Begin typing your search above and press return to search.
జమిలిపై కెసీఆర్ కు ఎందుకు ప్రేమ
By: Tupaki Desk | 9 July 2018 2:30 PM GMTదేశవ్యాప్తంగా లోక్ సభకు - శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న ప్రధాని నరేంద్రమోది ఆలోచనలకు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు సరే అంటున్నారా. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ తో సహా చాలా రాష్రాలు ఈ జమలి ఎన్నికలను తిరస్కరిస్తున్నాయి. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ మాత్రం ఈ ఎన్నికలకు సరే అంటున్నారు. ఈ అంగీకారం వెనుక రాజకీయ రహస్యం దాగి ఉందా అని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. జమిలి ఎన్నికలైతే తన విజయంనల్లేరుమీద నడకేనని కేసిఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకేసారి ఎన్నికలు జరపడం వల్ల ఓటరు నాడి తెలుస్తుందని కేసిఆర్ అంచన. ఓకేసారి రెండు ఓట్లు వేయాల్సి వస్తే ఒక ఓటు తనకు కచ్చితంగా పడుతుందని కేసిఆర్ వ్యుహంలా తెలుస్తోంది. రాజకీయ వ్యుహాలలో దిట్ట అని పేరున్న కల్వకుంట్ల వారు జమిలి ఎన్నికలపై ఆసక్తి కనబరచడం నరేంద్రమోదికి మేలు చేసినట్లుగా కనబడుతోంది. భారతీయ జనతా పార్టీ - తెలంగాణ రాష్ట్ర సమితి మధ్య కుదిరిన రహస్య ఒప్పందం ఈ జమిలి ఎన్నికలతో బహిర్గమైనట్లు అయింది. కేంద్రంలోను - రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుండా చేయడంలో భాగమే ఈ జమిలి ఎన్నికల రహస్య ఒప్పందంగా కనబడుతోంది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలపడుతుండడం - ఆ పార్టీతో చంద్రబాబు నాయుడు జత కట్టేందుకు ప్రయత్నిస్తుండడం ముఖ్యమంత్రి కేసిఆర్ ను కలవరపెడుతోంది. దీంతో అటు బిజేపికి లాభదాయకంగా తనకూ కలసి వచ్చేలా కేసిఆర్ ఈ జమిలి పాచికను వేస్తున్నట్టుగా తెలుస్తోంది. పైకి గంభీరంగా గెలుపు తనదేనని చెప్పుతున్నప్పటికీ లోలోపల మాత్రం కేసిఆర్ ను ఓటమి భయం వెంటాడుతోంది. తనను గద్దె దించేందుకు అన్నీ పార్టీలు ఏకమైతే ముందుముందు కష్టమని ఆయన భావిస్తున్నారు. జమిలి ఎన్నికలైతే తనకూ కేంద్రంలోని బిజేపికి ప్రజలు తప్పక ఓటు వేస్తారని ఆయన గట్టి నమ్మకం. ఈ కారణాలతోనే కేసిఆర్ జమిలి ఎన్నికలకు సరే అంటున్నట్లు సమాచారం. జమిలి ఎన్నికలు వస్తాయో రావో దేవుడికి ఎరుక కాని బిజేపితో కేసిఆర్ జతకడుతున్నారన్నది మాత్రం తేలిపోయింది.