Begin typing your search above and press return to search.

లోకేశ్ దిల్లీ పర్యటన వెనుక అసలు సంగతి అదేనా?

By:  Tupaki Desk   |   12 Oct 2018 12:59 PM GMT
లోకేశ్ దిల్లీ పర్యటన వెనుక అసలు సంగతి అదేనా?
X
అడ్డదారినో - దొంగదారినో ఏదో రకంగా మంత్రి అయిన తరువాత నారా లోకేశ్ ఎన్నడూ దేశ రాజధాని దిల్లీకి అధికారిక పర్యటనలు జరపలేదు. ఏపీ సీఎం - మంత్రులు దిల్లీకి రాకపోకలు సాగిస్తూ లోకేశ్ మాత్రం ఆ ఛాయలకు ఎన్నడూ పోలేదు. కానీ, రీసెంటుగా మాత్రం ఆయన రెండు రోజుల పాటు దిల్లీలోనే మకాం వేశారు. మంగళవారం రాత్రి దిల్లీ వచ్చిన ఆయన బుధ - గురువారాల్లో దిల్లీలోనే ఉన్నారు. ఏపీకి సంబంధించిన పెండింగ్ సమస్యల పరిష్కారానికే ఆయన దిల్లీ వెళ్లారని టీడీపీ నేతలు చెబుతున్నా అసలు కారణం వేరే ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా ఇటీవల తెలంగాణలో రేవంత్ రెడ్డి - ఏపీలో టీడీపీ నేతలు బీద మస్తాన్ రావు - సుజనా చౌదరి ఇళ్లపై ఐటీ దాడులు జరిగాయి. మరికొందరు టీడీపీ నేతలూ ఆ టార్గెట్లో ఉన్నారన్న అంచనాలున్నాయి. ఆ జాబితాలో లోకేశ్ కూడా ఉన్నట్లు టీడీపీ పెద్దలకు అనుమానాలున్నాయి. దాంతో కేంద్రం వద్దకు కాళ్ల బేరానికే లోకేశ్ వెళ్లారని.. చంద్రబాబు తాను పోకుండా మరికొందరు కేంద్రంలోని తన పరిచయస్థుల ద్వారా లోకేశ్‌ ను సేఫ్ జోన్లో పడేసేందుకు కథ నడిపారన్న ప్రచారం జరుగుతోంది.

రాష్ట్రంలో టీడీపీతో తలపడుతున్న బీజేపీ - వైసీపీలు రెండూ లోకేశ్ అవినీతిపై చాలాకాలంగా ఘోసిస్తున్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా దోచుకుంటున్నారని ఆరోపిస్తున్నాయి. ఈ నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో లోకేశ్ చేసిన అవినీతి ఇంకే రాష్ట్రంలోనూ జరగలేదని చెబుతున్నారు. దీంతో సహజంగానే ఏదో ఒక విషయంలో తనను లక్ష్యం చేసే ప్రమాదముందని లోకేశ్.. చంద్రబాబు ఇద్దరూ చాలాకాలంగా అనుమానిస్తున్నారు. ఇదే సమయంలో ఐటీ దాడులు వేగం పెరిగి టీడీపీ నేతలపై వరుసగా చేస్తుండడంతో లోకేశ్ హుటాహుటిన దిల్లీ వెళ్లారన్నది టాక్?