Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ ను ఈతరం మర్చిపోయిందా?
By: Tupaki Desk | 12 Jan 2019 5:53 AM GMTఎంతోకాలంగా సృష్టించిన హైప్.. ఎన్నుంటే అన్ని థియేటర్లలో రిలీజ్... పైగా తెలుగుదేశం పార్టీ సపోర్ట్.. ఇన్ని కారణాలున్నప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ ఎలా ఆడాలి? కలక్షన్ల వర్షం కురవాలి. జనం ఈ సినిమా గురించి తప్ప ఇంకో విషయం చర్చించుకోకూడదు. కానీ, ఏమైంది..? థియేటర్ల దగ్గర టిక్కెట్లుగా ఫ్రీగా పంచాల్సిన పరిస్థితి. మొదటి రోజు కలెక్షన్లే అంతంతమాత్రంగా ఉన్న పరిస్థితి. దీనికి కారణమేంటి? సినిమా అంత దారుణంగా తీశారా? కానేకాదు... అనుకూల - వ్యతిరేక వెబ్ సైట్లు - పత్రికలు - ఛానళ్లు కూడా రివ్యూల్లో బాగుందనే రాశాయి. మంచి రేటింగే ఇచ్చాయి. మరెందుకిలా? అంటే... కారణం, ఈ తరం గుండెల్లో ఎన్టీఆర్ లేకపోవడమే అని చెప్పాలి.
ఎన్టీఆర్ అంటే ఒక ఐకాన్. సినిమా - రాజకీయం రెండు రంగాల్లోనూ ఇప్పటికీ ఆయన్ను లెజెండ్ గానే చెప్తారు. కానీ, ఆయన బయోపిక్ మాత్రం దారుణంగా ప్లాఫయ్యింది. ఇందుకు చాలా కారణాలున్నా ప్రధాన కారణం ముందటి తరంలా ఈ తరం మనసుల్లో ఆయన లేకపోవడం. ఇంకా చెప్పాలంటే ఎన్టీఆర్ ను ఒక వర్గం ఓన్ చేసుకోవడంతో మిగతా వారు ఆయన పట్ల వ్యతిరేకత పెంచుకోవడం. ఒక్క మాటలో చెప్పాలంటే... రాజ్యాంగాన్ని రచించడంతో పాటు ఆధునిక భారతదేశ చరిత్రలో ఎంతో భాగస్వామ్యం ఉన్న అంబేడ్కర్‌ను ప్రస్తుత సమాజం కేవలం దళితుల నేతగా చూసినట్లే... ఎన్టీఆర్‌ను కూడా కమ్మ సామాజికవర్గానికే పరిమితం చేశారు. ఈ సినిమా దెబ్బతినడానికి ఇదే ప్రధాన కారణం.
ఇంకొన్ని తప్పటడుగులూ ఈ సినిమాను దెబ్బతీశాయి. ఎన్టీఆర్ నట వారసత్వాన్ని పునికి పుచ్చుకుని.. అచ్చుగుద్దినట్లు ఆయన పోలికలతోనే ఉంటూ పౌరాణిక - సాంఘిక చిత్రాలు ఏవైనా కానీ మళ్లీ పెద్ద ఎన్టీఆర్ ని గుర్తు తెచ్చే జూనియర్ ను ఈ సినిమాలో కనీసం యువ ఎన్టీఆర్ పాత్రకైనా తీసుకుని ఉంటే బాగుండేది.
కానీ... ఎందుకనో అది జరగలేదు. థియేటర్ల గుత్తాధిపత్యం చేతిలో ఉన్న దగ్గుబాటి ఇంటి నటుడిని సినిమా హాళ్లకు కొరత రాకుండా ఉండడానికి తీసుకున్నారు కానీ సినిమాకు కొరత రాకుండా సొంతింటిలోని నటుడిని తీసుకోకపోవడం మైనస్ గా మారంది.
మరోవైపు తాజా రాజకీయ పరిస్థితులు కూడా ఈ సినిమాపై ప్రభావం చూపించాయనే చెప్పాలి. కాపు సామాజికవర్గం తెలుగుదేశం పార్టీపై ఆ పార్టీతో సంబంధమున్నవారిపై మండిపడుతోంది. కాపు సామాజికవర్గం నుంచి బలమైన నేతగా ఈ ఎన్నికలకు వెళ్తున్న మరో సినీ హీరో పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీతో విభేదించడమూ కొంత కారణం కావొచ్చు.
దీంతో పాటు నాగబాబు - బాలకృష్ణ మధ్య కొంతకాలంగా తలెత్తిన విభేదాలు రెండు సామాజికవర్గాల సినీ అభిమానుల మధ్య విభజనకు దారితీశాయి. దీంతో ఎన్టీఆర్ సినిమా పట్ల కొంత వ్యతిరేక ప్రచారం జరిగిందన్న వాదనా ఉంది. ఇవన్నీ కలిసి ఎన్టీఆర్ బయోపిక్ ను జనంలోకి తీసుకెళ్లలేకపోయాయి.