Begin typing your search above and press return to search.

పన్నీర్ ఎందుకు ఫెయిల్ అయ్యారు?

By:  Tupaki Desk   |   19 Feb 2017 5:23 AM GMT
పన్నీర్ ఎందుకు ఫెయిల్ అయ్యారు?
X
అపద్ధర్మ ముఖ్యమంత్రిగా చేతిలో ఉండాల్సినంత పవర్. ఇంతకు ముందే ముఖ్యమంత్రిగా వ్యవహరించటం.. తన మంత్రివర్గ సభ్యులతోసంబంధాలు.. అన్నింటికి మించి అమ్మకు అత్యంత విధేయుడు.. ప్రతిపక్షాల మద్దతు.. సామాన్యుల నుంచి సానుకూలత.. సోషల్ మీడియా అండాదండా.. వీటన్నింటికి మించి కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం.. ఇన్ని ఉన్న వ్యక్తిని ముఖ్యమంత్రి కాకుండా ఉంటారా? అంటే.. ఉండదనే చెబుతారు ఎవరైనా.

కానీ.. పన్నీర్ సెల్వం ఉదంతంలో మాత్రం ఇది నిజం కాక తప్పలేదు. వ్యక్తిగతంగా పేరు ప్రఖ్యాతులు.. మంచివాడు.. సౌమ్యుడున్న ట్యాగ్ లున్నా కూడా పన్నీర్ ముఖ్యమంత్రి కాలేకపోయారు. ఎందుకలా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అన్నాడీఎంకే అంతర్గత సంక్షోభంలో.. పాలనా అనుభవం పెద్దగా లేని.. సానుకూల ఇమేజ్ ఏ మాత్రం లేని చిన్నమ్మతో తగువ పడినప్పుడు పన్నీర్ విజయానికి అవకాశాలే ఎక్కువని చాలామంది అనుకున్నారు.

కానీ.. అందుకుభిన్నమైన పరిస్థితులు.. పరిణామాలు చోటు చేసుకున్నాయి. అన్నివిధాలుగా సానుకూలతలున్నపవర్ ఫుల్ పన్నీర్ ది ఇప్పుడు ప్లాప్ షోగా మారటం వెనకున్న కారణాలేంది? శశికళ విజయానికి దారి తీసిన పరిస్థితులేంది? అన్నదిచూస్తే.. పన్నీర్ చేసిన తప్పులు.. శశికళ చేసిన ఒప్పులు ఇట్టే కనిపిస్తాయి.

పన్నీర్ చేసిన తప్పులు..

1. పన్నీర్ మెతక వైఖరి.

2. అమ్మ పట్ల అభిమానంతో ఎమ్మెల్యేలు తన దగ్గరకే వస్తారన్న ధీమా

3. ఇంట్లో వెయిట్ చేయటం తప్పించి.. తెర వెనుక ప్రయత్నాలు చేయకపోవటం

4. శశికళతో ఉంటే.. నష్టమేనన్న సందేశాన్ని సమర్థవంగా వినిపించకపోవటం

5. తనతో చేతులు కలకపోతే మధ్యంతరం ఖాయమన్న విషయాన్ని కన్వే చేయకపోవటం

6. శశికళ కంటే తనకే ఎక్కువ ఇమేజ్ ఉందన్న విషయాన్ని అర్థమయ్యేలా చెప్పలేకపోవటం

7. సై అంటే సై అనాల్సిన వేళ.. పెద్దరికంతో వ్యవహరించటం

8. ఎత్తులకు పై ఎత్తులు వేసే అలవాటు లేకపోవటం

9. మన్నార్ గుడి మాఫియాకు చెక్ పెట్టే తెగువను ప్రదర్శించకపోవటం

10. అక్రమాస్తుల కేసులో దోషిగా నిరూపితమైన వెంటనే అష్టదిగ్బందం చేయలేకపోవటం

శశికళ చేసిన ఒప్పులు

1. విధేయులు చేజారిపోకుండా చూసుకోవటం

2. ఏ దశలోనూ వారిలో నమ్మకం పాళ్లు తగ్గని రీతిలో జాగ్రత్తలు

3. నయానా భయానో బుజ్జగించటం.. బెదిరించేందుకు వెనుకాకపోవటం

4. రిసార్ట్స్ నుంచి బయటకు వెళ్లే అవకాశాల్లేకుండా చేయటం

5. బయట ప్రపంచంలో ఏం జరుగుతుందోనన్న సమాచారం తెలీకుండా చేయటం

6. జయటీవీని చూపిస్తూ.. ఎమ్మెల్యేల్ని ట్రాన్స్ లో ఉంచేయటం

7. తనను నమ్మకుంటే మధ్యంతరంతో అడ్డంగా మునిగిపోతారన్నది అర్థమయ్యేలా చేయటం

8. పన్నీర్ కు ప్రజాదరణతో పాటు.. పాలనా సామర్థ్యం లేదన్న ప్రచారం

9. పదవుల మీద ఆశ ఉన్న వారికి అవకాశాలు కల్పిస్తామన్న ఆఫర్లు

10. ఎవరికివారికి ఉన్నవ్యక్తిగత అవసరాల్ని తీర్చేలా ఏర్పాట్లు

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/