగా త‌మ త‌ల‌ను త‌డుపుకుంటార‌ని.. అది చాలా త‌ప్పుడు ప‌ద్ద‌తిగా చెబుతున్నారు. చ‌ల్ల‌టినీళ్ల‌ను త‌ల మీద వేసుకోవ‌టం కార‌ణంగా వేడి ర‌క్తం ఉన్న మాన‌వ శ‌రీరం ఒక్క‌సారిగా ఉష్ణోగ్ర‌త‌ను స‌రి చేసుకోలేద‌ని.. దాన్ని స‌రి చేసుకునే క్ర‌మంలో నీళ్లు ప‌డిన త‌ల‌భాగం వైపున‌కు ర‌క్త ప్ర‌సారం ఒక్క‌సారిగా పెరుగుతుంది.

ఈ కార‌ణంగా ర‌క్త‌నాళాల్లో ఏవైనా అడ్డంకులు ఉంటే అది కార్డిక్ అరెస్ట్‌ కు కార‌ణంగా మార‌తాయి. అలా అని ప్ర‌తిసారీ జ‌రుగుతుందని కాదు. అప్పుడ‌ప్ప‌డు అలా జ‌రుగుతుంది. అంతేకాదు.. ఇదే కార‌ణంగా ఒక్కోసారి ప‌క్ష‌వాతం కూడా రావొచ్చ‌ని చెబుతున్నారు. మ‌రి దీనికి త‌ర‌ణోపాయం ఏమిటంటే.. స్నానం చేసేట‌ప్పుడు ముందుగా పాదాల పై నుంచి నీటిని పోసుకోవ‌టం మంచి ప‌ద్ధ‌త‌ని చెబుతారు. అన్నింటికి మించి ర‌క్త‌పోటు.. మైగ్రైన్.. హెవీ కొలిస్ట్రాల్ తో ఇబ్బంది ప‌డుతున్న వారు త‌ప్ప‌నిస‌రిగా స్నానం చేసేట‌ప్పుడు నేరుగా నెత్తి మీద నీళ్లు పోసుకోకూడ‌దని చెప్పారు. సో.. టేక్ కేర్‌.