Begin typing your search above and press return to search.

జగన్ రోజూ లోటస్ పాండ్ కు వెళ్లటానికి కారణం ఇదేనా?

By:  Tupaki Desk   |   11 April 2019 4:52 AM GMT
జగన్ రోజూ లోటస్ పాండ్ కు వెళ్లటానికి కారణం ఇదేనా?
X
ఎన్నికల ప్రచారం వాడీవేడిగా సాగుతున్నప్పుడు.. పోటీ రసవత్తరంగా ఉన్నప్పుడు.. ఒక్క నిమిషాన్ని సైతం వేస్ట్ చేయటానికి అస్సలు ఇష్టపడరు రాజకీయ అధినేతలు. అలాంటిది ఎన్నికల వేళ.. ఉదయం ఏపీలో.. రాత్రి అయితే లోటస్ పాండ్ కు జగన్ రావటం వెనుక కారణం ఏమిటన్న అంశంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. అయితే.. ఈ విషయం మీద అదే పనిగా చించటానికి ఏమీ లేదన్న మాట వినిపిస్తోంది.

బాబు డేగ కళ్లు.. తనకున్న అధికారంతో నిఘా వర్గాల నుంచి సమాచారాన్ని సేకరించటం.. అధికార దుర్వినియోగానికి పాల్పడి కాల్ రికార్డింగ్ లాంటి వాటికి పాల్పడే ప్రమాదం ఉందన్న ఉద్దేశంతో పాటు.. ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి లోటస్ పాండ్ ఉన్న సదుపాయాలు మరెక్కడా లేకపోవటం కూడా జగన్ నిత్యం హైదరాబాద్ కు వెళ్లేలా చేసిందని చెప్పక తప్పదు.

ఎన్నికల ఏర్పాట్లు.. ప్రచార సరళి..ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాల్ని ఎప్పటికప్పుడు సిద్ధం చేసే టీంతో పాటు.. అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు లోటస్ పాండ్ లో ఉండటం.. వార్ రూం కూడా ఏర్పాటు చేయటం కూడా లోటస్ పాండ్ కు జగన్ రోజూ వెళ్లేలా చేసిందని చెబుతున్నారు.

కేసీఆర్.. కేటీఆర్ తో పాటు తన రహస్య ఎజెండా కోసమే లోటస్ పాండ్ కు జగన్ వెళుతున్నారన్న ప్రచారంలో అర్థం లేదంటున్నారు. ఏపీలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో విపక్ష నేతగా తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో భాగంగానే జగన్ రోజూ రాత్రి అయ్యేసరికి మాత్రం లోటస్ పాండ్ కు చేరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. లేని అర్థాల్ని తెర మీదకు తెచ్చే కన్నా.. లోటస్ పాండ్ కు రోజూ వెళ్లటం వెనుక ప్రత్యేక కారణం లేదని చెప్పక తప్పదు.