Begin typing your search above and press return to search.

ఫ్లాప్ షో చ‌ర్చ‌ను క్లోజ్ చేసిన కేసీఆర్‌!

By:  Tupaki Desk   |   7 Sep 2018 5:18 AM GMT
ఫ్లాప్ షో చ‌ర్చ‌ను క్లోజ్ చేసిన కేసీఆర్‌!
X
తిమ్మిని బమ్మిని చేసే టాలెంట్‌కు అనుకోని ఎదురుదెబ్బ త‌గిలితే ఎలా ఉంటుంది? అలాంటి ప‌రిస్థితిని ఎలా ఎదుర్కొంటాడు? అన్న దానికి తాజాగా తెలంగాణ ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎత్తుగ‌డే నిద‌ర్శ‌నంగా చెప్పాలి. అన‌ధికార స‌మాచారం ప్ర‌కారం దాదాపు రూ.300 కోట్ల ఖ‌ర్చుతో అత్యంత భారీగా నిర్వ‌హించాల‌ని త‌ల‌పెట్టిన ప్ర‌జా నివేద‌న స‌భ ప్లాప్ షో ఎలా అయ్యిందో అంద‌రికి తెలిసిందే. పాతిక ల‌క్ష‌ల మందిని స‌భ‌కు తెస్తామ‌న్న కేసీఆర్ ఎలా చ‌తికిల ప‌డ్డారో ప్ర‌జా నివేద‌న స‌భ సాక్షిగా అంద‌రికి అర్థ‌మైంది.

అంతే.. అప్ప‌టివ‌ర‌కూ కేసీఆర్ పై ఎలా విరుచుకుప‌డాల‌ని ఆలోచిస్తున్న వారికి బ్ర‌హ్మండ‌మైన పాయింట్ దొరికిన‌ట్లైంది. అంతే.. విమ‌ర్శ‌ల ప‌రంప‌ర‌ను షురూ చేశారు. ప్లాప్ షో అంటూ దునుమాడ‌టం మొద‌లు పెట్టారు. దీంతో.. గులాబీ శ్రేణులు ఒకింత డిఫెన్స్ లో ప‌డ్డాయి. ఇలాంటి వేళ‌ను ఎలా డీల్ చేయాల‌న్న విష‌యాన్ని పార్టీ శ్రేణుల‌కు అర్థ‌మ‌య్యేలా త‌న‌కు తానే రంగంలోకి దిగారు.

ప్ర‌గ‌తి నివేద‌న స‌భ మీద జోరుగా విమ‌ర్శ‌లు సాగుతున్న వేళ‌.. అంద‌రూ షాక్ తినేలా నిర్ణ‌యాన్ని తీసుకొని ఆశ్చ‌ర్యంలో ముంచెత్తారు. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లే యోచ‌న‌లో భాగంగా.. అసెంబ్లీ ర‌ద్దు నిర్ణ‌యం తీసుకుంటార‌ని అంద‌రికి తెలిసినా.. ఒకేసారి 105 మంది అభ్య‌ర్థుల జాబితాను ప్ర‌క‌టిస్తార‌న్న ఊహ కూడా ఎవ‌రికి లేదు.

అసెంబ్లీ ర‌ద్దుకు కార‌ణం ఏం చెబుతార‌న్న ఆస‌క్తితో ఉన్న వారంద‌రిని స‌ర్ ప్రైజ్ చేస్తూ.. తాను చెప్పిన‌ట్లే 105 మంది అభ్య‌ర్థుల జాబితాను ప్ర‌క‌టిస్తున్న‌ట్లు చెప్ప‌ట‌మే కాదు.. ఆ లిస్టును అంద‌రి చేతుల్లో పెట్టేయ‌టం ద్వారా.. ప్ర‌గ‌తి నివేద‌న స‌భ ప్లాప్ షో చ‌ర్చ‌తో పాటు.. అసెంబ్లీ ర‌ద్దు నిర్ణ‌యాన్ని ఎందుకు తీసుకోవాల్సి వ‌చ్చింద‌న్న చ‌ర్చ‌కు ఫుల్ స్టాప్ పెట్టేశార‌ని చెప్పాలి. ఏ స‌మ‌యాన్ని ఎలా డీల్ చేయాలి? ఎవ‌రిని ఎలా మేనేజ్ చేయాలి? ప‌రిస్థితిని త‌న కంట్రోల్ లోకి ఎలా తెచ్చుకోవాల‌న్న విష‌యాల‌పై కేసీఆర్ కు ఎవ‌రూ స‌ల‌హాలు ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌న్నది త‌న తాజా ఎత్తుతో స్ప‌ష్టం చేశార‌ని చెప్పాలి.