Begin typing your search above and press return to search.
మోడీ ఆఫర్ కు టెంప్ట్ కాని జగన్!
By: Tupaki Desk | 24 Jun 2019 6:03 AM GMTపదవుల ఆశతో ప్రజా ప్రయోజనాల్ని తాకట్టు పెట్టే అధినేతలు కొందరుంటారు. చెప్పటానికి అన్ని చెబుతాం. చేతల్లో చేస్తామా? ఏమిటన్నట్లుగా వ్యవహరించే తీరుకు భిన్నంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. తాజాగా మోడీషాలు ఆయనకు భారీ ఆఫర్ ఇచ్చిన వైనం తెలిసిందే. జగన్ తో దోస్తానా కోసం మోడీషాలు ఆసక్తిని ప్రదర్శించటం.. ఇందులో భాగంగా లోక్ సభ డిప్యూటీ ఛైర్మన్ పదవిని పార్టీకి ఇస్తామని.. ఎవరో ఒకరికి ఆ పదవిని కట్టబెట్టాలన్న మాటను జగన్ కు కేంద్రంచెప్పింది.
అయితే.. పదవిని తీసుకుంటే.. ఏపీ ప్రత్యేక హోదా మీద తాను విప్పిన గళం తర్వాతి రోజుల్లో వినిపించే అవకాశం ఉండదన్న విషయాన్ని గుర్తించిన జగన్.. మోడీషాల ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించినట్లుగా తెలుస్తోంది. ఏపీ ప్రజల ఆకాంక్ష అయిన ప్రత్యేక హోదాను ఏదోలా సాధించాలన్న పట్టుదలతో జగన్ ఉన్నారు.
అలాంటివేళ మోడీ సర్కారు ఇచ్చే డిప్యూటీ స్పీకర్ పదవిని తీసుకుంటే.. హోదా విషయంలో రాజీ పడాల్సి వస్తుంది. అదే జరిగితే ఏపీ ప్రజలకు అన్యాయం చేసినట్లు అవుతుంది. అందుకే.. మోడీషాలు ఇచ్చిన ఆఫర్ కు జగన్ నో చెప్పారు.
డిప్యూటీ స్పీకర్ పదవి చూసేందుకు.. వినేందుకు పెద్ద పదవే అయినా.. దాని కారణంగా ఏపీకి కలిగే ప్రయోజనం ఎంతన్నది చూస్తే.. ఏమీ ఉండదన్న విషయం అర్థమవుతుంది. అలాంటి వేళ.. కీలక పదవిని తీసుకుంటే ప్రయోజనం ఏమిటన్న ప్రశ్న జగన్ వేసుకొని.. ఆ ఆఫర్ కు నో చెప్పినట్లుగా తెలుస్తోంది. బీజేపీకి మిత్రుడిగా ఉండటానికి ఓకే అయినా.. రాసుకుపూసుకు తిరిగే యోచన జగన్ కు లేదని చెబుతున్నారు.
ఏపీ రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యమని.. మిగిలినవేమీ తనకు పెద్ద విషయాలు కావన్నట్లుగా జగన్ స్పష్టం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటివరకూ తాను పాల్గొన్న అన్ని కార్యక్రమాల్లోనూ హోదా గురించి అదే పనిగా ప్రస్తావించటం కనిపిస్తుంది. ఇదిలా ఉంటే.. తాము డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తామంటే జగన్ రిజెక్ట్ చేశారంటూ సాగుతున్న ప్రచారాన్ని బీజేపీ కొట్టిపారేస్తుంది. ఈ ప్రచారం తమకు ఇబ్బందికరంగా మారటంతో.. తాము ఆఫర్ చేయలేదని చెబుతోంది. ఇదిలా ఉంటే.. ఈ పదవిని బీజేపీ మిత్రపక్షం శివసేన ఆశిస్తోంది. అయితే.. జేడీయూకి దక్కే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.