Begin typing your search above and press return to search.

కోమ‌టిరెడ్డి జంపింగ్ ఆగిపోయింది ఇందుకా?

By:  Tupaki Desk   |   7 Jun 2016 1:59 PM GMT
కోమ‌టిరెడ్డి జంపింగ్ ఆగిపోయింది ఇందుకా?
X
నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కారెక్క‌డం అంతా ఖ‌రారైన‌ట్లే వార్త‌లు వెలువ‌డిన‌ప్ప‌టికీ ఎందుకు కండువా మార్చుకోలేదు? కాంగ్రెస్ పై ఘాటు విమ‌ర్శ‌లు చేసిన కోమ‌టిరెడ్డి ఎందుకు అధికార పార్టీలో చేర‌డం లేదు? అనే చ‌ర్చోప‌చ‌ర్చ‌ల‌కు రాజ‌కీయ‌వ‌ర్గాల నుంచి ఆస‌క్తిక‌ర స‌మాచారం వస్తోంది.

అమెరికా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన కోమ‌టిరెడ్డి అక్క‌డే మంత్రి కేటీఆర్‌ తో చర్చలు జరిపినట్టు వార్త‌లు వెలువ‌డ్డాయి. అనంత‌రం ఆయ‌న మంత్రి హ‌రీశ్‌ రావుతో కూడా చ‌ర్చ‌లు జ‌రిపారు. ఈ నెల ఆరున టీఆర్‌ ఎస్‌ లోకి చేరడానికి ముహూర్తం ఖరారు చేసుకున్నార‌ని కూడా తెర‌మీద‌కు వ‌చ్చింది.

అయితే ఈ ప్ర‌క్రియ ఆగిపోవ‌డానికి జిల్లాల విభజన కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. జిల్లాల విభ‌జ‌న‌ అనంతరమే టీఆర్ ఎస్‌ లో చేరితే బాగుంటుందన్న అభిప్రాయానికి కోమ‌టిరెడ్డి వచ్చారన్న వార్తలు వినిపిస్తున్నాయి. నల్లగొండ - సూర్యాపేట జిల్లాలుగా అయితే నల్లగొండ జిల్లా తన నాయకత్వంలోకి వస్తుందనేది కోమటిరెడ్డి బ్రదర్స్‌ ఆలోచనగా ఉందని తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ఆగిపోయిన‌ట్లు స‌మాచారం. దీంతోపాటుగా త‌న సోద‌రుడు రాజగోపాల్‌ రెడ్డి సీటు కోసమే వెంకటరెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని తెలిసింది. రాజ‌గోపాల్‌ రెడ్డి కోసం మునుగోడు సీటును అడిగినట్టు సమాచారం. దీనిపై త్వరలో ఏకాభిప్రాయానికి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మ‌రోవైపు అదేవిధంగా మహబూబ్‌ నగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ సైతం ఇదే కార‌ణంతో వేచిచూస్తున్నార‌ని స‌మాచారం. గద్వాల జిల్లా కోసం ఆమె పట్టుపడుతున్నారనీ, ఈ విషయంలో ఇంకా స్పష్టత రాలేదని చ‌ర్చ న‌డుస్తోంది.