Begin typing your search above and press return to search.
కోనేరు ప్రసాద్ రాజీనామా వెనుక టీడీపీ!
By: Tupaki Desk | 18 March 2016 4:13 AM GMTవైసీపీ తరఫున విజయవాడ లోక్ సభ స్థానానికి గత సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కోనేరు ప్రసాద్ రాజీనామా చేయడం వెనుక టీడీపీ ఉందా? జగన్ కు గుడ్ బై చెప్పిన ఈ నేత త్వరలో టీడీపీలో చేరనున్నారా? అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా జరిగిన ఓ కీలక చర్చే కోనేరు రాజీనామాకు కారణమా? అంటే అవుననే సమాధానం వస్తోంది.
సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాతి నుంచి రాజీనామా చేసే వరకు అంటే దాదాపుగా రెండేళ్లుగా వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు దూరంగా ఉంటున్న కోనేరు సడెన్ గా రాజీనామా చేయడం వెనుక పెద్ద మతలబే ఉందని సమాచారం. అసెంబ్లీలో సరిగ్గా మూడ్రోజుల క్రితం ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలో బీచ్ సాండ్ పై పెద్ద ఎత్తున్నే చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఏపీలో టీడీపీతో కలిసి అధికారం పంచుకుంటున్న బీజేపీకి చెందిన ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. ఏకంగా 2జీ స్కామ్ కంటే పెద్ద కుంభకోణమని ఆరోపించారు. ఈ ఎపిసోడ్ జరిగిన రెండ్రోజుల తర్వాతే కోనేరు ప్రతిపక్ష వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు!
విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం బీజేపీ విమర్శలను చంద్రబాబు ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. అయితే ఇప్పటికే ఉత్తరాంధ్రలో బీచ్ సాండ్ వ్యాపారంలో కోనేరు ప్రముఖ స్థానంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో తన ప్రాజెక్ట్ లను కాపాడుకోవడం కోసమే రాజీనామా చేశారని సమాచారం.
ఇప్పటికే తమిళనాడులో ఈ బీచ్ సాండ్(మోనో జైట్) తవ్వకాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే పరిస్థితి తలెత్తే అవకాశం ఉందనే కోనేరు ముందుగా జాగ్రత్తపడ్డట్లు సమాచారం. కొన్ని నెలల పాటు రాజకీయాలకు దూరంగా ఉండి అనంతరం ఆయన టీడీపీలో చేరే అవకాశాలు ఉన్నాయి.
1999-2004 వరకు తెలుగుదేశం ప్రభుత్వం - టీడీపీ అధినేత చంద్రబాబుతో కోనేరు రాజేంద్రప్రసాద్ కు మంచి సంబంధాలే ఉన్నాయి. బాబు సీఎంగా ఉన్న సమయంలో ఆయన పలు సమావేశాలు కూడా ఏర్పాటు చేశారు. అనంతరం వ్యాపార లావాదేవీల నిమిత్తం దివంగత సీఎం రాజశేఖరరెడ్డికి దగ్గరైన కోనేరు అదే క్రమంలో జగన్ కు జై కొట్టారు. పరిణామాలు చూస్తుంటే తిరిగి బాబు పంచన చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
-గరుడ