Begin typing your search above and press return to search.

మోడీ మ‌ర్యాద ముసుగు ఎందుకు తీసిన‌ట్లు?

By:  Tupaki Desk   |   30 April 2019 5:30 PM GMT
మోడీ మ‌ర్యాద ముసుగు ఎందుకు తీసిన‌ట్లు?
X
రాజ‌కీయం అంతిమ ల‌క్ష్యం అధికారం. అందుకోసం ఏమైనా చేసే విష‌యంలో కొన్ని మొహ‌మాటాలు ఉండేవి. అలాంటి వాటితో ఎందుకు ఇబ్బంది? ఏం అనిపిస్తే అది చేసేస్తే పోలా? అన్న బ‌రితెగింపును ప్ర‌ద‌ర్శిస్తున్న కొంద‌రు నేత‌ల తీరు ఇప్ప‌టికే చ‌ర్చ‌గా మారిన వేళ‌.. అలాంటి వారికి బిగ్ బాస్ మాదిరి మారారు ప్ర‌ధాని మోడీ.

వ్య‌క్తిత్వ వికాస నిపుణుడిగా మాట్లాడే ఆయ‌న‌.. ఎన్నిక‌ల స‌మ‌యంలో అందుకు భిన్న‌మైన వ్యాఖ్య‌లు చేస్తుంటారు. తాజాగా ప‌శ్చిమ‌బెంగాల్ లో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు వింటే షాక్ తినాల్సిందే. ప్ర‌ధాని స్థానంలో ఉన్న మోడీ.. త‌మ‌కు ప్ర‌త్య‌ర్థి పార్టీ అధికారంలో ఉన్నంత మాత్రాన‌.. ఫ‌లితాలు వెల్ల‌డైన వెంట‌నే 40 మంది ఎమ్మెల్యేలు త‌మ‌వైపున‌కు వ‌చ్చేస్తార‌ని చెప్ప‌టం దేనికి సంకేతం?

నిజానికి మోడీకి ఇలాంటి తీరు కొత్తేం కాదు. కాకుంటే.. ఇంత‌వ‌ర‌కూ ప‌రోక్షంగా చేయాల్సింది చేసిన ఆయ‌న‌.. ఇప్పుడు ప్ర‌త్య‌క్ష కార్యాచ‌ర‌ణ‌కు దిగేశారు. మొద‌టి రెండు మూడు విడ‌త‌ల పోలింగ్ సంద‌ర్భంగా త‌మ వైరి ప‌క్షానికి చెందిన నేత‌లపై సీబీఐ.. ఐటీ.. ఈడీ లాంటి సంస్థ‌లు త‌నిఖీలు చేయ‌టం తెలిసిందే. ద‌ర్యాప్తు సంస్థ‌ల్ని త‌న జేబు సంస్థ‌లుగా మార్చిన మోడీ.. ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి.

ఇప్పుడు మ‌రో అడుగు ముందుకేసి.. మొహ‌మాట‌పు ప‌ర‌దాల్ని ప‌క్క‌న పెట్టేసి.. యాక్ష‌న్ ప్లాన్ ను తానే తెర మీద‌కు తెచ్చేస్తున్న మోడీ వైఖ‌రి ఇప్పుడు పెద్ద చ‌ర్చ‌గా మారింది. మోడీ ఎందుకిలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు? ఎంత ఎన్నిక‌ల్లో గెలుపు కావాల్సి వ‌స్తే మాత్రం.. మ‌రీ ఇంత‌లా దిగ‌జారాలా? దేశ చ‌రిత్ర‌లో ఇప్ప‌టివ‌ర‌కూ ఏ ప్ర‌ధాని వ్య‌వ‌హ‌రించినంత వివాదాస్ప‌ద రీతిలో ఆయ‌న ఎందుకు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అన్న‌ది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌.

రాజ‌కీయ వ‌ర్గాల అంచ‌నా ప్ర‌కారం.. ఇప్ప‌టివ‌ర‌కూ జ‌రిగిన ఎన్నిక‌ల పోలింగ్ బీజేపీకి ఆశాజ‌నంగా లేక‌పోవ‌ట‌మే కార‌ణ‌మంటున్నారు. తొలి మూడు విడ‌త‌ల్లో బీజేపీకి అనుకున్న సీట్లు రాక‌పోవ‌టం ఒక ఎత్తు అయితే.. ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న నాలుగో విడ‌త పోలింగ్ నిరాశాజ‌న‌కంగా ఉండ‌టంతో మోడీలోని అస‌లు మ‌నిషి బ‌య‌ట‌కు వ‌చ్చేశార‌ని చెబుతున్నారు.

తాజాగా ఆయ‌న నోటి నుంచి వ‌చ్చిన 40 మంది ఎమ్మెల్యేల మాట చూస్తే.. త‌మ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు ఎవ‌రైనా స‌రే.. అధికారాన్ని త‌మ చేతికి ఇవ్వాలే త‌ప్పించి.. త‌మ వ‌ద్ద ఉంచుకుంటే కుద‌ర‌ద‌న్న‌ట్లుగా ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. మ‌రింత ఓపెన్ గా మోడీ నోటి నుంచి వార్నింగ్ లు వ‌చ్చేస్తుంటే.. వ్య‌వ‌స్థ‌ల్ని ఆయ‌న ఆట‌బొమ్మలుగా ఆడిస్తున్నార‌న్న ఆరోప‌ణ‌ల్లో నిజం లేకుండా ఉంటుందా? ఓట‌మి భ‌యంతో చేసే మ‌రిన్ని త‌ప్పులు మొద‌టికే మోసపోయేలా చేయ‌వంటారా మోడీ?