Begin typing your search above and press return to search.

అందుకే రాజీనామా చేయ‌లేదంటున్న ఎంపీ జేసీ

By:  Tupaki Desk   |   29 Sep 2017 6:59 PM GMT
అందుకే రాజీనామా చేయ‌లేదంటున్న ఎంపీ జేసీ
X
ఇటీవ‌లి కాలంలో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌ గా మారిపోయిన టీడీపీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి గ‌త‌వారం క‌ల‌కలం రేపే ప్ర‌క‌ట‌న చేసిన సంగ‌తి తెలిసిందే. సంచలనాలకు ఆయ‌న కేరాఫ్ అడ్ర‌స్‌. త‌న‌దైన శైలిలో కామెంట్లు చేసే అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ ఖాతాలో ఎన్నో సంచ‌ల‌నాలు ఉన్నాయి. అనంతపురం నగరంలో రోడ్ల విస్తరణ - పారిశుద్ధ్యం - పందుల నిరోధం - డ్రైనేజీల శుభ్రత విషయంలో స్థానిక ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి - మేయర్ మదమంచి స్వరూపతో విభేదాలు తారాస్థాయికి చేరాయి. కొద్దికాలం క్రితం విశాఖ ఎయిర్‌ పోర్టులో బోర్డింగ్ పాస్ విషయంలో అక్కడి ఉద్యోగిపై చేయి చేసుకున్న ఘటన దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనపై పలు విమానయాన సంస్థలు నిషేధం విధించడం ఆ తరువాత ఆ సమస్య సద్దుమణగింది. త‌న సంచల‌నాల‌కు కొన‌సాగింపుగా ఈసారి ఏకంగా తన పదవికి రాజీనామా చేస్తానంటూ ప్ర‌క‌టించారు.

చాగల్లు రిజర్వాయర్‌ కు నీళ్లు ఇప్పించుకోలేకుంటే ఇక తాను ఎంపీగా ఉండి ఏం లాభమని, తన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ప్ర‌క‌టించ‌డం ద్వారా ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి క‌ల‌క‌లం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సీన్ ఢిల్లీలో బాబు-జేసీ భేటీతో మారిపోయిందని ప్రచారం సాగింది. ముస్సోరిలో యువ ఐఎస్ ఎస్‌ ల గెస్ట్ లెక్చ‌ర్ల కార్య‌క్ర‌మంలో పాల్గొన్న అనంత‌రం ఢిల్లీలో పార్టీ నేత‌లు - ప‌లువురు కేంద్ర మంత్రుల‌తో ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు స‌మావేశం అయిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగానే పార్టీ నేత‌లతో కేంద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సిన నిధులు, పోల‌వ‌రం ప్రాజెక్టుకు కేటాయింపులు, ప్ర‌త్యేక ప్యాకేజీ గురించి సీఎం చంద్ర‌బాబు పార్టీ ఎంపీలు, మంత్రుల‌తో చ‌ర్చించారు. ఈ భేటీ అనంత‌రం ఎంపీ జేసీ దివాక‌ర్‌రెడ్డితో సీఎం చంద్ర‌బాబు ప్ర‌త్యేకంగా ముచ్చటించిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి.

అయితే ఈ ప్రచారం నిజ‌మ‌ని తేలింది. స్వ‌యంగా ఈ విష‌యాన్ని జేసీ ప్ర‌క‌టించారు. తాను చేసిన డిమాండ్ల‌న్నీ నెర‌వేరినందుకే రాజీనామా చేయ‌డం లేద‌న్న జేసీ.. టీడీపీలో ఉన్న దుష్ట‌శ‌క్తుల‌పై విజ‌యం సాధించాన‌ని చెప్పారు. ఇక ఎప్ప‌ట్లాగే...వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌ పై విమ‌ర్శ‌లు చేశారు.