Begin typing your search above and press return to search.
అందుకే..లండన్ భవనం బూడిద అయ్యిందా?
By: Tupaki Desk | 15 Jun 2017 9:41 AM GMTలండన్ మహానగరంలో చోటు చేసుకున్న బహుళ అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకోవటం తెలిసిందే. ఈ ఫైర్ యాక్సిడెంట్లో 12 మంది ప్రాణాలు కోల్పోగా.. 74 మందికి గాయాలు అయ్యాయి. 24 అంతస్తుల భవనం మంటల్లో చిక్కుకొని.. బూడిద కుప్పగా మారిపోయింది.
ఆ భవనంలో ఇంకేమీ మిగల్లేదన్నట్లుగా మారిపోవటం తెలిసిందే. ఇంత భారీ అగ్నిప్రమాదానికి అసలు కారణం ఏమిటి? ఇంతలా మంటలు ఎలా చెలరేగాయి? లాంటి ప్రశ్నలు పలువురికి వచ్చాయి. అయితే.. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తోనే ఇంత ప్రమాదం జరిగినట్లుగా చెప్పారు. అయితే.. అసలు కారణం అది కాదన్న విషయం కొత్తగా బయటకు వచ్చింది.
ప్రత్యక్ష సాక్ష్యుల కథనం ప్రకారం.. ఈ భారీ భవనంలో నివసిస్తున్న 41 ఏళ్ల బ్రిటీష్ వ్యక్తి ఇంట్లో ఫ్రిజ్ పేలిపోవటం వల్లే భవనంలో మంటలు చెలరేగినట్లుగా తెలుస్తోంది. భారీగా మంటలు రేగటంతో.. పక్కనున్న ఇంటి వారికి.. తన ఇంట్లో చోటు చేసుకున్న అగ్నిప్రమాదం గురించి చెప్పి.. అతను వెళ్లిపోయినట్లుగా చెబుతున్నారు.
అర్థరాత్రి పన్నెండు గంటల సమయంలో తన ఇంటి తలుపుకొట్టిన వ్యక్తి.. తన ఇంట్లో జరిగిన వైనాన్ని చెప్పి.. స్వల్పంగా మంటలు వస్తున్నాయని చెప్పి వెళ్లిపోయాడట. వెంటనే వారు అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేసి.. వారు వచ్చేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయినట్లుగా వారు చెబుతున్నారు. ప్రత్యక్ష సాక్ష్యుల కథనం నేపథ్యంలో.. ఫైర్ యాక్సిడెంట్ మీద కొత్త అనుమానాలు వస్తున్నాయి. ఈ అగ్నిప్రమాదం కావాలని జరిగిందా? లేక.. అనుకోకుండా జరిగిందా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. అధికారులు సైతం కుట్ర కోణంలో విచారణను ముమ్మరం చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/