Begin typing your search above and press return to search.
ఓ కప్పు టీ..ఇద్దరి నిర్లక్ష్యం..104మందికి కరోనా!
By: Tupaki Desk | 30 April 2020 4:30 PM GMTకరోనా మహమ్మారిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. కరోనాను కట్టడి చేయాలంటే సోషల్ లేదా ఫిజికల్ డిస్టెన్సింగ్ ఒక్కటే మార్గమని కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. ప్రజలంతా ఎవరి ఇళ్లలో వారే ఉండి...ఒకరిని ఒకరు కలవకుండా ఉండడమే లాక్ డౌన్ ముఖ్య ఉద్దేశం. భారత్ లో కరోనా ఈ మాత్రం కట్టడి కాగలిగిందంటే దాదాపు 80 శాతం మంది ప్రజలు పక్కాగా లాక్ డౌన్ అమలు చేయడమే. కానీ, కొంతమంది నిర్లక్ష్యం వల్ల లాక్ డౌన్ పక్కాగా పాటించిన వారికి లాక్ డౌన్ ఫలితం దక్కడం లేదు. ఒకరిద్దరు చేసిన తప్పు వల్ల లాక్ డౌన్ చైన్ బ్రేక్ చేయడం కోసం కొన్ని ప్రాంతాలను రెడ్ జోన్ లుగా ప్రకటించి అధికారులు - పోలీసులు - వైద్యులు నానా తంటాలు పడాల్సిన పరిస్థితి శోచనీయం. ఏపీలో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న జిల్లాల్లో ఒకటైన గుంటూరు జిల్లాలో కేసుల సంఖ్య పెరగడానికి ఒక వ్యక్తి నిర్లక్ష్యమే కారణమని తాజాగా అధికారులు తేల్చారు. గుంటూరు జిల్లాలోని నరసరావుపేటలో 15 రోజలు వ్యవధిలోనే 104 కేసులు నమోదు కావడానికి ఓ టీకొట్టు యజమాని కారణమని వెల్లడైంది.
ఏపీలో కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. అయితే, టెస్టులు అధికంగా చేయడం వల్లే కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోందన్న వాదనలున్నాయి. గుంటూరు జిల్లాలో నమోదైన 287 కేసుల్లో అత్యధిక కేసులు గుంటూరు నగరంలో నమోదు కాగా...ఆ తర్వాత స్థానం నరసరావుపేటదే. లాక్ డౌన్ తొలినాళ్లలో పెద్దగా కేసులు లేని నరసరావుపేటలో...ఒక్కసారిగా పదుల సంఖ్యలో కేసులు నమోదవడం ...ఆ కేసుల సంఖ్య అంచెలంచెలుగా 104కు చేరుకోవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 2 రోజుల పాటు నరసరావుపేటలో పూర్తి స్థాయి లాక్ డౌన్ అమలు చేశారంటే పరిస్థితి తీవ్రత అర్ధం చేసుకోవచ్చు. దీంతో, నరసరావుపేటలో ఏం జరుగుతోందన్న చర్చ మొదలైంది. పేటలో కరోనా ఈ స్థాయిలో వ్యాపించడం వెనుక కారణాలేమిటన్న అంశంపై పోలీసులు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. చివరకు నరసరావుపేటలో కరోనా కేసులకు ఓ టీస్టాల్ హాట్ స్పాట్ లా మారిందని గుర్తించారు. నరసరావుపేటలో టీ కప్పులో `కరోనా`...వల్ల 104 కేసులు నమోదయ్యాయని గుర్తించారు. నరసరావుపేటలో ఒక టీ కప్పు వల్ల వచ్చిన కరోనా కల్లోలం...టీ కప్పులో తుపాను వంటిది కాదని...కొంతమంది జీవితాలను ప్రమాదంలోకి నెట్టేసిన వైరస్ పెను తుపాను అని అంటున్నారు.
లాక్ డౌన్ మొదలైన రోజే... నిబంధనలు ఉల్లంఘించిన ఓ వ్యక్తి తన టీ స్టాల్ తెరిచాడు. ఆ టీస్టాల్ లో దేశవ్యాప్తంగా కలకలం రేపిన హాట్ స్పాట్ `ఢిల్లీ మర్కజ్`కు వెళ్లిన ఓ వ్యక్తి టీ తాగాడు. నేనొక్కడిని టీస్టాల్ తెరిస్తే ఏమవుతుందిలే అని ఆ టీస్టాల్ నిర్వాహకుడు...లాక్ డౌన్ లో నిబంధనలు ఉల్లంఘించి నేనొక్కడినీ టీ తాగితే ఏమవుతుందిలే అని ఆ టీ తాగిన వ్యక్తి అనుకోవడంతోనే ఇంత ప్రమాదం జరిగింది. వారిద్దరూ టీ కప్పులో తుపాను అనుకున్న ఘటన...కరోనా వైరస్ తుపానులా మారి నరసరావుపేటను చుట్టుముట్టింది. వారిద్దరితోపాటు అక్కడే టీ తాగిన మరొకరికి కూడా కరోనా వచ్చింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి చనిపోయాడు. అతడు చనిపోయిన తరువాతే అతడికి కరోనా ఉందని నిర్థారణ అయ్యింది. అతడి ద్వారా కాంటాక్ట్‌లో ఉన్న కుటుంబసభ్యులు, ఇరుగుపొరుగున ఉన్న మరికొందరికి కరోనా సోకింది. ఇలా నరసరావుపేటలో కేసులు 104కు చేరుకున్నాయని పోలీసులు తేల్చారు. నరసరావుపేటతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోనూ కొందరికి కరోనా సోకడంతో... అక్కడ అనేక గ్రామాలు రెడ్ జోన్‌లో ఉన్నాయి. ఇదే విధంగా చెన్నైలో ఓ బార్బర్ షాపు నుంచి 30 మందికి, సూర్యాపేటలో అష్టాచెమ్మ ఆడి 31 మందికి, విజయవాడలో పేకాట ఆడి 38 మందికి కరోనా సోకిన ఘటనలు కలకలం రేపాయి. ఒక్కరి నిర్లక్ష్యం...ఎందరికో ప్రాణ సంకటం. అందుకే, ప్రభుత్వ నిబంధనలు పాటించి...కొన్నాళ్లు ఓపిక పడితే ఈ మహమ్మారిని తరిమికొట్టవచ్చు. లేదంటే...ఈ కరోనా చెయిన్ బ్రేక్ చేయడం కష్టం.