Begin typing your search above and press return to search.

కేసీఆర్ విశాఖ పర్యటన రద్దు

By:  Tupaki Desk   |   14 Feb 2019 12:32 PM IST
కేసీఆర్ విశాఖ పర్యటన రద్దు
X
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు షెడ్యూల్ ప్రకారం ఈరోజు విశాఖపట్నంలో పర్యటించాల్సి ఉంది. శారదా పీఠం నుంచి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనాలని కేసీఆర్ కు ఇప్పటికే ఆహ్వానం అందింది. దాని ప్రకారం కేసీఆర్ ముందస్తుగా ప్లాన్ కూడా చేసుకున్నారు. కానీ తాజాగా ఈరోజు పర్యటన చివరి నిమిషంలో కేసీఆర్ రద్దు చేసుకున్నారు.

కేసీఆర్ విశాఖ పర్యటన రద్దు కు ప్రధాన కారణం బడ్జెట్ రూపకల్పన, సమావేశాలతోపాటు కేబినెట్ విస్తరణపై కసరత్తు చేయడానికేనని సమాచారం. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం కేసీఆర్ కేబినెట్ విస్తరణను చేపట్టడానికి నిర్ణయించాడని.. అది రేపే ఉండొవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్ ప్రస్తుతం ఫాం హౌస్ నుంచి అర్థాంతరంగా సిటీకి తిరిగివచ్చిన నేపథ్యంలో కేబినెట్ విస్తరణ ఉండవచ్చన్న ఊహాగానాలకు బలం చేకూరుతోంది.

కేసీఆర్ స్థానంలో విశాఖ శారదాపీఠానికి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి వెళుతున్నారు. అయితే కేసీఆర్ విశాఖతోపాటు అమరావతిలో ఏపీ ప్రతిపక్ష నేత జగన్ నిర్మించుకున్న నూతన గృహ ప్రవేశ కార్యక్రమానికి కూడా హాజరుకావాల్సి ఉంది. ఈ ప్రోగ్రాం ను కూడా కేసీఆర్ చివరి నిమిషంలో రద్దు చేసుకున్నట్టు సమాచారం. వైఎస్ జగన్ చెల్లెలు షర్మిల, ఆమె భర్త కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదట.. అనిల్ అకస్మాత్తుగా జబ్బు పడిన కారణంగా వీరిద్దరూ రావడం లేదని వైసీపీ వర్గాలు తెలిపాయి.