Begin typing your search above and press return to search.

కేసీఆర్ బూతుల పర్వం వెనుక కారణమేంటి.?

By:  Tupaki Desk   |   5 Oct 2018 5:26 AM GMT
కేసీఆర్ బూతుల పర్వం వెనుక కారణమేంటి.?
X
తెలంగాణ ఉద్యమం కాలంలో ఆంధ్రోళ్లను పట్టుకొని పరుషంగా తిట్టేవారు కేసీఆర్.. వాడు - వీడు అంటూ తెలంగాణ మాండలిక యాసలో ఇరగదీసేవారు.. అప్పుడు ఉద్యమ వేడి కాబట్టి కేసీఆర్ ను ఆంధ్రా నేతలు ఏమి అనేవారు కాదు.. నిజానికి ఇప్పుడున్న ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కేసీఆర్ లాంటి రాజకీయ వ్యూహకర్త.. మాటల మరాఠీ ఎవరూ లేరనడంలో ఎలాంటి సందేహం లేదు. అయన తిట్టడం కామనే.. తిట్టకపోతేనే వార్త అయ్యి కూర్చుటుంది. ఎలాగంటారా.? ఆమధ్య కొంగరకలన్ లో తొలి ప్రగతి నివేదన సభలో కేసీఆర్ ఎవ్వరినీ తిట్టకుండా సునిశితంగా మాట్లాడారు. అభివృద్ధిని మాత్రమే వివరించారు.. ఆ ప్రసంగం చూశాక చాలా మంది కేసీఆర్ పని అయిపోయిందని.. ఆయనలో మునుపటి వేడి లేదని ఆడిపోసుకున్నారు. ఇప్పుడేమో ఎన్నికల ముందట బండబూతులు తిడుతుంటే కేసీఆర్ భాష మార్చుకో అంటూ వార్నింగ్ లు ఇస్తున్నారు. కేసీఆర్ తిట్టినా వార్తే..తిట్టకున్నా వార్తే అయ్యి కూర్చుంది. నిజానికి కేసీఆర్ కు ఎక్కడా తిట్టాలో.. ఎలా తిట్టాలో తెలుసు. అందుకే ఊరికే తిట్టరాయన.. రాజకీయ ప్రయోజనం లేనిదే ఒక్క మాట కూడా మాట్లాడరాయన..

మొన్నటివరకూ నాలుగున్నరేళ్ల అధికారంలో కేసీఆర్ ఉన్నారు. ఆయన పాలనలో ఆంధ్రా - తెలంగాణ - వివిధ రాష్ట్రాల సెటిలర్లున్నారు. దీంతో అందరి నాయకుడిలా సామాన్యంగా మాట్లాడారు. ఇప్పుడు అధికారం పోయింది. ఎన్నికల వేళ వచ్చింది. ఇప్పుడు కూడా అలానే మాట్లాడితే కుదరదు. అందుకే తెలంగాణ జనాలకు ఎంతో అలవాటైనా.. సాధారణ మాండలిక భాషలో ప్రతిపక్ష నేతలను బండబూతులు తిట్టేశాడు. ఆ తిట్లకు సభలో ఫుల్ రెస్పాన్స్ వచ్చిదంటే అతిశయోక్తి కాదు. తమ నేత - తమ భాషలో వ్యహారికంగా మాట్లాడేసరికి అందరికీ కనెక్ట్ అయ్యింది. కేసీఆర్ తిట్లకు జనం నుంచి ఫుల్ రెస్సాన్స్ వచ్చింది.

జనాలను ఆకట్టుకునేందుకు కేసీఆర్ అప్పుడప్పుడు తెలంగాణ మాండలిక యాస - భాషలోకి మారిపోతుంటారు. అలా మాట్లాడితేనే వాల్లకు అర్థమవుతుంది. కనెక్ట్ అవుతారు. ఎన్నికల వేళ.. ఇంకా మంత్రాలకు చింతకాయలు రాలవు అని కేసీఆర్ కు తెలుసు. అందుకే సెంటిమెంట్ - భాష - యాస అన్నీ ఉపయోగించి తెలంగాణ జనాలను తనవైపు తిప్పుకునే పనిలో పడ్డారు. అందుకే బూతులు - బండబూతులు వచ్చేస్తున్నాయి. పగోడిని ఎవరైనా తిడితే మనం ఎంత ఇంట్రస్టింగ్ గా వింటాం.. ఇప్పుడు తెలంగాణ టీఆర్ ఎస్ అనుకూలురుకు కూడా కేసీఆర్ మాటలు స్వీట్ గానే వినిపిస్తున్నాయి. ఎవ్వరూ ఎన్ని విమర్శలు చేసినా జనాలకు కనెక్ట్ అయ్యేలా మాట్లాడడంలో కేసీఆర్ ను మించిన వారు లేరనడంలో ఎలాంటి సందేహం లేదు.