Begin typing your search above and press return to search.

జిల్లాల ఏర్పాటు వెనుక కేసీఆర్ వ్యూహం ఇదీ!

By:  Tupaki Desk   |   5 Oct 2016 5:30 PM GMT
జిల్లాల ఏర్పాటు వెనుక కేసీఆర్ వ్యూహం ఇదీ!
X
తెలంగాణ‌లో ముప్పైకి పైగా జిల్లాలు! ఇంకా పెరిగినా ఆశ్చ‌ర్యం లేదు! మ‌రి దీనివెనుక ఉన్న ర‌హ‌స్యం ఏమిటి? సీఎం కేసీఆర్ చెబుతున్న‌ట్టు పాల‌నా సౌల‌భ్య‌మే నా? లేక‌, రాజ‌కీయ ఎత్తుగ‌డ ఏమైనా ఉందా? ఇప్పుడు ఇదే విష‌యం తెలంగాణ‌లోని మేధావుల‌ను తొలిచేస్తోంది. వాస్త‌వానికి తెలంగాణ‌ను బంగారు తెలంగాణ చేయ‌డంలో భాగంగా ఇప్పుడున్న 10 జిల్లాల‌ను పెంచాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పాల‌న ప‌గ్గాలు చేట్టిన తొలి వారంలోనే ప్ర‌క‌టించిన సీఎం కేసీఆర్‌.. దానికి త‌గిన‌ట్టుగానే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. ఎక్క‌డెక్క‌డ జిల్లాలు ఏర్పాటు చేస్తే.. పాల‌న బాగుంటుంది, అట్ట‌డుగు వారికి కూడా పాల‌న చేరువ అవుతుంది ఆయ‌న అంచ‌నా వేశారు. దాని ప్ర‌కారం మొత్తం 25 జిల్లాలు ఉంటే స‌రిపోతుంది అని లెక్క‌గ‌ట్టారు.

మొత్తంగా క్ర‌తువు ప్రారంభించారు. అయితే - వరంగ‌ల్‌ - క‌రీంన‌గ‌ర్ - మ‌హ‌బూబ్‌ న‌గ‌ర్ జిల్లాల నుంచి త‌మ ప్రాంతాల‌ను కూడా జిల్లాలుగా ప్ర‌క‌టించాలంటూ జ‌న‌గామ‌ - గ‌ద్వాల‌ - సిరిసిల్ల ప్ర‌జ‌లు ప్ర‌భుత్వంపై దండెత్తారు. అయితే, కేసీఆర్ మొద‌ట్లో ఈ డిమాండ్ల‌ను ప‌ట్టించుకోలేదు. పాల‌నా ప‌రంగా జిల్లా చేసేందుకు వాటికి ఆయా ల‌క్ష‌ణాలు లేవ‌ని ప‌క్క‌కు పెట్టారు. దీంతో ఆయా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉద్య‌మాలు బ‌య‌ల్దేరాయి. కాంగ్రెస్ మాజీ మంత్రి డీకే అరుణ దీక్ష‌కు దిగి.. ప‌ద‌వికి రాజీనామా చేశారు. అయినా కేసీఆర్ తొలి రెండు రోజులు చ‌లించ‌లేదు. విప‌క్షాల‌న్నాక ఆమాత్రం యాగీ చేయ‌వా అని త‌న స‌న్నిహితుల వ‌ద్ద వ్యాఖ్యానించార‌ట కూడా.

అంతేకాదు, మ‌నం ఇస్తూ.. పోతే.. వాళ్లు నివ‌సిస్తున్న ఏరియాను కూడా జిల్లా చేయ‌మంటారంటూ అధికారుల వ‌ద్ద విమ‌ర్శించార‌ని వార్త లీకైంది. మ‌రి అలాంటి కేసీఆర్ ఒక్క‌సారిగా ఉన్న‌ట్టుండి.. త‌న పంథా మార్చుకుని.. పండ‌గ పూట వాళ్లు ఏడ్వ‌డ‌మెందుకు, న‌న్ను తిట్ట‌డ‌మెందుకు అంటూ.. కోరిన‌న్ని జిల్లాలు ఇచ్చేందుకు సిద్ధ‌ప‌డ్డారు. దీంతో తెలంగాణ లో జిల్లాల సంఖ్య 31కి చేరింది. అయితే, కేసీఆర్ వ్యూహం వెనుక ప్ర‌తిప‌క్షాల‌ను దారిలోకి తెచ్చుకోవ‌డ‌మే కాకుండా ప్ర‌జ‌ల‌లో త‌న‌పై వ్య‌తిరేక‌త రాకుండా చూసుకున్నార‌ని టాక్‌.

జిల్లాల ఏర్పాటులో మొద‌ట ఉన్న పాల‌నా సౌల‌భ్యం అనే సూత్రం రానురాను పొలిటిక‌ల్ సౌల‌భ్యంగా మారింద‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలో నే ఆయా ప్రాంతాల‌ను జిల్లాలుగా ప్ర‌క‌టించ‌క‌పోతే టీఆర్ ఎస్ స‌హా కేసీఆర్‌ పై వ్య‌తిరేక‌త గూడుక‌ట్టుకునే ప్ర‌మాదం ఉంద‌ని, అదేస‌మ‌యంలో జిల్లాలు ఇచ్చేస్తే.. తాను దేవుడిగా చిర‌స్థాయిగా గుర్తిండిపోయే ఛాన్స్ ఉంద‌ని కేసీఆర్ లెక్క‌లేసుకుని ఈ జిల్లాల‌కు ప‌చ్చ‌జెండా ఊపార‌ని తెలుస్తోంది! సో.. ఎంతైనా.. కేసీఆర్ వ్యూహ‌మే వ్యూహం అంటున్నారు విశ్లేష‌కులు!


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/