Begin typing your search above and press return to search.
కవిత ఓటమి...ఇవే కారణాలు...
By: Tupaki Desk | 23 May 2019 2:36 PM GMTతెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సారు, కారు, పదహారు, ఢిల్లీలో సర్కారు అంటూ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించిన ఆ పార్టీకి ఊహించని రీతిలో ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో సీఎం కేసీఆర్ తనయురాలైన కవిత నిజామాబాద్ స్థానంలో ఓటమిని చవిచూశారు. పసుపు రైతులు 176 మంది పోటీలో నిలవడంతో రాష్ట్రంలోనే కాకుండా దేశమంతటా హాట్ టాపిక్ అయిన ఈ నియోజకవర్గం ఇలా సంచలన ఫలితాల రూపంలో సంచలనంగా నిలిచింది. అయితే, నిజామాబాద్ లో టీఆర్ ఎస్ ఓటమికి పలు కారణాలున్నాయని విశ్లేషకులు అంటున్నారు.
రైతులకు సంబంధించిన సమస్యలతో నిజామాబాద్ తెరమీదకు వచ్చింది. గతేడాది చివర్లో నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డుతో సహా - పసుసు - ఎర్రజొన్నలకు గిట్టుబాటు ధరపై పోరుబాట పట్టారు. నిజామాబాద్ రూరల్ - ఆర్మూర్ - బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గ రైతులు కొన్ని నెలలపాటు ఆందోళన చేశారు. తమ సమస్యలన్నీ దేశానికి తెలియజెప్పాలనే ఉద్దేశంతో మూకుమ్మడిగా నిజామాబాద్ బరిలో నిలిచారు. పసుపు బోర్డు అంశం రాష్ట్ర పరిధి లోనిది కాకపోయినా…గిట్టుబాటు ధరపై రైతులతో రాష్ట్ర ప్రభుత్వం తరపున మాట్లాడింది లేదు. ఎవరు పోటీ చేసిన గెలుపు తమదేనన్న ధీమాతో..రైతుల్ని టీఆర్ ఎస్ పట్టించుకోలేదన్న వాదనలున్నాయి.
అయితే, ఈ మూడ్ నేపథ్యంలో బీజేపీ వ్యూహాత్మకంగా రంగంలోకి దిగింది. సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ తనయుడు ధర్మపురి అరవింద్‌ను బీజేపీ అభ్యర్థిగా ప్రకటించింది. పక్కా ప్లాన్ తో ముందుకెళ్లి కేంద్ర నాయకులతో నిజామాబాద్ లో సభలు పెట్టించారు. దీంతోపాటుగా క్షేత్రస్థాయిలో పర్యటించారు. దీంతోపాటుగా, టీఆర్ ఎస్ వైఫల్యాలను వివరించారు. కేంద్రం అండగా తాను సాధిస్తానని హామీ ఇవ్వడం సైతం విజయానికి దోహదపడిందని విశ్లేషిస్తున్నారు.