Begin typing your search above and press return to search.
ముందస్తుకు వ్యూహం కుమారరత్నమా..!?
By: Tupaki Desk | 28 Aug 2018 1:30 AM GMTఏ ఎన్నికలైనా ఎప్పుడు జరగాలి. ఏ ఎన్నికలైనా ఎలా జరగాలి. దీనికి పెద్ద సందేహ పడాల్సిన అవసరం లేదు. దీనికి పెద్ద ఆందోళన పడాల్సిన అవసరం లేదు. దీనికి పెద్ద హైరానా పడాల్సిన పనీ లేదు. చాలా సింపులు. ఏ దేశంలో అయినా... ఏ రాష్రంలో అయినా.... వారి వారి రాజ్యాంగంలో రాసుకున్నట్లుగా... నిర్ణయించినట్లుగా జరుగుతాయి. అయితే దీనికి భారతదేశం మాత్రమే మినహాయింపు. ఇక్కడ అయిన వారిని అందలం ఎక్కించడం కోసం మధ్యంతర ఎన్నికలకు వెళ్లడం భారతదేశానికే చెల్లింది. అందునా... తెలుగు రాష్ట్రాలకే చెల్లిందే. ఇంతకు ముందు కూడా ఇదే జరిగింది. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే జరుగుతోంది.
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు - ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన కుమార రత్నాన్ని అధికార పీఠాన్ని అప్పగించేందుకు ముందస్తు ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు. నిజానికి వచ్చే సంవత్సరం ఏప్రిల్ - మే నెలల్లో శాసనసభకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే, కేసీఆర్ మాత్రం తన కుమారుడు కల్వకుంట్ల తారక రామారావును ముఖ్యమంత్రిని చేయాలనే తాపత్రయం ఎక్కువగా పట్టుకుంది. జాతీయ స్ధాయిలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు - దాని నిర్వహణ అంశంలో సీరియస్ గా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర రావు దీనికి వెనుక కారనం కుమారుడ్నిముఖ్యమంత్రి చేసేందుకే అంటున్నారు. ముందస్తు ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత లోక్ సభకు ఎన్నికలు జరిగే వరకూ కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. ఆ తర్వాత ఆరు నెలల తర్వాత వచ్చే లోక్ సభ ఎన్నికల కోసం కల్వకుంట్ల వారు ఇతర పార్టీలను ఐక్య చేయడం - విజయం సాధించడం వంటి అంశాలపై ద్రష్టి పెడతారు. ఇక ఎన్నికల సమయానికి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు - ప్రచారాల్లో బిజీ అయిపోతారు. అనంతరం ఎన్నికల తర్వాత ఆయన ఆశించినట్లుగానే కేంద్రంలో తన సారధ్యంలోని ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి వస్తే కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారతారు. ఆ సమయంలోనే తెలంగాణకు ముఖ్యమంత్రిగా తన కుమారుడు తారక రామారావునే నియమించి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ భవిష్యత్ ను కుమారుడి చేతిలో పెడతారు. అదీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన కుమారుడికి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టే వ్యూహంగా చెబుతున్నారు.
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పక్కాగా వేసుకున్న స్కెచ్ ఒకవేళ విఫలం అయి కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి రాకపోతే ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రిగా కేసీఆర్ కొనసాగుతారు. ఈ వ్యూహంతో అటు పార్టీలో కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదీ కేసీఆర్ వ్యూహమంటే...