Begin typing your search above and press return to search.

కేసీఆర్ కదనోత్సాహం వెనుక కారణమిదే..

By:  Tupaki Desk   |   22 Aug 2018 5:18 AM GMT
కేసీఆర్ కదనోత్సాహం వెనుక కారణమిదే..
X
రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు.. ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తే అదే కనిపిస్తోంది. ఏదో జరుగుతోందనే దానికి ఇదో ప్రత్యక్ష ఉదాహరణ.. ముందస్తు ఊహాగానాలకు ఇది బలమైన నిదర్శనం.. సీఎం కేసీఆర్ బుధవారం మంత్రులతో అత్యవసరంగా సమావేశం నిర్వహిస్తున్నట్టు ప్రకటించగానే అందరూ షాక్ అయ్యారు. ఇంత సడన్ గా ఎందుకు ఇప్పుడు భేటి అవుతున్నారనే చర్చ తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

ఢిల్లీ వర్గాల సమాచారం ప్రకారం ముందస్తు జమిలి ఎన్నికలు దేశంలోని సగం రాష్ట్రాలకు నిర్వహించాలని కేంద్రం యోచిస్తోందట.. అందులో భాగంగా ఆ 15 రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలు తెలంగాణ - ఏపీ ఉన్నాయట..4 ఏళ్లు పూర్తయిన అన్ని రాష్ట్రాలను కలగలిపి ముందస్తు ఎన్నికలు నిర్వహించడానికి కేంద్రం రెడీ అయినట్టు తెలిసింది. దీంతో ఈ డిసెంబర్ లోపు ఎన్నికలు జరగవచ్చంటున్నారు.

తాజాగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చే నెలలో శాసనసభ రద్దు అవుతుందని స్టేట్ మెంట్ ఇచ్చాడు.. మంగళవారం అమరావతిలో చంద్రబాబు అప్పుడే తెలుగు రాష్ట్రాల్లో పొత్తులపై చర్చించారు. వీటన్నింటి నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ అలెర్ట్ అయ్యి ఈ ఎన్నికల కసరత్తు కోసం మంత్రులతో భేటి అవబోతున్నట్లు తెలిసింది.

ఇక కేసీఆర్ ఆందోళన వెనుక మరో కారణం కూడా ఉందని చెబుతున్నారు. జమిలి ఎన్నికలతో జాతీయ పార్టీల ప్రభావం ఉంటుందని.. కాంగ్రెస్ - బీజేపీలకు ఓట్లు పడకుండా ఉండాలంటే.. శాసనసభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లడమే మంచిదని కేసీఆర్ భావిస్తున్నారు. ఇలా అయితే రాష్ట్ర రాజకీయాలపైనే ప్రజల దృష్టి ఉండి టీఆర్ ఎస్ ను గెలిపిస్తారిన ఆశిస్తున్నారు. అదే జమిలి ఎన్నికలైతే జాతీయకోణంలో ఆలోచించి ప్రజలు బీజేపీకి ఓటేసే అవకాశం ఉందని.. కమల దళం ప్రభావం చూపొద్దనే ముందస్తుకు వెళ్లడానికి కేసీఆర్ మథనం చేస్తున్నట్టు తెలిసింది.