Begin typing your search above and press return to search.
ఆ కారణంతోనే పవన్ యాత్ర ఆగిందా?
By: Tupaki Desk | 24 May 2018 8:14 AM GMTజనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటనలో ఆసక్తికర పరిణామాలు ఏర్పడుతోన్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై, టీడీపీ ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో పవన్ విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో సడెన్ గా నేడు పవన్ యాత్రకు బ్రేక్ పడింది. భద్రతా సిబ్బంది సరిపడా లేకపోవడంతోనే నేటి పోరాట యాత్ర టెక్కలిలో ఆగిపోయిందని తెలుస్తోంది. పవన్ ను చూసేందుకు వచ్చిన అభిమానులను నిలువరించే యత్నంలో బౌన్సర్లు సంయమనం కోల్పోయారని తెలుస్తోంది. దీంతో, పవన్ అభిమానులకు...ఆయన బౌన్సర్లకు మధ్య జరిగిన తోపులాటలో అభిమానులతో పాటు కొంతమంది సిబ్బంది కూడా గాయపడ్డారని తెలుస్తోంది. ఈ ఘటనలో గాయపడ్డ అభిమానులు గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. దీంతో, అభిమానులను బుజ్జగించే ప్రయత్నంలోనే పవన్ ...పాత బౌన్సర్ల స్థానంలో కొత్త బౌన్సర్లను నియమించబోతున్నారని టాక్. పాత బౌన్సర్లను హైదరాబాద్ కు పంపివేసి...కొత్త బౌన్సర్లను శ్రీకాకుళం పిలిపించారట. ఈ నేపథ్యంలోనే పవన్ పోరాట యాత్రకు ఈ రోజు బ్రేక్ పడిందని టాక్. ఈ రోజు సాయంత్రం పవన్ పోరాట యాత్ర తదుపరి షెడ్యూల్ ను వెల్లడించనున్నారు.
వాస్తవానికి పవన్ పోరాట యాత్రకు...ఆయన బస చేసే రిసార్ట్ లు - కల్యాణ మండపాలకు ప్రభుత్వం తరఫు నుంచి పెద్దగా పోలీసు బందోబస్తు లేదనే ఆరోపణలున్నాయి. మొదటి నుంచి పవన్ యాత్రకు ఆయన వ్యక్తిగత సిబ్బందే భద్రతా సిబ్బందిగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ ను చూసేందుకు వచ్చిన అభిమానులను నిలువరించే ప్రయత్నంలో భద్రతా సిబ్బంది గాయపడ్డారట. పోరాట యాత్ర సందర్భంగా పవన్ అభిమానులకు - ఆయన బౌన్సర్లకు మధ్య తోపులాట జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో కొందరు అభిమానులతో పాటు - బౌన్సర్లు కూడా గాయపడ్డారని టాక్. బౌన్సర్లు సంయమనం పాటించి ఉంటే తోపులాట జరిగి ఉండేది కాదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ కు ఏపీ సర్కార్ భారీ భద్రతను కల్పించింది. పవన్ యాత్రతో పాటు ఆయన బస చేస్తున్న విడిది వద్ద కూడా భారీ భద్రతను ఏర్పాటు చేసింది. అభిమానులకు - పవన్ బౌన్సర్లకు మధ్య తోపులాట జరిగినట్టు, వారు గాయపడినట్లు తమకు సమాచారం లేదని పోలీసు ఉన్నతాధికారులు అంటున్నారు.