Begin typing your search above and press return to search.

యోగిని సీఎం చేసింది అందుకేనా?

By:  Tupaki Desk   |   20 March 2017 4:39 AM GMT
యోగిని సీఎం చేసింది అందుకేనా?
X
దేశ ప్రజలు ఆశ్చర్యపోయేలా నిర్ణయాలు తీసుకోవటం ప్రధాని మోడీకి కొత్తేం కాదు. సర్జికల్ స్ట్రైక్ అన్నా.. పెద్ద నోట్ల రద్దు అన్నా.. యూపీకి కరడుగట్టిన హిందుత్వవాది అయిన యోగి ఆదిత్యనాథ్ లాంటోడ్ని సీఎంను చేసినా మోడీకే చెల్లించింది. అందరికి షాక్ ఇచ్చేలా ఆయన తీసుకున్న నిర్ణయం అషామాషీ కాదని.. ముందుచూపుతో.. చాలా లోతుగా ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెబుతున్నారు.

యూపీ ముఖ్యమంత్రిగా యోగి పేరును బీజేపీ ప్రకటించిన వెంటనే సామాన్యులే కాదు.. రాజకీయ పక్షాలు సైతం ఒక్కసారిగా అవాక్కు అయ్యాయి. ఎవరూ ఊహించని రీతిలో నిర్ణయాలు తీసుకోవటం.. సాహసోపేతమైన కోణంలో విషయాల్ని చూడటం మోడీకి అలవాటే. అందులో భాగంగానే యోగిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేశారని చెప్పాలి. ఇంతకూ యూపీ ముఖ్యమంత్రి పీఠం మీద యోగిని ఎందుకు కూర్చోబెట్టారు? కమలనాథుల వ్యూహం ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

దీనికి సమాధానం వెతికితే.. భావోద్వేగ రాజకీయాల్ని యూపీలో దీర్ఘ కాలం కొనసాగించాలన్న భావనలోకి వెళ్లటం.. గుజరాత్ లో అనుసరించిన ఫార్మూలాను యూపీలో కంటిన్యూ చేయాలనుకోవటంతో పాటు.. హిందుత్వ ఓటు బ్యాంకును ఒక్కటిగా చేయాలన్నదే అసలు వ్యూహంగా చెబుతున్నారు. ఇప్పటివరకూ కులాలతో రాజకీయాల్ని మాత్రమే చేసిన రాజకీయ పార్టీలకు భిన్నంగా.. మతంతో రాజకీయాన్ని పరిచయం చేసి.. హిందుత్వ ఓటు బ్యాంకును బలీయంగా చేయటం ద్వారా.. తిరుగులేని అధిక్య రాజకీయాల్ని చేయాలన్నదే మోడీ అండ్ కో ఆలోచనగా చెబుతున్నారు.

ఎవరు అవునన్నా కాదన్నా.. యూపీలో యోగి సీఎంగా ఉన్నంతవరకూ మత రాజకీయాలే నడుస్తాయనటంలో సందేహం లేదని చెప్పొచ్చు. ఇందుకు తగ్గట్లే సంఘ్ పరివార్ ఒత్తిడి మేరకే యోగిని సీఎంగా డిసైడ్ చేశారని చెబుతున్నారు. అన్నింటికి మించి 2014 సార్వత్రిక ఎన్నికల ముందు.. అయోధ్యలో రామాలయన్నినిర్మిస్తామన్న మాటను నిజం చేసే దిశగా అడుగులు వేయాలంటే.. అందుకు తగ్గ సీఎం ఉండాలని.. దీనికి యోగికి మించినోళ్లు ఉండరన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మోడీ ప్రధాని అయ్యాక అయోద్యలో రామాలయానికి అవసరమైన శిలలు రావటం మొదలైందని.. రామ మందిరాన్ని నిర్మించేందుకు అవసరమైన ఏర్పాట్లు తెర వెనుక జరుగుతున్నాయని చెప్పొచ్చు. అయోధ్యలో రామాలయాన్ని నిర్మించాలని తపించే యోగి లాంటి నేతను.. కోరి సీఎంను చేయటం అంటే.. అయోధ్యలో రామాలయ నిర్మాణ దిశగా అడుగులు వేసేందుకు  వీలుగా రంగం సిద్ధం చేస్తున్నారని.. అందులో భాగంగానే యోగిని సీఎంగా చేశారన్న మాట వినిపిస్తోంది. ఇందులో భాగంగానే ఆయన్ను సీఎం చేశారన్న మాట వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/