Begin typing your search above and press return to search.

బాబును ఉతికేయంది అందుకేనట..

By:  Tupaki Desk   |   18 March 2019 9:32 AM GMT
బాబును ఉతికేయంది అందుకేనట..
X
ఆశ్చర్యం.. అనూహ్యం.. కేసీఆర్ తిట్టలేదు.. చంద్రబాబును పల్లెత్తు మాట అనలేదు.. మూడు నెలల్లో మూడు వేల తిట్లు చంద్రబాబు తనను తిట్టాడని.. బాబుకు తన భయం పట్టుకుంది అని మాత్రమే కేసీఆర్ అన్నాడు. అంతకుమించి ఏపీ పాలిటిక్స్ పై కానీ.. డేటా చోరీ వివాదంలో చంద్రబాబు విమర్శలపై మాత్రం కేసీఆర్ నోరు మెదపలేదు. దీనివెనుక పెద్దకారణమే ఉందని టీఆర్ఎస్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.

ఏపీలో రాజకీయం చాలా సున్నితంగా ఉంది. ఏం జరిగినా అధికార టీడీపీ దాన్ని క్యాష్ చేసుకునే పనిలో పడింది. వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై కూడా ఈకలు పీకి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై అంటగట్టే ప్రయత్నాలను చంద్రబాబు సహా టీడీపీ మీడియా చేస్తోంది.

ఇక మొన్నటికి మొన్న జగన్ ను కలిసిన కేటీఆర్ వార్తను టీడీపీ బాగా వాడుకుంది. ఏపీ ప్రజలపై జగన్ ను బేస్ చేసుకొని కేసీఆర్ రాజకీయం చేస్తున్నారని జగన్ ను డ్యామేజ్ చేసే ప్లాన్ చేసింది. అందుకే ఆ తర్వాత జగన్ నూతన గృహ ప్రవేశానికి కూడా కేసీఆర్ హాజరు కాలేదన్న టాక్ వినిపించింది.

ఇక ఇప్పుడు కూడా ప్రత్యర్థి చంద్రబాబుకు అవకాశం ఇవ్వరాదనే ఏపీ పాలిటిక్స్ పై కానీ.. డేటాచోరీ ఆరోపణలపై బాబు విమర్శలకు కేసీఆర్ సమాధానం ఇవ్వలేదని సమాచారం. 2014లో జగన్ గెలవాల్సిన ఊపులో ఓడిపోయారు. టీడీపీ మీడియా, చంద్రబాబు రాజకీయం చేసి ఎన్నికల వేళ అంతా మార్చేశారు. అందుకే ఈసారి బాబుకు ఏమాత్రం అవకాశం ఇవ్వరాదనే కేసీఆర్ ఏపీ పాలిటిక్స్ పై చంద్రబాబుపై పరుషంగా తిట్టడానికి వెనుకాడాడని సమాచారం. కేసీఆర్ తిడితే దాన్ని రాజకీయంగా వాడుకొని బాబు లాభపడుతాడన్న ఉద్దేశంతోనే కేసీఆర్ సైలెన్స్ అయ్యారని సమాచారం. ఎన్నికల అనంతరమే చంద్రబాబుకు కేసీఆర్ కౌంటర్ ఇస్తారని టీఆర్ ఎస్ వర్గాలు చెబుతున్నాయి.