Begin typing your search above and press return to search.
మావోల విస్తరణ.. కిడారి హత్యతో నాంది..
By: Tupaki Desk | 25 Sep 2018 9:42 AM GMTఒకప్పుడు నల్లమల నుంచి విశాఖ మన్యం వరకూ పోలీసులకు మావోయిస్టులు సవాలు విసిరేవారు. ఆ తర్వాత క్రమంలో పోలీసుల కూంబింగ్ ఎక్కువై నల్లమలలో మావోయిస్టు పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. ఒడిషా సరిహద్దులు, విశాఖ మన్యం వరకే మావోయిస్టు కార్యకలాపాలు పరిమితమయ్యాయి. అప్పుడప్పుడు చత్తీస్ గఢ్ - ఒడిషా నుంచి ఏవోబీలోకి దళాలు వచ్చి వెళుతున్నాయి.
ఇప్పుడు ఎన్నో రోజులుగా స్తబ్దుగా ఉన్న విశాఖ మన్యంలో సానుభూతి పరులు, మిలీషియా సభ్యులను పెంచుకోవడంలో మావోయిస్టులు సక్సెస్ అయ్యారు. తెలంగాణ, చత్తీస్ గఢ్, ఒడిషా నుంచి మెరికల్లాంటి సాయుధులను తీసుకొచ్చి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్జీ) ఏర్పాటు చేయబోతున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.ఇందుకోసం కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ - దండకారణ్యం నుంచి ఏవోబీకి వచ్చి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇటీవలే జరిగిన మావోయిస్టు వారోత్సవాల తర్వాత పీఎల్జీ రూపాంతరం చెందబోతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. ఎన్నికల వేళ నేతలపై మరిన్ని దాడులు చేసేందుకు ఈ పీఎల్జీ సిద్ధమైందని పోలీసులకు ఉప్పందింది. జితేందర్ రెడ్డి అలియాస్ కృష్ణ, ఒడిషా నుంచి మాపూరి వెంకటరమణ అలియాస్ గణేష్ లకు పీఎల్జీ బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం.
శత్రువు బలంగా ఉన్నప్పుడు వెనక్కి తగ్గి.. బలహీనంగా ఉన్నప్పుడు దాడి చేయడమే గెరిల్లా యుద్ధ తంత్రం.. ఇప్పుడు ఇందుకు అనుగుణంగానే వ్యవహరించి మావోయిస్టు యాక్షన్ టీం పథకం ప్రకారం పని కానిచ్చింది. మావోయిస్టు వారోత్సవాల వేళ ఏజెన్సీకి వెళ్లొద్దని నేతలకు పోలీసులు ఆదేశాలిచ్చారు. ‘గూడు’ గ్రామానికి వెళ్లి దారిలోని లివిటిపుట్ట గ్రామాన్ని అన్ని విధాలా సురక్షితమని నమ్మిన మావోయిస్టులు అక్కడే యాక్షన్ కు దిగారు. సెల్ సిగ్నల్స్ పనిచేయమని ఈ గ్రామం చుట్టుపక్కలా ఇన్ ఫార్మర్లను అడుగడుగునా మోహరించారు. ఎమ్మెల్యే కిడారి - మాజీ ఎమ్మెల్యే సోము వాహనాలు రాగానే వెంటనే ఇన్ ఫార్మర్లు మిలీషియా మహిళా సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఆ వాహనాలను వారితో ఆపించారు. వారు వచ్చి ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డుకొని కిందకు దించి కొద్ది దూరం తీసుకెళ్లి చంపించారు. ఇలా విస్తరణ బాటలో ఉన్న మావోలు ఎమ్మెల్యే కిడారి హత్యతోనే తమ ఉనికిని చాటి పోలీసులకు కొత్త సవాల్ విసిరారు. విస్తరించిన మావోలను ఇప్పుడు పోలీసులు ఎలా కట్టడి చేస్తారన్నది వేచిచూడాలి.