Begin typing your search above and press return to search.

గవర్నర్‌ తో భేటి దేనికి సంకేతం

By:  Tupaki Desk   |   28 Aug 2018 4:35 PM GMT
గవర్నర్‌ తో భేటి దేనికి సంకేతం
X
తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర సమితీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తాజగా గవర్నర్‌తో భేటీ అయ్యారుమంగళవారం జరిగిన ఈ భేటీలో దాదాపు 45 నిమిషాల పాటు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, గవర్నర్ నరసింహన్ మధ్య ముందస్తుపై ఎన్నికలపై చర్చ జరిగినట్లు సమాచారం. వీలున్నంత త్వరగా శాసనసభను రద్దు చేయడం ముందస్తు ఎన్నికలకు సమాయత్తం కావడం ఈ భేటి వెనుక ప్రధాన ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. ఇంతకు ముందు ఈ నెలలోనే గవర్నర్ నరసింహన్‌ తో ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు మూడు దఫాలుగా కలిసారు. అయితే వీరిద్దరి మధ్య జరిగిన చర్చ హైకోర్టు విభజన పైనే అని వార్తలు వచ్చాయి.

నిజానికి వీరి భేటీ హైకోర్టు విభజనతో పాటు ముందస్తు ఎన్నికలపైనే జరిగిందని అంటున్నారు. మంగళవారం నాటి భేటీలో కూడా ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు - గవర్నర్ నరసింహన్ ఇదే విషయంపై చర్చించుకున్నట్లు సమాచారం. తెలంగాణలో శాసనసభ రద్దు తదనంతర పరిణమాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా చర్చలు జోరందుకున్నాయి. సెప్టెంబర్ 10 లోపు తెలంగాణ శాసనసభను రద్దు చేయడం తదుపరి ఎన్నికలకు వెళ్లడం అనే అంశాలపై ప్రధానంగా ద్రుష్టి సారించారు. తెలంగాణలో ముందస్తు సమరం దాదపు ఖరారైనట్లే. ఈ నెలాఖరులోగా శాసనసభను రద్దు చేసే అంశంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు న్యాయనిపుణల సలహ తీసుకుంటున్నారు. సెప్టెంబర్ 2 వ తేదిన హైదారబాద్ శివారులో నిర్వహించే ప్రగతి నివేదన సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభ రద్దు విషయం ప్రస్తావించవచ్చు. ఆ సభలోనే తెరాస అభ్యర్దుల తొలిజాబితాను ప్రకటించే అవకాశమూ ఉంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు వరాల వెల్లువ కురిపించే అవకాశం ఉంది. వీటితో పాటు ఓట్ల కోసం అనేక హమీలు గుప్పించవచ్చు. నిజానికి ప్రగతి నివేదన సభ ముందస్తు ఎన్నికలకు తొలి ప్రచార సభగా మారనుంది. ఈ సభనుంచే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తన ఎన్నికల శంఖరావాన్ని పూరించే అవకాశం ఉంది. ఇందుకోసం మంత్రులు - శాసనసభ్యులు - పార్టీ నాయకులు - కార్యకర్తలనూ సమాయుత్త పరిచే అవకాశమూ ఉంది. మొత్తానికి గెలుపే ధ్యేయంగా ముఖ‌్యమంత్రి కె. చంద్రశేఖర రావు రానున్న ఐదారు నెలలు పనిచేసే అవకాశం ఉంది.