Begin typing your search above and press return to search.

ఎందుకు?: భారీ స‌భ‌లో కేటీఆర్ మిస్సింగ్‌

By:  Tupaki Desk   |   28 April 2017 3:43 AM GMT
ఎందుకు?:  భారీ స‌భ‌లో కేటీఆర్ మిస్సింగ్‌
X
తెలంగాణ రాష్ట్ర అధికార‌ప‌క్షం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్వ‌హించిన ప్ర‌గ‌తి నివేద‌న స‌భ గ్రాండ్ స‌క్సెస్ అయ్యింది. మండే ఎండ‌లో భారీ స‌భ‌ను నిర్వ‌హించ‌టం అంత చిన్న విష‌యం కాదు. అయితే.. ముందు నుంచి గులాబీద‌ళం చెబుతున్న రీతిలో ప‌దిహేను ల‌క్ష‌ల స్థాయిలో జ‌నాలు రాన‌ప్ప‌టికీ.. భారీగానే జ‌నాలు రావ‌టం మాత్రం గొప్పేన‌ని చెప్పాలి. బ‌య‌ట‌కు రావ‌టానికి సైతం వ‌ణుకు పుట్టిస్తున్న ఎండ మంట వేళ‌లో.. స‌భ కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ ప్రాంతాల నుంచి జ‌నాలు వ‌రంగ‌ల్ దిశ‌గా అడుగులు వేయ‌టం.. వ‌రంగ‌ల్ ర‌హ‌దారులు మొత్తం గులాబీ మ‌యంగా మారిపోయిన ప‌రిస్థితి.

ఇంతటి భారీ బ‌హిరంగ స‌భ‌లో.. తెలంగాణ‌రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ రాజ‌కీయ వార‌సుడిగా అభివ‌ర్ణించే ఆయ‌న కుమారుడు క‌మ్ రాష్ట్ర మంత్రి కేటీఆర్ మిస్సింగ్ కావ‌టం కాసేపుక‌ల‌క‌లం రేపింది. ప్ర‌ముఖుల ఉత్తేజ‌పూరిత ప్ర‌సంగాలు.. భారీ బ‌హిరంగ స‌భ‌తో పాటు.. భారీత‌నానికి త‌గ్గ‌ట్లుగా జ‌నాలుపెద్ద ఎత్తున పోటెత్త‌టం తెలిసిందే. టీఆర్ ఎస్ 16వ ఆవిర్భావాన్ని దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని ఏర్పాటు చేసిన స‌భ‌లో ఒక వ్య‌వ‌హారం అంద‌రి దృష్టిని విప‌రీతంగా ఆక‌ర్షించింది.

కేసీఆర్ రాజ‌కీయ వార‌సుడిగా త‌ర‌చూ వార్త‌ల్లోకి వ‌స్తున్న ఆయ‌న కీల‌క‌స‌భ‌లో క‌నిపించ‌క‌పోవ‌టం కాస్త క‌న్ఫ్యూజ‌న్ కు దారి తీసింది. దీంతో.. ఆయ‌న కోసం వెదుకులాట ప్రారంభ‌మైంది. స‌భ‌లో కీల‌క ప‌రిణామాలు ఒక్కొక్క‌టి పూర్తి అవుతున్నా.. కేటీఆర్ క‌నిపించ‌క‌పోవ‌టంతో గులాబీ శ్రేణుల్లో ఆయ‌న కోసం ప‌లు మార్గాల్లో వెత‌క‌టం షురూ చేయ‌టంతో.. కేటీఆర్ ఆచూకీ ల‌భించింది. ఆయ‌న హైద‌రాబాద్ నుంచి రోడ్డు మార్గంలో బ‌య‌లుదేర‌టం.. విప‌రీత‌మైన జ‌న‌సందోహంతో.. ట్రాఫిక్ జాంలో చిక్కుకున్నుట్లుగా తేల‌టంతో అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాట్లాడుతున్న స‌మ‌యానికి వేదిక వ‌ద్ద‌కు చేరుకున్నారు. కేటీఆర్ మాదిరే మ‌రో కీల‌క మంత్ర ఈటెల రాజేంద‌ర్‌సైతం ట్రాఫిక్ చిక్కుల్లో చిక్కుకుపోయారు.

దీంతో.. వీరిద్ద‌రూ ఆల‌స్యంగా స‌భాస్థ‌లి వ‌ద్ద‌కు వ‌చ్చారు. వీరు వ‌చ్చేస‌రికి కీల‌క ప్ర‌సంగం సాగుతుండ‌టంతో.. వెనుక వ‌రుస‌లో వేసిన కుర్చీల్లో ఈ ఇద్ద‌రు నేత‌లు కూర్చున్నారు. నిజానికి మంత్రి కేటీఆర్‌.. ఈటెల‌కు ముందువ‌రుస‌లో కుర్చీలు కేటాయించారు. ఆల‌స్యం కార‌ణంగా వెనుక‌నే ఉండిపోయారు. ట్రాఫిక్ జాం కార‌ణంగా స‌భాస్థ‌లికి ఈ ఇద్ద‌రు కీల‌క నేత‌లు ఎప్ప‌టికి చేరుకుంటార‌ని టెన్ష‌న్ ప‌డిన గులాబీ శ్రేణులు.. కాస్త ఆల‌స్యంగా అయినా క‌నిపించటంతో ఊపిరి పీల్చుకున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/