Begin typing your search above and press return to search.
జీవో 123ను హైకోర్టుకు ఎందుకు కొట్టేసింది?
By: Tupaki Desk | 4 Aug 2016 4:44 AM GMTతెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నుంచి మొట్టికాయలు తినటం ఒక అలవాటుగా మారింది. ఏదైనా నిర్ణయాన్ని తీసుకునే సమయంలో న్యాయపరమైన అంశాలపై పూర్తిస్థాయిలోదృష్టి పెట్టటం లేదన్న ఆరోపణ నిజమన్నట్లుగా తాజాగా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఇందుకు.. జీవో 123 మీద వేసిన పిటీషన్ పై హైకోర్టు ఇచ్చిన తీర్పే దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మల్లన్నసాగర్ ప్రాజెక్టు ముంపు బాధితులకు సాయానికి ఉద్దేశించిన జీవో 123ను హైకోర్టు తాజాగా కొట్టేసిన వైనం తెలంగాణ సర్కారుకు షాకింగ్ గా మారింది.
హైకోర్టు ఎందుకిలా చేసింది? జీవో నెంబరు 123ను ఎందుకు కొట్టేసింది? లోపం ఎక్కడ జరిగింది? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ముంపు బాధిత రైతులను ఆదుకునే అంశాలు జీవో 123లో ఉన్నప్పటికీ.. ఈ జీవోకు స్ఫూర్తిగా నిలిచిన భూసేకరణ చట్టం 2013లోని కొన్ని కీలక అంశాల్ని విస్మరించటమే జీవోను నిలిపివేయడానికి కారణం.
అదేంటంటే... ప్రస్తుతం ఆందోళన చేస్తున్న వారిని రాజకీయ పక్షాలు రైతులుగా చూపుతున్నాయి. గ్రామాలంటే అత్యధికంగా రైతులే ఉంటారు కాబట్టి మీడియా కూడా దానిపైనే దృష్టిపెట్టింది. తెలంగాణ సర్కారు కూడా ప్రాజెక్టు మీద సంకల్పం కంటే... ప్రతిపక్షాల మీద గెలవాలన్న దానిపైనే దృష్టి పెట్టడంతో అసలు చట్టంలోని కొన్ని అంశాలను వదిలేసింది. అదే ప్రభుత్వానికి నష్టం చేసింది.
జీవో నెంబరు 123ను కొట్టి వేస్తూ హైకోర్టు చేసిన వ్యాఖ్యలేమంటే... భూసేకరణ చట్టం – 2013 లో అసలు ఉద్దేశాలను వదిలేశారని, కేవలం రైతుల మీద మాత్రమే దృష్టి పెట్టి రూపొందించారని పేర్కొంది. కేంద్రం రూపొందించిన భూసేకరణ చట్టంలోని 107.. 108 సెక్షన్లు చెప్పేదేమంటే.. బాధిత కుటుంబాలకు మరింత మెరుగైన పునరావాస ప్యాకేజీ కల్పించాలని.. దీనికి అనుగుణంగా రాష్ట్రప్రభుత్వాలు సొంతంగా భూసేకరణ చట్టాలు చేసుకోవచ్చన్నవిషయాన్ని పేర్కొంది. అయితే..
ముంపు బాధిత రైతు కుటుంబాల్ని ఆదుకునే అంశాలు మాత్రమే జీవో 123లో ఉన్నాయి. అదే సమయంలో భూసేకరణ కారణంగా భూమి లేని వారు ప్రభావితమయ్యే వారికి అందించాల్సిన పరిహారాన్ని మాత్రం మర్చిపోయారు. రైతులతో పాటు ప్రాజెక్టు ప్రభావిత ప్రాంతంలో నివసించే కూలీలు - ఇతర ఉద్యోగులు - వ్యాపారులు వంటి అన్ని వర్గాలకు పరిహారం - తదనంతర జీవన మార్గాలు చూపాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.
ఇంకాస్త వివరంగా చెప్పాలంటే.. ఏదైనా ప్రాజెక్టు నిర్మాణం కారణంగా భూమి ఉన్న బాధితులకు నష్టపరిహారం.. ప్యాకేజీ ఇవ్వటం తెలిసిందే. అయితే.. సొంతంగా భూమి లేకున్నా.. ఒక ప్రాజెక్టు కారణంగా ముంపునకు గురయ్యే భూమి మీద ఆధారపడే భూమి లేని పేదల పరిస్థితిని సైతం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది. అలాంటి వారికీ పునరావాసం.. నష్టపరిహారం అందించాల్సి ఉంటుంది.
ఈ కీలక అంశాలేవీ జీవో 123లో లేకపోవటంతోనే.. తెలంగాణ సర్కారు జారీ చేసిన జీవోను తప్పు పడుతూ హైకోర్టు కొట్టి వేసిందని చెప్పొచ్చు. ప్రతి అంశం మీదా గంటల కొద్ది మేథోమధనం చేసే ముఖ్యమంత్రి కేసీఆర్.. కీలక జీవోల జారీ సందర్భంగా జాగ్రత్తలు తీసుకోకపోవటం ఏమిటో అర్థం కానిది. తాజా తీర్పు నేపథ్యంలో భూమి లేని బాధితుల గురించి ప్రభుత్వం దృష్టి పెట్టి.. వారికి కూడా పరిహారాన్ని అందించాల్సి ఉంది. అయితే.. ఇది భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారుతుంది. అందుకే.. తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు తీర్పు మీద సుప్రీంకు అప్పీలుకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. మరి.. ఈ వ్యవహారంపై సుప్రీం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.