Begin typing your search above and press return to search.
బాలయ్య పాదయాత్రకు కారణం తెలుసా..
By: Tupaki Desk | 1 March 2017 7:35 AM GMTరాజకీయ పాదయాత్రలంటే అందుకు ఒక కారణం ఉంటుంది.. ప్రత్యేకంగా ఏదైనా ఒక డిమాండ్ పరిష్కారం కోసమో.. లేదంటే ప్రజల సమస్యలన్నీ తెలుసుకోవడానికో పాదయాత్రలు చేస్తుంటారు. కానీ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మాత్రం అసలు కారణం వదిలేసి అవగాహన పేరుతో పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నారు. అనంతపురం జిల్లా పెనుకొండ రూరల్ మండలం గొల్లపల్లి రిజర్వాయరు నుంచి తన నియోజకవర్గ కేంద్రం హిందూపురానికి తాగునీరు అందించడానికి చేపడుతున్న చర్యలపై అవగాహన కల్పించడం కోసమంటూ ఆయన పాదయాత్ర చేయబోతున్నారట. ఈ మేరకు ఏప్రిల్ లో పాదయాత్ర చేద్దామని నియోజకవర్గ నేతల వద్ద ఆయన ప్రదిపాదించారు కూడా.
గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి హిందూపురం పట్టణానికి తాగునీరు అందించే పథకాన్ని సత్వరం పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కోసమే ఈ యాత్ర నిర్వహించనున్నట్టు చెబుతునత్నారు. అయితే.. ఇప్పటికే గొల్లపల్లి రిజర్వాయర్ కు కృష్ణా జలాలు వచ్చి చేరాయి.
మరోవైపు రెండు రోజుల కిందటే గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి హిందూపురానికి 50 కిలోమీటర్ల మేర ప్రత్యేక పైప్ లైన్ వేయడానికి రూ.250 కోట్ల పనులకు గాను ఈఎన్సీ అనుమతి కూడా వచ్చింది. త్వరలోనే మొదటి విడత కింద రూ.160 కోట్లు రిలీజ్ కాబోతున్నాయి కూడా. అంతా సజావుగా సాగిపోతున్న సమయంలో బాలయ్య పాదయాత్ర చేపట్టడంపై నేతలు ఆశ్చర్యపోతున్నారు.
అయితే.. దీనిపై అనంత టీడీపీలో అసలు విషయం మాట్లాడుకుంటున్నారు. హిందూపురంలో ఇటీవల టీడీపీ పరిస్థితి వీధికెక్కిన సంగతి తెలిసిందే. బాలయ్య పీఏ శేఖర్ విషయంలో రచ్చ రచ్చ జరిగింది. పలువురు నేతలు ఏకంగా పార్టీకి అల్టిమేటమ్ కూడా ఇచ్చేసేటంత వరకూ వచ్చేసింది. దీంతో మళ్లీ అందరినీ బుజ్జగించడానికి.. పాదయాత్ర వంటి కార్యక్రమంతో అందరూ తన వైపు ఉండేలా చేసుకోవడానికి.. రీ యూనియన్ కోసం ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు టాక్.
కాగా.. ఈ ఏడాది ఏప్రిల్ లో ఎండలు భారీగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుండడం... పైగా బాలయ్య 101వ సినిమా అనౌన్సు కావడంతో ఏప్రిల్ నాటికి బాలయ్య పాదయాత్ర మాట ఎటు పోతుందో ఇంకా చెప్పలేమని కొందరంటున్నారు. ఒకవేళ బాలయ్య నిజంగానే పాదయాత్ర చేస్తే ఏప్రిల్ నెల మండుటెండల్లో, అనంతపురం లాంటి తీవ్రమైన ఎండలున్న ప్రాంతంలో ఆయనకు చుక్కలు కనిపించడం ఖాయం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/