Begin typing your search above and press return to search.
జగన్ అవిశ్వాసం వెనక పెద్ద ప్లానే ఉందిగా!
By: Tupaki Desk | 12 March 2016 6:02 AM GMTప్రభుత్వాన్ని కూలదోయడానికి ఏమాత్రం శక్తిలేని వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రతిపక్ష వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇవ్వడం రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ఈ ఎపిసోడ్ రాజకీయవర్గాల కోణంలో చూస్తే విఫలయత్నంగా కనిపించినా... నోటీసులు ఇవ్వడం వెనుక పెద్ద వ్యూహమే దాగి ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. నిబంధనల ప్రకారం వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్ కచ్చితంగా అనుమతించాలి. అయితే, ఈ సమావేశాల్లో దీనిపై చర్చ జరుగుతుందా? లేక వచ్చే సమావేశాల వరకూ వాయిదా పడుతుందా? అన్నది 14వ తేదీన తేలే అవకాశాలు ఉన్నాయి. అయితే చర్చ జరిగేందుకే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నపళంగా ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టడం వెనుక ఉన్న రాజకీయ కోణాలపై ఆ పార్టీలో పెద్ద చర్చే సాగుతోంది. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ ఫిరాయించిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు ప్రత్యేక సీట్లు కేటాయించలేదు. వారంతా ఇప్పటికీ ప్రతిపక్ష సభ్యుల స్థానాల్లోనే కూర్చుంటున్నారు. మరోవైపు మొన్న అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యేల్లో వైకాపా నుంచి టీడీపీలో చేరిన ఆదినారాయణరెడ్డి పేరు ఉండడం కూడా గమనార్హం. అంటే ఈ 8మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం ఖాతాలో లేనట్టే!
ఇదిలాఉండగా ఈ ఎనిమిది మందిని అనర్హులుగా ప్రకటించి ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికలకు రావాలని వైకాపా అధినేత జగన్ పదేపదే సవాలు విసురుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోవడం లేదు. అయితే, వైకాపా మాత్రం పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను ఏవిధంగానైనా అనర్హులుగా ప్రకటించాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగి దానిపై ఓటింగ్ జరిగినప్పుడు, వైకాపా ఖాయంగా విప్ జారీ చేస్తుంది. ఆ సమయంలో పార్టీ ఫిరాయించిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు పార్టీ విప్ ను ధిక్కరించే అవకాశం ఉంది. దీంతో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అనర్హులుగా లెక్కలోకి వస్తారు. అపుడు ఎమ్మెల్యేలపై వేటు ఖాయంగా ఉంటుందని భావిస్తున్నారు. ఒకవేళ ఈ వేటుపై జాప్యం జరిగినా...ప్రజాక్షేత్రంలో చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎండగట్టవచ్చని భావిస్తున్నారు.