Begin typing your search above and press return to search.
మూడు ముక్కలు చేయకుండా రెండే ఎందుకు చేశారు?
By: Tupaki Desk | 6 Aug 2019 5:28 AM GMTకశ్మీరు సమస్యకు పరిష్కారం అడిగినంతనే చాలామంది నోటి నుంచి వచ్చే మాట.. ఆ రాష్ట్రాన్ని మూడు ముక్కలుగా చేయటం.. జమ్మును రాష్ట్రంగా.. మిగిలిన కశ్మీర్ వ్యాలీ.. లద్దాఖ్ ను కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చాలని చెప్పేవారు. కానీ.. అందుకు భిన్నంగా మోడీ సర్కారు మాత్రం రెండుగా విభజించేందుకు ఎందుకు మక్కువ చూపింది. వారి వ్యూహం ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
జమ్ము-కశ్మీర్ ను రెండు భాగాలుగా చేస్తూ మోడీ సర్కారు నిర్ణయం తీసుకోవటం.. రాజ్యసభ దీన్ని ఆమోదించటం తెలిసిందే. ఎందుకీ నిర్ణయాన్ని తీసుకున్నట్లు? అన్నది ప్రశ్న. దీనికి సమాధానం వెతికితే ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయం ప్రకారం అసెంబ్లీతో కూడిన జమ్ము-కశ్మీర్ ప్రాంతం ఒకటైతే.. రెండోది అసెంబ్లీ లేని లద్దాఖ్. జమ్ముకశ్మీర్ రెండుగా విభజించటం ద్వారా మోడీషాలు చతురత ప్రదర్శించారని చెప్పాలి.
ఎందుకంటే.. అసెంబ్లీ ఉండే జమ్ము-కశ్శీర్ లో బీజేపీకి పట్టు ఉన్నజమ్ము ప్రాంతం కీలకమవుతుంది. ఇంకెప్పటికి ఈ ప్రాంతంలో బీజేపీ తప్పించి మరెవరూ అధికారంలోకి రాని పరిస్థితి. భారతదేశంతో కలిసి ఉండాలనే కాంక్ష ఎక్కువగా ఉండే వారు దీన్లో ఉండటంతో.. దేశానికి ఇబ్బంది కలిగించే పరిణామాల్ని పాలకులు తెర మీదకు తీసుకొచ్చే అవకాశం లేదు. హిందువులు ఎక్కువగా ఉండే ఈ రాష్ట్రంలో ఇంకెప్పటికి బీజేపీ మినహా మరో పార్టీ రాజకీయంగా బలపడే అవకాశం లేదు.
ఇక.. రెండో ముక్క విషయానికి వస్తే.. అసెంబ్లీ లేని లద్దాఖ్. నిజానికి కశ్మీర్ సమస్యకు సంబంధించిన కీలక ప్రాంతమంతా ఇక్కడే ఉంటుంది. దీన్ని అడ్డుపెట్టుకునే హురియత్ నేతలు మొదలు.. వేర్పాటు వాదులు ఆటలాడుతుంటారు. ఇక్కడున్న అసెంబ్లీ స్థానాలతో రాజ్యాధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకొని.. తరచూ భారత ప్రభుత్వానికి సవాలు విసరటంతో పాటు.. భారత్ కు ఇబ్బంది కలిగించే నిర్ణయాల్ని ప్రకటిస్తూ ఉంటారు. ఇక్కడ గమనించాల్సిన అంశం మరొకటి ఉంది. అసెంబ్లీ లేని లద్దాఖ్ ప్రాంతంలో కశ్మీర్ వ్యాలీతో పాటు.. భారత్ తో కలిసి ఉండాలన్న అకాంక్ష ఎక్కువగా ఉండే హిందువులు.. బౌద్దులు.. ఇతర వర్గాల వారు ఉంటారు. దీంతో.. కశ్మీర్ వ్యాలీలో విభజన వాదానికి లద్దాఖ్ ప్రాంతీయులు బ్యాలెన్స్ చేసే వీలుంది. దీంతో.. కశ్మీర్ సమస్యకు దాదాపుగా చెక్ పెట్టేసినట్లే. ఈ వ్యూహంతోనే మూడు ముక్కలుగా చేయాల్సింది.. రెండు భాగాలతో మోడీ సర్కారు సరి పెట్టిందని చెప్పక తప్పదు. దీర్ఘ కాలిక ప్రయోజనాలతో పాటు.. ముందుచూపుతో మోడీ సర్కారు వ్యవహరించిందని చెప్పాలి. అంతేకాదు.. కశ్మీరం చలి మంటల్లో రాజకీయాల్ని నడిపేందుకు వీల్లేని విధంగా మోడీ సర్కారు వ్యవహరించింది.